త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

dust storm | రాజ‌స్థాన్‌లో దుమ్ము తుఫాను విధ్వంసం.. ఇద్ద‌రు చిన్నారులు మృతి

dust storm | రాజ‌స్థాన్ (Rajasthan)లో మ‌రోసారి దుమ్ము తుఫాను (dust storm) విధ్వంసం సృష్టించింది. ఈ ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఇద్ద‌రు చిన్నారులు బ‌ల‌య్యారు. అనేక మంది గాయ‌ప‌డ్డారు.

D

National | Published On Jun 2, 2026, 4.30 pm IST

dust storm | రాజ‌స్థాన్‌లో దుమ్ము తుఫాను విధ్వంసం.. ఇద్ద‌రు చిన్నారులు మృతి
Advertisement

dust storm | రాజ‌స్థాన్ (Rajasthan)లో మ‌రోసారి దుమ్ము తుఫాను (dust storm) విధ్వంసం సృష్టించింది. సోమ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత బార్మ‌ర్ (Barmer) జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బ‌ల‌మైన ఈదురుగాలులు, వ‌ర్షం బీభ‌త్సం సృష్టించింది. ప‌లు ఇళ్లు ధ్వంస‌మ‌య్యాయి. ఈ ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఇద్ద‌రు చిన్నారులు బ‌ల‌య్యారు. అనేక మంది గాయ‌ప‌డ్డారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సోమ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర‌మైన గాలులు, వ‌ర్షం బీభ‌త్సం సృష్టించాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల‌కూలాయి. బోలా గ్రామ పంచాయతీ పరిధిలోని శబరి నగర్ గ్రామంలో (Sabri Nagar village) గాలుల తీవ్ర‌త‌కు రేకులు షెడ్డు కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రులు జిల్లా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా, శనివారం మధ్యాహ్నం చురు (Churu), బికనీర్ (Bikaner) జిల్లాల్లో ఊహించని రీతిలో భారీ ఇసుక తుఫాను (Sandstorm) విరుచుకుపడింది. దీంతో పట్టపగలే దట్టమైన చీకటి కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ తర్వాత కురిసిన భారీ వర్షంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. ఈ డస్ట్ స్టార్మ్ (Dust storm) దాదాపు 30 నిమిషాల‌పాటూ కొన‌సాగింది. ఆ త‌ర్వాత భారీ వ‌ర్షం కురిసింది. దీంతో నివాస ప్రాంతాలన్నీ ఇసుక, బురదతో నిండిపోయాయి. చురు, బికనీర్‌తో పాటు శ్రీ గంగానగర్, జైపూర్ వంటి ఇతర నగరాల్లోనూ ఇలాంటి ప్రతికూల పరిస్థితులే నెలకొన్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీని కూడా ఇసుక తుఫాను తాకింది.

Also Read..

త‌మిళ‌నాడులో బీజేపీకి షాక్‌.. అన్నామ‌లై రాజీనామా

డీకేతో ఒప్పందం.. రాజీనామా చేసినా సీఎం బంగ్లాలోనే సిద్ధ‌రామ‌య్య‌..!

హైదరాబాద్‌లో హైటెన్షన్.. గన్ పార్క్ వద్ద కాంగ్రెస్, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట.. పోటాపోటీ నినాదాలు

Advertisement
Advertisement