Chamala Kiran Kumar Reddy | కేటీఆర్.. ఇప్పటికైనా పిచ్చి మాటలు బంద్ చేయ్: ఎంపీ చామల
Chamala Kiran Kumar Reddy | సీఎం రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) మండిపడ్డారు. తన కుటుంబం తప్ప ఎవరూ బాగుపడొద్దని కేటీఆర్ భావిస్తున్నారని విమర్శించారు.
Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) మండిపడ్డారు. తన కుటుంబం తప్ప ఎవరూ బాగుపడొద్దని కేటీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ ఇకనైనా పిచ్చి మాటలు మానుకోవాలన్నారు. ఉద్యమ సమయంలో తన కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారని కేసీఆర్ (KCR) చెప్పారని గుర్తుచేశారు. 1600 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలోనే 5 ఉద్యోగాలు వచ్చాయని ధ్వజమెత్తారు.
`అమెరికా నుంచి వచ్చిన కేటీఆర్ మంత్రి అయ్యారు. ఎమ్మెల్యే కాకుండా హరీశ్ రావు (Harish Rao) మంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన ఐదుగురు అన్న, దమ్ముళ్లకు ఏ పదవి అయినా ఇచ్చే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ (BRS) పాలనలో ఇచ్చినట్లు తన కుటుంబంలో పదవులు ఇచ్చుకోలేదు. అందరికి ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి సోదరునికి అప్లికేషన్ పెట్టుకుంటే భూమి కేటాయించారు.` అని చెప్పారు.
పాలమూరు-రంగారెడ్డిపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని మండిపడ్డారు. కాళేశ్వరంలో దండుకోవాలన్న ఆలోచనతో పాలమూరు, రంగారెడ్డిని ఆ పార్టీ పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణ (Telangana) ప్రజలు బాగుపడవద్దని కేటీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరికి భూములు ఇచ్చారో, ఏ దోస్తులకు, కంపెనీలు కట్టబెట్టారో తమకు అంతా తెలుసని చెప్పారు. కుటుంబంలో పంపకాలు తేడా వచ్చి కవిత కొత్త పార్టీ పెట్టారన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ పిచ్చి మాటలు బంద్ చేయాలని హితవు పలికారు.
సంబంధిత వార్తలు

Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి
ఆగస్టు 12, 2026

KTR | ఒక్క అనుముల కుటుంబానికే ఎందుకు.. తెలంగాణ యువతకు కూడా ఆ `మ్యాజిక్ ట్రిక్` నేర్పించండి: కేటీఆర్
ఆగస్టు 12, 2026

‘హస్తం’ గూటిలో ‘గులాబీ’ల త్రిశంకు స్వర్గం: అభివృద్ధి ఆశలు.. గౌరవం గల్లంతు: ఫిరాయింపు నేతల రాజకీయ తంటాలు!
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●N Chandrasekaran | టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సంచలన నిర్ణయం.. ఇక కొనసాగనని ప్రకటన..
- ●E Visa Facility | శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్
- ●CM Vijay | మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
- ●Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి
- ●Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్‌లో జోరుగా పెట్టుబడులు.. జూలైలో భారీ మార్పులు..
- ●Prajwal Revanna | జైల్లో ఫోన్‌తో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ

N Chandrasekaran | టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సంచలన నిర్ణయం.. ఇక కొనసాగనని ప్రకటన..

E Visa Facility | శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్

CM Vijay | మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి



