Parliament Monsoon Session | రివర్స్ ఎటాక్.. జార్ఖ్ండ్ నిరసనలపై రాహుల్ సమాధానం చెప్పాలి.. ఎన్డీయే ఎంపీల నిరసన
Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మరింత వేడి రాజుకుంది. నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్, రామమందిరం విరాళాల చోరీ అంశంపై పార్లమెంట్ ఆవరణలోని మకర ద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలుపుతుండగా.. ఎన్డీయే ఎంపీలు ప్రతిపక్షాల చర్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అధికార, ప్రతిపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలతో పార్లమెంట్ ఆవరణలో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
- విద్యార్థుల నిరసలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..
- చర్చ నుంచి రాహుల్ పారిపోతున్నారు : ఎన్డీయే ఎంపీలు
Parliament Monsoon Session | త్రినేత్ర.న్యూస్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మరింత వేడి రాజుకుంది. నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్, రామమందిరం విరాళాల చోరీ అంశంపై పార్లమెంట్ ఆవరణలోని మకర ద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్డీయే ఎంపీలు సైతం ప్రతిపక్షాల చర్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. విపక్షాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. సమావేశాలను సజావుగా సాగనీకుండా విపక్ష ఎంపీలు అడ్డుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదే సమయంలో విపక్ష ఎంపీలు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికార, ప్రతిపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలతో పార్లమెంట్ ఆవరణలో కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

రాహుల్.. జార్ఖండ్ వెళ్లండి
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం 'మంగళ్ మిలన్' ఇవాళ ఉదయం పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఇతర ఎన్డీయే కూటమి ఎంపీలు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఎంపీలంతా పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు నిరసనగా పార్లమెంట్‌వైపు కవాతు నిర్వహించారు. విద్యార్థుల నిరసనలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సభలో సమాధానం ఇచ్చేందుకు అమిత్ షా సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రతిపక్షం పార్లమెంటులో చర్చను తప్పించుకుంటోందని పేర్కొంటూ ఎన్డీయే ఎంపీలు ప్లకార్డులు చేతబూని ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ చర్చ నుంచి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పారిపోతున్నారని ఆరోపించారు.
ముఖ్యంగా జార్ఖండ్ రాంచీలో విద్యార్థుల నిరసనలపై ఎన్డీయే ఎంపీలు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్ జీ.. జార్ఖండ్‌కు వెళ్లండి అంటూ నినదించారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ముఖేష్ దలాల్ రాహుల్‌కు వ్యతిరేకంగా తన నినాదాలను కొనసాగించారు. స్పందించిన ప్రియాంక.. రాహుల్ ఇప్పటికే జార్ఖండ్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులను కలిశారని బదులిచ్చారు.
BJParty MPs have also started considering Rahul Gandhi as the Prime Minister. 🔥🔥
BJPee MPs sloganeered against Rahul Gandhi today, demanding HE visit Jharkhand, until Priyanka Gandhi confronted them.
Think about the irony: The ruling party’s MPs have zero expectation from… pic.twitter.com/9VmLE0eUWU
— Krishna Yadav (@Control_Krishna) August 11, 2026
ఇక విపక్ష ఎంపీలు అయోధ్య రామ మందిరం విరాళాల చోరీపై పార్లమెంట్ ఆవరణలో తమ నిరసనలను కొనసాగించారు. విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ గన్స్ అంశంపై అమిత్ షా సభకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. పోటాపోటీ నినాదాలతో పార్లమెంట్ ఆవరణలో గందరగోళ వాతావరణం నెలకొంది.
#WATCH | Delhi: NDA and Congress MPs hold protest against each other in the Parliament.
NDA MPs' protest against the Opposition, alleging them of running away from discussion in Parliament.
Congress MPs are protesting against the Union Home Minister over the 'police action' on… pic.twitter.com/BVEPvBBJug
— ANI (@ANI) August 11, 2026
Also Read..
ఇరాన్ భయం.. తుర్కియే నుంచి బ్రిటన్‌కు ట్రంప్ సీక్రెట్ జర్నీ సాగిందిలా
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది : సోనియా గాంధీ
విస్కీ, టేకిలా పేర్లతో వేరే చోట అమ్మి చూడండి... లీగల్ నోటీస్ ఖాయం! ఎందుకో తెలుసా?
సంబంధిత వార్తలు

Sonia Gandhi | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది : సోనియా గాంధీ
ఆగస్టు 11, 2026

Om Birla | సభ సజావుగా సాగేందుకు సహకరించండి.. రాజకీయ పార్టీలకు స్పీకర్ ఓం బిర్లా భావోద్వేగ విజ్ఞప్తి
ఆగస్టు 10, 2026

Ram Mandir Theft | అయోధ్య విరాళాల చోరీ.. ప్రధాని నివాసానికి సాధువుల భారీ మార్చ్.. అడ్డుకున్న పోలీసులు
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Telangana Voters | తెలంగాణ ఓటర్లు మొత్తం 2,64,87,214 మంది
- ●Harish Rao | రైతులు ఎదురు చూస్తున్నరు.. రిజర్వాయర్లకు 30 టీఎంసీల నీటిని వెంటనే ఎత్తిపోయండి
- ●Lalithaa Jewellery Mart IPO | ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. లలితా జ్యువెలరీ ఐపీవో వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..
- ●Abhijeet Dipke | రండి.. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుద్దాం : సీజేపీ పిలుపు
- ●Ponnam Prabhakar | సినిమా, పుస్తకాలతో సర్వాయి పాపన్న చరిత్రను భావితరాలకు తెలపొచ్చు.. చిత్ర యూనిట్‌కు అభినందనలు
- ●PM E-DRIVE | ద్విచక్ర వాహనదారులకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ గడువు పెంపు..

Telangana Voters | తెలంగాణ ఓటర్లు మొత్తం 2,64,87,214 మంది

Harish Rao | రైతులు ఎదురు చూస్తున్నరు.. రిజర్వాయర్లకు 30 టీఎంసీల నీటిని వెంటనే ఎత్తిపోయండి

Lalithaa Jewellery Mart IPO | ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. లలితా జ్యువెలరీ ఐపీవో వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

Abhijeet Dipke | రండి.. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుద్దాం : సీజేపీ పిలుపు



