Lawyer Mohizuddhin murdered | న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసు.. ఐదుగురు నిందితుల అరెస్టు
Lawyer Mohizuddhin murdered | హైదరాబాద్ నగరంలో న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో హైదరాబాద్‌కు చెందిన ఆలంఖాన్ తో పాటు ఆయన కుమారుడు ముజాహిద్ ఆలంఖాన్ సహా గ్యాంగ్ నలుగురు నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తన భూములకు అడ్డం పడుతున్నాడనే కారణంగానే మొహిజుద్దీన్‌ను వారు హత్య చేసినట్టు పోలీసులు చెప్పారు.
Lawyer Mohizuddhin murdered | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ నగరంలో న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఆలంఖాన్ తో పాటు ఆయన కుమారుడు ముజాహిద్ ఆలంఖాన్ సహా గ్యాంగ్ నలుగురు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొహిజుద్దీన్ చంపేందుకు ఆలంఖాన్ రూ.25 లక్షల సుపారీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. తన భూములకు అడ్డం పడుతున్నాడనే కారణంగానే మొహిజుద్దీన్‌ను వారు హత్య చేసినట్టు పోలీసులు చెప్పారు.
హత్యా సమయంలో కారులో ముగ్గురు...
అయితే మొహిజుద్దీన్ హత్య కోసం ఆలంఖాన్ ఇంతకుముందు నుంచే 10 సార్లు పథకం వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే మొహిజుద్దీన్‌ను సుపారీ గ్యాంగ్ కారుతో ఢీకొట్టి చంపినట్టు వెల్లడించారు. స్టంట్స్ చేయడంలో అనుభవం ఉన్న అభిజితే ఆ రోజు కారు నడిపాడు. మణిదీప్, వినయ్ అందులో కూర్చున్నారు. డ్రైవింగ్ నైపుణ్యం కారణంగానే ఇతడు నడిపిన కారు, మొయిజుద్దీన్ ఎక్కబోయిన కారు రెండింటిలో ఏదీ ధ్వంసమవలేదు. కారుకు నెంబర్ ప్లేట్ లేకపోయినా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పరిశీలించారు. వాటి ఆధారంగానే అభిజిత్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
న్యాయవాదికి రెండు కోట్లు ఆఫర్..
మొహిజుద్దీన్ కొన్నేళ్లుగా వక్ఫ్ భూములను కాపాడేందుకు పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఓ భూమికి సంబంధించి బర్కత్‌పురకు చెందిన ఆలంఖాన్‌తో ఆయనకు విభేదాలున్నాయి. తమ ఆధీనంలో ఉన్న ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ పలుమార్లు బెదిరించారు. భూ వివాదం కేసు నుంచి తప్పుకుంటే రూ.2 కోట్లు ఇస్తామంటూ మొహిజుద్దీన్‌కు ఆఫర్ కూడా చేశారు. మొయిజుద్దీన్‌ను ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా అంతమొందించాలని భావించారు. నగరానికి చెందిన కిషన్ సింగ్ అలియాస్ పప్పును కలిసి హత్యా విషయం చెప్పారు. ముందుగానే సుపారీ కింద రూ.15 లక్షలు చెల్లించారు. హత్య బాధ్యతను కవాడిగూడకు చెందిన సింగూరి అభిజీత్ అలియాస్ నాని, వినయ్, మణిదీప్‌లకు అప్పగించి రూ.10 లక్షలు చెల్లించాడు. ఈ ముగ్గురూ పప్పుతో కలిసి పథకం వేసి, కారు కొని, రెక్కీ చేసి గత శనివారం మొయిజుద్దీన్‌ను రెడ్‌హిల్స్ శాంతినగర్‌లో హత్య చేశారు.
సంబంధిత వార్తలు

KTR | ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయిద్దాం
సెప్టెంబర్ 26, 2026

Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు – హీరోయిన్గా రాజశేఖర్ కూతురు
సెప్టెంబర్ 26, 2026

Election Commission of India | ‘సర్’ నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు
- ●Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు
- ●Minister Ponguleti | పేదల సొంతింటి కల సాకారం చేస్తాం : మంత్రి పొంగులేటి
- ●Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్
- ●Ponnam Prabhakar | నేత కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి పొన్నం
- ●House Husbands New Normal | హోమ్‌మేకర్ కేవలం మహిళలకే ఎందుకు.. ‘హౌస్ హజ్బెండ్స్’ ట్రెండ్ రావాలి

Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు - హీరోయిన్గా రాజశేఖర్ కూతురు

Election Commission of India | 'సర్' నోటీసులొచ్చాయా? మీ ఇంటికే రానున్న BLOలు.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు

Minister Ponguleti | పేదల సొంతింటి కల సాకారం చేస్తాం : మంత్రి పొంగులేటి

Ponnam Prabhakar | కుల వృత్తిదారులకు 50 ఏళ్లకే పెన్షన్



