త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ఇన్‌ఫ్ల్యూయెన్స‌ర్ల మాయ‌లో ప‌డొద్దు.. యువ‌త‌కు మోదీ కీల‌క సందేశం

PM Modi | యువ‌త‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) కీల‌క సూచ‌న‌లు చేశారు.సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మాయలో పడి సులభమైన మార్గాలను ఎంచుకోవద్దన్నారు. "మనం రీల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల కాలంలో జీవిస్తున్నాం. ఈ షార్ట్‌కట్‌ల యుగంలో కూడా రైల్వే స్టేషన్లలో రాసి ఉండే ఒక మాట గుర్తుంచుకోండి... షార్ట్‌కట్స్‌ విల్‌ కట్‌ యూ షార్ట్ (A shortcut will cut you short)!" అని మోదీ హెచ్చ‌రించారు.

D

National | Published On Aug 12, 2026, 1.00 pm IST

PM Modi | ఇన్‌ఫ్ల్యూయెన్స‌ర్ల మాయ‌లో ప‌డొద్దు.. యువ‌త‌కు మోదీ కీల‌క సందేశం
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : యువ‌త‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) కీల‌క సూచ‌న‌లు చేశారు. రీల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మాయలో పడి సులభమైన మార్గాలను ఎంచుకోవద్దని హిత‌వు ప‌లికారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind) ఆత్మకథ ‘ది ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్’ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్ర‌ధాని పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా యువ‌త‌రానికి పలు కీలక సూచనలు చేశారు.

షార్ట్‌కట్స్‌ విల్‌ కట్‌ యూ షార్ట్‌

ప్ర‌స్తుత కాలంలో యువతపై సోషల్‌ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని ప్ర‌ధాని చెప్పారు. రీల్స్‌, ఇన్‌ఫ్లుయెన్స‌ర్లు, ఇన్‌స్టంట్ గ్రాటిఫికేష‌న్ పెరిగిపోయిన ఆధునిక కాలంలో యువ‌త షార్ట్‌క‌ట్‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. ఇన్‌ఫ్లుయెన్సర్లను అనుసరించడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు. అయితే వారు చూపించే ప్రతి సులభమైన మార్గాన్ని అనుసరించే ముందు ఆలోచించాలని సూచించారు. ఈ సంద‌ర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రమాదకర షార్ట్‌కట్‌ మార్గాలు ఎంచుకోవద్దని రాసే హెచ్చరికలను ఓ ఉదాహ‌ర‌ణ‌గా చెప్పారు. "మనం రీల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల కాలంలో జీవిస్తున్నాం. ఈ షార్ట్‌కట్‌ల యుగంలో కూడా రైల్వే స్టేషన్లలో రాసి ఉండే ఒక మాట గుర్తుంచుకోండి... షార్ట్‌కట్స్‌ విల్‌ కట్‌ యూ షార్ట్ (A shortcut will cut you short)!" అని మోదీ హెచ్చ‌రించారు. జీవితంలో ముందుకు వెళ్లాలనుకునే యువత తమకు నచ్చిన గొప్ప వ్యక్తుల ఆత్మకథలను చదివి.. వారి జీవితానుభవాల నుంచి స్ఫూర్తి పొందాలని కోరారు.

Image

రామ్‌నాథ్ కోవింద్ జీవితం ఒక ఉదాహ‌ర‌ణ..

క‌ఠిన ప‌రిస్థితుల‌ను ప‌ట్టుద‌ల‌, కృషితో ఎలా జ‌యించవ‌చ్చో రామ్‌నాథ్ కోవింద్ జీవితం ఒక ఉదాహ‌ర‌ణ అని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. సాధారణ గ్రామీణ నేపథ్యం నుండి దేశ ప్రథ‌మ పౌరుడిగా ఎదిగే వరకు ఆయన సాగించిన ప్రయాణం ఎంతో స్పూర్తి అని ప్ర‌శంసించారు. రామ్‌నాథ్ కోవింద్ బాల్యంలోనే త‌ల్లిని కోల్పోయార‌ని ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఆ విషాదంతో కుంగిపోకుండా ఆయ‌న మ‌రింత బ‌లంగా ముందుకు సాగార‌ని కొనియాడారు. ఆయన జీవితంలోని పోరాటాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో కోవింద్ రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత కూడా కీలక అంశాలపై పనిచేస్తున్నారని మోదీ ప్రశంసించారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక దిశలో రామ్‌నాథ్‌ గొప్ప కృషి చేశారని, ఆయన చేసిన సూచనలు దేశాన్ని కొత్త దిశలో నడిపించనున్నాయని తెలిపారు.

Image

Also Read..

మ‌హిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. త‌మిళ‌నాడు అసెంబ్లీలో తీర్మానం

జైల్లో ఫోన్‌తో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ

ఓటు షిఫ్ట్ చేశామంతే.‌‌.. తొలగించలేదు.. ప్ర‌కాష్ రాజ్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన ఈసీ

Advertisement
Advertisement