CBSE | 2 నిమిషాల్లో 15 లక్షల సైబర్ దాడులు.. రీవాల్యుయేషన్ పోర్టల్ హ్యాక్‌కు గురవడంపై సీబీఎస్ఈ బోర్డు క్లారిటీ
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రీవాల్యుయేషన్ పోర్టల్‌ను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు సైబర్ దాడులకు (Cyberattack) పాల్పడినట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఈ పోర్టల్‌పై 1.5 మిలియన్ల (15 లక్షల) హిట్స్ వచ్చినట్లు వెల్లడించింది.
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)పై సైబర్ దాడి జరిగిన విషయం తెలిసిందే. రీవాల్యుయేషన్ పోర్టల్ పేమెంట్ సిస్టమ్ హ్యాక్‌కు గురవడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై బోర్డు తాజాగా స్పందించింది. రీవాల్యుయేషన్ పోర్టల్‌ను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు సైబర్ దాడులకు (Cyberattack) పాల్పడినట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఈ పోర్టల్‌పై 1.5 మిలియన్ల (15 లక్షల) హిట్స్ వచ్చినట్లు వెల్లడించింది.
ఈ మేరకు సీబీఎస్ఈ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్‌ను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున 'డినైయల్-ఆఫ్-సర్వీస్' (DoS) దాడి జరిగిందని తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే పలు సైబర్ దాడులను ఎదుర్కొన్నట్లు పేర్కొంది. సైట్‌ను డౌన్ చేయడమే కాకుండా, పోర్టల్‌లో ఉన్న ఫైళ్లను అనధికారికంగా యాక్సెస్ చేయడానికి (Unauthorized file access) లక్షకు పైగా ప్రయత్నాలు జరిగాయని వివరించింది. వేలాది మంది విద్యార్థులు రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్‌ను యాక్సెస్ చేస్తుండగా దుండగులు సైబర్ దాడుల ద్వారా సేవలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించినట్లు తెలిపింది.
తమ సైబర్ సెక్యూరిటీ బృందాలు సేవలను పునరుద్ధరించినట్లు పేర్కొంది. ఈ పోర్టల్ ప్రస్తుతం ఎలాంటి ఆటంకాలూ లేకుండా సాధారణంగానే పనిచేస్తోందని బోర్డు వెల్లడించింది. "ప్రస్తుతం సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్ పోర్టల్ ఒకే సమయంలో 8,000 మందికి పైగా రియల్ టైమ్ యూజర్లకు (Concurrent Users) మద్దతు ఇస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు 16,000 మందికి పైగా విద్యార్థులు తమ దరఖాస్తులను విజయవంతంగా పూర్తి చేశారు" అని సీబీఎస్‌ఈ కేంద్ర కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
Update from our Cybersecurity Teams:
The CBSE revaluation portal is currently supporting over 8,000 concurrent users. As of 3:00 PM today, more than 16,000 students have successfully completed their submissions.
While thousands of students accessed the CBSE re-evaluation portal…
— CBSE HQ (@cbseindia29) June 2, 2026
Also Read..
రాజస్థాన్‌లో దుమ్ము తుఫాను విధ్వంసం.. ఇద్దరు చిన్నారులు మృతి
తమిళనాడులో బీజేపీకి షాక్.. అన్నామలై రాజీనామా
డీకేతో ఒప్పందం.. రాజీనామా చేసినా సీఎం బంగ్లాలోనే సిద్ధరామయ్య..!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Alleti Maheshwar Reddy | బీజేపీ వస్తేనే నీళ్లు, నియామకాలు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- ●dust storm | రాజస్థాన్‌లో దుమ్ము తుఫాను విధ్వంసం.. ఇద్దరు చిన్నారులు మృతి
- ●Rashmika Mandanna | రష్మిక గ్లామర్ రచ్చ - లెస్బియన్ లవ్‌స్టోరీపై క్లారిటీ - కాక్టెయిల్ 2 ట్రైలర్ రిలీజ్
- ●NHPC | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. NHPC లో 6 శాతం వాటా విక్రయం.. ఇప్పుడు కొనవచ్చా..?
- ●RTC MD Nagireddy | రాష్ట్ర ప్రగతిలో ఆర్టీసీ భాగమవడం గర్వకారణం: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
- ●Annamalai | తమిళనాడులో బీజేపీకి షాక్.. అన్నామలై రాజీనామా

Alleti Maheshwar Reddy | బీజేపీ వస్తేనే నీళ్లు, నియామకాలు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి

dust storm | రాజస్థాన్‌లో దుమ్ము తుఫాను విధ్వంసం.. ఇద్దరు చిన్నారులు మృతి

Rashmika Mandanna | రష్మిక గ్లామర్ రచ్చ - లెస్బియన్ లవ్‌స్టోరీపై క్లారిటీ - కాక్టెయిల్ 2 ట్రైలర్ రిలీజ్

NHPC | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. NHPC లో 6 శాతం వాటా విక్రయం.. ఇప్పుడు కొనవచ్చా..?






