Ram Mandir Theft | అయోధ్య విరాళాల చోరీ.. ప్రధాని నివాసానికి సాధువుల భారీ మార్చ్.. అడ్డుకున్న పోలీసులు
Ram Mandir Theft | అయోధ్య రామమందిర విరాళాల చోరీ (Ram Mandir Theft) అంశంపై నిష్పక్షపాత విచారణ కోరుతూ దాదాపు 500 మంది సాధువులు, మతాచార్యులు సోమవారం ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి శాంతియుతంగా మార్చ్ నిర్వహించారు. అయితే, వారిని పోలీసులు మండి హౌస్ వద్దే అడ్డుకున్నారు.
Ram Mandir Theft | అయోధ్య రామమందిర విరాళాల చోరీ (Ram Mandir Theft) అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. విరాళాల చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న వందలాది మంది పూజారులు (Priests), సాధువులు (Saints), సన్యాసులు (Monks) డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాత విచారణ కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నివాసం వరకూ వారు ర్యాలీ చేపట్టారు. అయితే, వారిని పోలీసులు మండి హౌస్ (Mandi House) వద్దే అడ్డుకున్నారు. దీంతో వారంతా రోడ్డుపైనే బైఠాయించి తమ నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇంద్రప్రస్థ పీఠానికి చెందిన జగద్గురు స్వామి రామానుజాచార్య మాట్లాడుతూ.. సాధారణ సిబ్బందిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని కొనసాగిస్తున్న సిట్ విచారణ కేవలం కంటితుడుపు చర్యగా ఉందన్నారు. ఇందులో కీలక వ్యక్తులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. విరాళాల చోరీలో ప్రమేయం ఉన్న ట్రస్ట్‌లోని ఉన్నత స్థాయి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చోరీ కారణంగా హిందూ సాధువులను అనుమానాస్పదంగా చూసే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
అందుకే విరాళాల దొంగతనానికి పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని డిమాండ్ చేశారు. ట్రస్ట్‌లోని బాధ్యులైన సీనియర్ వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సందేశాన్ని ప్రధాని మోదీకి చేరవేయాలనేదే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ అంశంపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రధాని నివాసానికి వెళ్తున్నట్లు చెప్పారు. సాధువులు, పూజారులకు స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ కూడా మద్దతు తెలిపారు.
Also Read..
విద్యార్థుల నిరసనలపై అమిత్ షా ప్రకటన చేస్తారు : ప్రభుత్వం
వీబీ జీరామ్‌జీ పథకం.. తొలి నెలలోనే సగానికి పడిపోయిన ఉపాధి పనిదినాలు
జియో బంపర్ ఆఫర్.. కొత్త ప్లాన్‌లో ఏడాదిపాటు అన్ని ఓటీటీలు ఫ్రీ..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

PM Modi | మీ ప్రతి కన్నీటి చుక్కా బంగారు పతకంతో సమానం.. కామన్వెల్త్ పతక విజేతలను అభినందించిన ప్రధాని మోదీ
ఆగస్టు 10, 2026

PM Modi | ప్రశ్నించడం కాదు.. సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఉండాలి.. యువతకు ప్రధాని కీలక సూచన
ఆగస్టు 8, 2026

PM Modi | ఆందోళన వద్దు.. మీకు నేనున్నా: ఎంపీలతో ప్రధాని మోదీ
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Parliament deadlock | విద్యార్థుల నిరసనలపై అమిత్ షా ప్రకటన చేస్తారు : ప్రభుత్వం
- ●Reliance Jio | జియో బంపర్ ఆఫర్.. కొత్త ప్లాన్‌లో ఏడాదిపాటు అన్ని ఓటీటీలు ఫ్రీ..
- ●Mahesh Kumar Goud | సర్వాయి పాపన్నను యువత చదవాలి.. ఆయన నాయకత్వ స్ఫూర్తిని ఆచరించాలి
- ●Manne Krishank | లక్ష విలువ కూడా లేని కొండల్‌రెడ్డి కంపెనీకి.. వందల కోట్ల భూమిని 7 కోట్లకే కట్టబెట్టిండు
- ●VB-G RAM G | వీబీ జీరామ్‌జీ పథకం.. తొలి నెలలోనే సగానికి పడిపోయిన ఉపాధి పనిదినాలు
- ●అరవింద్ సుబ్రమణియంతో సీఎం భేటీ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే: కన్స్ట్రక్షన్ రంగంపై రేవంత్ రెడ్డి పన్ను నిఘా!

Parliament deadlock | విద్యార్థుల నిరసనలపై అమిత్ షా ప్రకటన చేస్తారు : ప్రభుత్వం

Reliance Jio | జియో బంపర్ ఆఫర్.. కొత్త ప్లాన్‌లో ఏడాదిపాటు అన్ని ఓటీటీలు ఫ్రీ..

Mahesh Kumar Goud | సర్వాయి పాపన్నను యువత చదవాలి.. ఆయన నాయకత్వ స్ఫూర్తిని ఆచరించాలి

Manne Krishank | లక్ష విలువ కూడా లేని కొండల్‌రెడ్డి కంపెనీకి.. వందల కోట్ల భూమిని 7 కోట్లకే కట్టబెట్టిండు



