త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prakash Raj | ఓటు షిఫ్ట్ చేశామంతే.‌‌.. తొలగించలేదు.. ప్ర‌కాష్ రాజ్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన ఈసీ

Prakash Raj | త‌న ఓటును తొల‌గించారంటూ ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ (Prakash Raj) చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఖండించింది. ఆయన ఓటును తొలగించలేదని స్పష్టం చేసింది. ఓట‌ర్ ఐడీలో పేర్కొన్న అడ్రెస్‌లో ఆయ‌న నాలుగేళ్లుగా ఉండ‌టం లేద‌ని తెలిపింది. అందుకే ఆయ‌న పేరును షిఫ్టెడ్ లిస్ట్‌లోకి చేర్చిన‌ట్లు వివ‌రించింది.

D

National | Published On Aug 12, 2026, 11.13 am IST

Prakash Raj | ఓటు షిఫ్ట్ చేశామంతే.‌‌.. తొలగించలేదు.. ప్ర‌కాష్ రాజ్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన ఈసీ
Advertisement

Prakash Raj | బెంగళూరులో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా త‌న ఓటును తొల‌గించారంటూ ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ (Prakash Raj) చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ స్పందించింది. ఆయన ఓటును తొలగించలేదని స్పష్టం చేసింది. ప్రకాష్ రాజ్ గతంలో నమోదైన పాత చిరునామాలో గత నాలుగేళ్లుగా నివసించడం లేదని బూత్ లెవెల్ అధికారులు (BLO) క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించార‌ని తెలిపింది.

ప్ర‌కాష్ రాజ్‌తో ఫోన్‌లో మాట్లాడ‌గా.. ప్ర‌స్తుతం తాను ఆ చిరునామాలో ఉండ‌టం లేద‌ని శాంతిన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని వేరే ప్రాంతంలో నివ‌సిస్తున్న‌ట్లు చెప్పార‌ని ఈసీ అధికారులు తెలిపారు. ఆయన ఓటును పూర్తిగా తొలగించలేదని చెప్పారు. కేవలం పాత అడ్రెస్ నుంచి షిఫ్ట్ అయిన‌ట్లుగా మార్క్ చేశామని స్పష్టం చేశారు. ఆయన తన ప్రస్తుత అడ్రెస్‌కు సంబంధించిన పత్రాలతో ఎలక్షన్ కమిషన్ అధికారిక పోర్టల్ లేదా BLO ద్వారా ఫామ్ 6 (Form 6) సమర్పించి ఓట‌ర్ ఐడీని సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చని సూచించారు.

నా ఓటును తొల‌గించారు..

బెంగ‌ళూరులో (Bengaluru) స‌ర్ (SIR) ప్ర‌క్రియ‌లో భాగంగా త‌న ఓటును తొల‌గించార‌ని ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ (Prakash Raj) ఆరోపించిన విష‌యం తెలిసిందే. స‌ర్ (Special Intensive Revision) ప్ర‌క్రియ‌లో భాగంగా బెంగళూరు నియోజకవర్గంలో దాదాపు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించార‌ని చెప్పారు. అందులో తన పేరు కూడా ఉంద‌న్నారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఓ సెల్ఫీ వీడియోని విడుద‌ల చేశారు.

"ప్రియమైన మిత్రులారా.. మీకు ఓ జోక్ చెప్పాల‌నుకుంటున్నాను. బెంగళూరు నియోజకవర్గంలో SIR ప్రక్రియ తర్వాత ఓటు హక్కు తొలగించిన 65 లక్షల మంది ఓటర్లలో నేను కూడా ఒకడిని. నేను ఇదే నియోజకవర్గంలో పుట్టాను. ఇక్కడే పెరిగాను. ఇక్కడే చదువుకున్నాను. నా సినీ ప్ర‌యాణం కూడా ఇక్క‌డే సాగింది. మ‌రో విష‌యం ఏంటంటే.. నేను ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాను. అయినా నా ఓటు తొల‌గించారు. సరే, జోక్ బానే ఉంది. మ‌ళ్లీ నా ఓటు హ‌క్కును పొంద‌డానికి ఏం డాక్యుమెంట్లు అడుగుతారో. కానీ ఒక్క చిన్న విషయం. మిమ్మల్ని ఎన్నుకోని పౌరుల ఓటు హక్కును కాలరాయడానికి మీరు మీ అధికారాలను ఉపయోగించవచ్చు. కానీ మిమ్మల్ని గద్దె దించాలనే మా అధికారాన్ని, మా ప్రయత్నాన్ని మీరు ఆపగలరా..? జస్ట్ అస్కింగ్" అంటూ ప్రకాష్ రాజ్ వ్యాంగ్యంగా స్పందించారు.

Also Read..

పంజాగుట్ట శ్మ‌శాన వాటిక‌లో ప‌సికందు మృత‌దేహం మాయం..

భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు.. న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ఒకే రోజు 4 అరుదైన ఖగోళ వింతలు! ఆకాశంలో 6 గ్రహాల పరేడ్, పరిపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?

Advertisement
Advertisement