Prajwal Revanna | జైల్లో ఫోన్‌తో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ
Prajwal Revanna | హసన్ నియోజకవర్గానికి చెందిన జనతాదళ్ పార్టీ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అత్యాచారం కేసులో దోషిగా తేలి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష (Bengaluru Prison) అనుభవిస్తున్న రేవణ్ణ ఫోన్‌తో అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
Prajwal Revanna | త్రినేత్ర.న్యూస్ : అత్యాచారం కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ మనవడు, హసన్ నియోజకవర్గానికి చెందిన జనతాదళ్ పార్టీ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష (Bengaluru Prison) అనుభవిస్తున్న రేవణ్ణ వద్ద ఫోన్ (Phone) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జైల్లో క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆకస్మికంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఫోన్‌తో రేవణ్ణ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లోదుస్తుల్లో ఫోన్ దాచినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు, ఆయన వద్ద ఓ పెన్‌డ్రైవ్ కూడా బయటపడింది. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు జైలు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై కొత్తగా మరో కేసు నమోదు చేశారు.
తనిఖీల్లో ప్రజ్వల్ రేవణ్ణ సెల్‌లో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు జైలు లోపలికి ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేపట్టారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈరన్న రంగపూర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. మరోవైపు, భద్రతా లోపాలపై వివరణ కోరుతూ జైలు సూపరింటెండెంట్ అన్సుచ్ కుమార్‌కు షో కాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రజ్వల్ రేవణ్ణ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ హోలినరసిపుర రూపల్ పోలీస్ స్టేషన్‌లో 48 ఏండ్ల మహిళ ఫిర్యాదు చేసింది. 2021లో తనపై రెండుసార్లు లైంగిక దాడి చేశారని ఆరోపించింది. అంతేకాక ఆ దారుణాన్ని మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు హసన్‌లోని అతని ఫామ్‌హౌస్ నుంచి 2,900 వీడియోలు ఉన్న పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అత్యాచార ఆరోపణలు రావడంతో అతను జర్మనీకి పారిపోయాడు. ఆ తర్వాత తిగిరి వచ్చిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయా కేసుల్లో కోర్టు ఆయన్ని దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది. ఇక రేవణ్ణ 2024 లోక్‌సభ ఎన్నికల్లో హసన్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆయన తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఎన్నికల ప్రచారం చేశారు.
Also Read..
ఓటు షిఫ్ట్ చేశామంతే... తొలగించలేదు.. ప్రకాష్ రాజ్ ఆరోపణలను ఖండించిన ఈసీ
ఒకే రోజు 4 అరుదైన ఖగోళ వింతలు! ఆకాశంలో 6 గ్రహాల పరేడ్, పరిపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?
ఒక్క అనుముల కుటుంబానికే ఎందుకు.. తెలంగాణ యువతకు కూడా ఆ `మ్యాజిక్ ట్రిక్` నేర్పించండి: కేటీఆర్
తాజావార్తలు
- ●PM Modi | ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల మాయలో పడొద్దు.. యువతకు మోదీ కీలక సందేశం
- ●Rameshwaram | రాముడి ఆరాధ్య దైవానికి కల్యాణం!
- ●VC Sajjanar | ప్యాకేజింగ్‌కు.. ప్లాస్టిక్, ప్లాస్టిక్ లామినేషన్, అల్యూమినియం ఫోయిల్ వాడకంపై నిషేధం: సీపీ సజ్జనర్
- ●Chamala Kiran Kumar Reddy | కేటీఆర్.. ఇప్పటికైనా పిచ్చి మాటలు బంద్ చేయ్: ఎంపీ చామల
- ●N Chandrasekaran | టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సంచలన నిర్ణయం.. ఇక కొనసాగనని ప్రకటన..
- ●E Visa Facility | శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్

PM Modi | ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల మాయలో పడొద్దు.. యువతకు మోదీ కీలక సందేశం

Rameshwaram | రాముడి ఆరాధ్య దైవానికి కల్యాణం!

VC Sajjanar | ప్యాకేజింగ్‌కు.. ప్లాస్టిక్, ప్లాస్టిక్ లామినేషన్, అల్యూమినియం ఫోయిల్ వాడకంపై నిషేధం: సీపీ సజ్జనర్

Chamala Kiran Kumar Reddy | కేటీఆర్.. ఇప్పటికైనా పిచ్చి మాటలు బంద్ చేయ్: ఎంపీ చామల





