Lalit Modi | సుస్మిత సేన్ ‘గోల్డ్ డిగ్గర్’ కాదు.. నేనే ఆమె సంపాదనపై ఆధారపడేవాడిని : లలిత్ మోదీ
Lalit Modi | బాలీవుడ్ నటి సుస్మితా సేన్ (Sushmita Sen)పై గతంలో వచ్చిన 'గోల్డ్ డిగ్గర్' (Gold Digger) ఆరోపణలను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) తీవ్రంగా ఖండించారు. "ఆమె గోల్డ్ డిగ్గర్ కాదు.. నేనే డైమండ్ డిగ్గర్" అని లలిత్ మోదీ వ్యాఖ్యానించారు.
Lalit Modi | బాలీవుడ్ నటి సుస్మితా సేన్ (Sushmita Sen)పై గతంలో వచ్చిన 'గోల్డ్ డిగ్గర్' (Gold Digger) ఆరోపణలను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) తీవ్రంగా ఖండించారు. తమ రిలేషన్‌షిప్ ఎప్పుడూ డబ్బు చుట్టూ తిరగలేదని తెలిపారు. సుస్మిత స్వయంకృషితో ఎదిగిన మహిళ అని.. ఆమె డబ్బు మనిషి కాదని స్పష్టం చేశారు. "ఆమె గోల్డ్ డిగ్గర్ కాదు.. నేనే డైమండ్ డిగ్గర్" అని లలిత్ మోదీ వ్యాఖ్యానించారు.
కాగా, సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు 2022లో లలిత్ మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమెతో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలను కూడా లలిత్ మోదీ పంచుకున్నారు. భవిష్యత్తులో ఆమెను పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వీరు మాల్దీవుల్లో తిరిగిన ఫోటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక తమ బంధం గురించి సుస్మితా సేన్ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. ఇక కొన్నాళ్లకే వీరి మధ్య బ్రేకప్ అయ్యింది. అయితే, ఆ తర్వాత సుస్మితపై అనేక ఆరోపణలు వచ్చాయి. డబ్బు కోసమే లలిత్ మోదీతో సుస్మిత సన్నిహితంగా మెలుగుతోందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆమెను గోల్డ్ డిగ్గర్ అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో రూమర్స్‌పై లలిత్ మోదీ తాజాగా స్పందించారు. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' (Humans of Bombay) పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ మాట్లాడుతూ.. "నా జీవితంలో సుస్మిత చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి, వ్యక్తిగా ఎదగడానికి ఆమె ఎంతో దోహదపడింది. ఆ సమయంలో ఆమె నా జీవితంలో ఒక ముఖ్య భాగం. సుస్మిత స్వయంకృషితో ఎదిగిన మహిళ. ఈ భూమిపై నాకు తెలిసిన చాలా మంది కంటే ఆమె దగ్గరే ఎక్కువ వజ్రాలు ఉన్నాయి. ఆమె చాలా ధనవంతురాలు. తన సొంత కష్టంతోనే ఆమె ఈ స్థాయికి చేరుకుంది.
నేను ఆమెతో కలిసి బయటకు వెళ్లినప్పుడు.. నేను డబ్బులు చెల్లించాల్సిన అవసరమే వచ్చేది కాదు. అన్నింటికీ ఆమెనే డబ్బులు చెల్లించేది. నిజం చెప్పాలంటే నేనే ఒక రకంగా ఆమె డబ్బుపై ఆధారపడేవాడిని. ఆమె ఎవరి దగ్గర నుంచి ఏదీ ఆశించదు అంటూ లలిత్ మోదీ చెప్పుకొచ్చారు. భౌగోళిక దూరమే తమ బంధానికి అడ్డుగా మారిందన్నారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి ఉంటే ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేదేమో అని గత జ్ఞాపకాలను లలిత్ మోదీ గుర్తు చేసుకున్నారు.
Also Read..
స్పిరిట్‌పై కొత్త అప్‌డేట్ - ప్రభాస్ సినిమాలో పవన్ కళ్యాణ్ అత్త
EVల వైపు భారత్ పరుగులు.. పెట్రోల్ ధరల షాక్‌తో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్..
తాజావార్తలు
- ●US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..
- ●Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం
- ●FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!
- ●Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...
- ●ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..
- ●Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

US Shooting | అమెరికాలో నలుగురి ప్రాణాలు తీసిన దుండగుడు..

Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం

FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!

Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...




