N Chandrasekaran | టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సంచలన నిర్ణయం.. ఇక కొనసాగనని ప్రకటన..
N Chandrasekaran | టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రస్తుత పదవీకాలం వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఉండగా తర్వాత తిరిగి చైర్మన్‌గా నియామకం అయ్యాఏందుకు తాను సిద్ధంగా లేనని బుధవారం ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ నాయకత్వంపై కొంతకాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది.
N Chandrasekaran | టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రస్తుత పదవీకాలం వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఉండగా తర్వాత తిరిగి చైర్మన్‌గా నియామకం అయ్యాఏందుకు తాను సిద్ధంగా లేనని బుధవారం ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ నాయకత్వంపై కొంతకాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. టాటా సన్స్‌లో మెజారిటీ వాటాలు కలిగిన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు తమ పదవీకాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని ఏకగ్రీవంగా సిఫారసు చేశాయని చంద్రశేఖరన్ తెలిపారు. అనంతరం ఈ ప్రతిపాదనను టాటా సన్స్ నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ, బోర్డు కూడా నమోదు చేసి సిఫారసు చేశాయి.
ఏకగ్రీవ మద్దతు లేనందునే..
ఈ ప్రతిపాదనను ఫిబ్రవరి 24న టాటా సన్స్ బోర్డు ముందుంచారు. అయితే ఒక బోర్డు సభ్యుడు మద్దతు ఇవ్వకపోవడంతో ప్రతిపాదనకు ఆమోదం లభించలేదు. ఏకగ్రీవ మద్దతు లేని పరిస్థితిలో నిర్ణయాన్ని వాయిదా వేయాలని తాను నిర్ణయించుకున్నానని చంద్రశేఖరన్ ఒక ప్రకటనలో తెలిపారు. బోర్డు సమావేశం జరిగినప్పటి నుంచి ఆరు నెలలు గడిచినా తన పునర్నియామకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చంద్రశేఖరన్ వెల్లడించారు. కీలకమైన పలు వ్యూహాత్మక ప్రాజెక్టులు కీలక దశలో ఉన్న సమయంలో టాటా సన్స్‌కు నాయకత్వంపై స్పష్టత ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తన పదవీకాలం 2027 ఫిబ్రవరి 20న ముగిసిన తర్వాత పునర్నియామకానికి తాను తన పేరును ప్రతిపాదించుకోకూడదని నిర్ణయించుకున్నట్లు టాటా సన్స్ బోర్డుకు తెలియజేసినట్లు చంద్రశేఖరన్ తెలిపారు. సాఫీగా నాయకత్వ మార్పిడి జరిగేలా తన వారసులని వీలైనంత త్వరగా ఎంపిక చేయాలని ఆయన బోర్డును కోరారు.
టాటా సన్స్, టాటా ట్రస్టుల మధ్య విభేదాలు..?
టాటా గ్రూప్‌లో సుమారు నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తున్న చంద్రశేఖరన్ 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. టాటా సన్స్, టాటా ట్రస్టుల మధ్య ఆయన పునర్నియామకంపై విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో చంద్రశేఖరన్ తాజా నిర్ణయం వెలువడింది. టాటా గ్రూప్‌కు ప్రధాన హోల్డింగ్ కంపెనీగా ఉన్న టాటా సన్స్‌లో టాటా ట్రస్టులకు మెజారిటీ యాజమాన్యం ఉంది. టాటా సన్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, ఎయిర్ ఇండియాతో సహా 30కి పైగా గ్రూప్ కంపెనీలను నియంత్రిస్తోంది.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Chamala Kiran Kumar Reddy | కేటీఆర్.. ఇప్పటికైనా పిచ్చి మాటలు బంద్ చేయ్: ఎంపీ చామల
- ●E Visa Facility | శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్
- ●CM Vijay | మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
- ●Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి
- ●Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్‌లో జోరుగా పెట్టుబడులు.. జూలైలో భారీ మార్పులు..
- ●Prajwal Revanna | జైల్లో ఫోన్‌తో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ

Chamala Kiran Kumar Reddy | కేటీఆర్.. ఇప్పటికైనా పిచ్చి మాటలు బంద్ చేయ్: ఎంపీ చామల

E Visa Facility | శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్

CM Vijay | మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి




