త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | పూలే దంప‌తుల స్ఫూర్తితో మ‌హిళ‌ల‌కు 33 శాతం సీట్లు ఇస్తం

Ramchandar Rao | పూలే దంప‌తుల స్ఫూర్తితో మ‌హిళ‌ల‌కు 33 శాతం (Women Reservation) సీట్లు ఇస్తామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు (Ramchandar Rao) అన్నారు.

S

Telangana | Published On Nov 28, 2026, 1.38 pm IST

Ramchandar Rao | పూలే దంప‌తుల స్ఫూర్తితో మ‌హిళ‌ల‌కు 33 శాతం సీట్లు ఇస్తం
Advertisement
  • 145 కోట్ల జ‌నాభాకు సీట్లు పెర‌గాలా వద్దా?
  • నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్లు స‌మానంగా ఉండాలి
  • సౌత్‌, నార్త్ ఈస్ట్ ప్రాంతాల‌కు కొంత అన్యాయం జ‌ర‌గొచ్చు
  • రేపు పెట్ట‌బోయే బిల్లుకు దేశ‌మంతా మ‌ద్ద‌తివ్వ‌బోతుంది
  • పూలే వ‌ర్ధంతి కార్య‌క్ర‌మంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు వ్యాఖ్య‌లు

Ramchandar Rao |  త్రినేత్ర న్యూస్‌: పూలే దంప‌తుల స్ఫూర్తితో మ‌హిళ‌ల‌కు 33 శాతం (Women Reservation) సీట్లు ఇస్తామ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు (Ramchandar Rao) అన్నారు. విద్యావ‌కాశాల‌తో పాటు వారికి రాజ‌కీయ అధికారం కూడా ఉండాల‌న్నారు. డీలిమిటేష‌న్ బిల్లు (Delimitation Bill)తో సౌత్‌, నార్త్ ఈస్ట్ ప్రాంతాల‌కు కొంత అన్యాయం జ‌ర‌గొచ్చ‌న్నారు. రేపు పెట్ట‌బోయే బిల్లుకు దేశ‌మంతా మ‌ద్ద‌తివ్వ‌బోతున్న‌ట్లు చెప్పారు. రాహుల్, రేవంత్ క‌లిసి దేశాన్ని ఏం చేయాల‌నుకుంటున్నారో అర్థం కావ‌డం లేద‌న్నారు. మ‌హాత్మా జ్యోతిరావు పూలే వ‌ర్ధంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్లు స‌మానంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

పూలే 135వ వ‌ర్ధంతిని జ‌రుపుకున్నం. పూలే దంప‌తులు స‌మాజంలో ఉన్న జాతి వివ‌క్ష‌పై పోరాడారు. మ‌హిళ‌ల‌కు చ‌దువుకునే అవ‌కాశం క‌ల్పించారు. ఈరోజు దేశం మొత్తం గ‌ర్విస్తుంది. వారి ఆశ‌యాల‌ను నెర‌వేర్చాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌హిళ‌ల‌కు విద్యావ‌కాశాలు పెర‌గాలి. దీంతో పాటు రాజ‌కీయ అధికారం కూడా ఉండాలి. అందుకే మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌తో మోదీ ముందుకెళ్తున్నారు. రేపు పెట్ట‌బోయే బిల్లుకు దేశ‌మంతా మ‌ద్ద‌తు ప‌లుకుతుంది. కాంగ్రెస్ పార్టీ బ‌య‌ట‌కు మాత్రం వ్య‌తిరేకం కాదంటూనే వ్య‌తిరేకిస్తున్న‌ది. మొన్ననే ఈ బిల్లు పాస‌య్యేది.

జ‌నాభాను బ‌ట్టే సీట్లు కేటాయించ‌డం జరుగుతుంది. జ‌నాభా ప్ర‌కారం చూస్తే ద‌క్షిణ ప్రాంతానికి కొంత‌, నార్త్ ఈస్ట్ ప్రాంతానికి అన్యాయం జ‌రిగే అవ‌కాశం ఉంది. వారు సీట్లు కోల్పోయే అవ‌కాశం ఉంది. ప్ర‌తి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచితే ఏ ప్రాంతానికి న‌ష్టం జ‌ర‌గ‌ద‌నే ఆలోచ‌న‌తో మోదీ ఉన్నారు. తెలంగాణ‌లో 170కి పైగా అసెంబ్లీ సీట్లు రావొచ్చు. పార్ల‌మెంటు సీట్లు కూడా 25 దాకా పెరిగే అవ‌కాశం ఉంది.

ఎస్సీ, ఎస్టీలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావొద్ద‌ని కాంగ్రెస్ కుట్ర‌

గ‌తంలో తీసుకొచ్చిన మ‌హిళా రిజర్వేష‌న్ బిల్లును రాజీవ్ గాంధీ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేయ‌లే. యూపీఏ స‌భ్యులు బిల్లు రాకుండా చేశారు. మోదీ వ‌చ్చిన త‌ర్వాత‌నే ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. 1971లో 56 కోట్ల జ‌నాభాకు 543 సీట్లు కేటాయించారు. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం ఇప్పుడున్న జ‌నాభా ప్ర‌కారం సీట్లు పెంచాల్సి ఉంది. ఎస్సీల‌కు, ఎస్టీల‌కు సీట్లు పెరుగుతాయి. మ‌హిళ‌ల‌కు 33 శాతం అవ‌కాశం ఉంటుంది. కానీ ఎస్సీలు, ఎస్టీలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావొద్ద‌ని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది. 145 కోట్ల జ‌నాభాకు సీట్లు పెర‌గాలా వద్దా? అటు రాహుల్‌గాంధీ, ఇటు రేవంత్‌రెడ్డి దేశాన్ని ఏం చేయాల‌నుకుంటున్నారో అర్థం కావ‌ట్లేదు. ఎస్సీ, ఎస్టీల‌కు మంచి జ‌రుగుతుంటే వీళ్లు ఓరుస్త‌లేరు. క‌చ్చితంగా మ‌హిళ‌ల‌కు 33 శాతం సీట్లు ఇస్తం.

మ‌ల్కాజిగిరి పార్ల‌మెంటులో 40 ల‌క్ష‌ల ఓట్లున్న‌య్‌

మ‌ల్కాజిగిరి పార్ల‌మెంటులో 40 ల‌క్ష‌ల ఓట్లున్న‌య్‌. శేరిలింగంప‌ల్లి అసెంబ్లీలో ఏడున్న‌ర ల‌క్ష‌ల ఓట్లున్న‌య్‌. అంబ‌ర్‌పేట‌లో రెండున్న‌ర ల‌క్ష‌ల అసెంబ్లీ ఓట్లు.. సికింద్రాబాద్ పార్ల‌మెంటులో 11 ల‌క్ష‌ల ఓట్లు ఉన్న‌య్‌. ఈ అస‌మాన‌తల‌ను స‌మానం చేయాలి. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్లు స‌మానంగా డివైడ్ కావాలి.

Advertisement
Advertisement