Alleti Maheshwar Reddy | బీజేపీ వస్తేనే నీళ్లు, నియామకాలు: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Alleti Maheshwar Reddy | బీజేపీతోనే సామాజిక తెలంగాణ సాధ్యమని శాసనసభా పక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత సామాజిక తెలంగాణ సాకారమవుతుందన్నారు.
Alleti Maheshwar Reddy | త్రినేత్ర.న్యూస్: బీజేపీతోనే సామాజిక తెలంగాణ సాధ్యమని శాసనసభా పక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడారు.
నిజాంల పాలనలో ఇబ్బందులు పడ్డాం..
తెలంగాణ రాష్ట్రం 1948, సెప్టెంబర్ 17న ఏర్పడింది. అప్పటి నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల అరాచకాలతో తెలంగాణ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. రాష్ట్ర ప్రజలంతా ఏకమై సాయుధ పోరాటం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం కోసం, స్వేచ్ఛ కోసం, స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మళ్లీ నెహ్రూ కుతంత్రం వల్ల, ఆంధ్రా పాలకుల బారిన పడి అనేక ఇబ్బందులు పడ్డాం. మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేక పోరాటాలు చేశాం. పోరాటాలతో, బలిదానాలతో తెలంగాణను సాధించుకున్నాం అని ఏలేటి గుర్తు చేశారు.
బీజేపీతోనే సామాజిక తెలంగాణ సాధ్యం..
కానీ ఈరోజు ప్రజలు కలలు కన్న తెలంగాణ లేదు. అందరూ నిరాశతో ఉన్నారు. గత పదేళ్లుగా నిరంకుశ పాలనలో కేవలం దోపిడీ జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏ తెలంగాణ అయితే తెచ్చుకున్నమో అవి నెరవేరలేదు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మనం కోరుకునే తెలంగాణ కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత సామాజిక తెలంగాణ సాకారమైతది. నీళ్లు, ఉద్యోగాలు అన్నీ నెరవేరుతయి. రేపు జరిగే యుద్ధంలో అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలి అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- ●Pawan Kalyan | 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ చేస్తుంది.. పవన్ కల్యాణ్ ప్రకటన
- ●Vemula Veeresham | ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావు: వేముల వీరేశం
- ●IT Returns | ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఫామ్ 16 తప్పనిసరిగా ఉండాలా..?
- ●Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ మూవీ - దృశ్యంకు మించిన ట్విస్ట్‌లతో
- ●ATA | ఆటా తెలుగు మహాసభలకు రండి.. హరీశ్‌రావును ఆహ్వానించిన బృందం సభ్యులు
- ●Shambipur Raju | ఇదేనా అమరులకిచ్చే గౌరవం?: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Pawan Kalyan | 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ చేస్తుంది.. పవన్ కల్యాణ్ ప్రకటన

Vemula Veeresham | ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావు: వేముల వీరేశం

IT Returns | ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఫామ్ 16 తప్పనిసరిగా ఉండాలా..?

Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ మూవీ - దృశ్యంకు మించిన ట్విస్ట్‌లతో



