CM Vijay | మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
CM Vijay | లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజనకు (డీలిమిటేషన్) వ్యతిరేకంగా సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం నేడు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మహిళా రిజర్వేషన్ (Women Resolution Bill)కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని.. అయితే, డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదని సీఎం విజయ్ (CM Vijay) తేల్చి చెప్పారు.
CM Vijay | త్రినేత్ర.న్యూస్ : లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజనకు (డీలిమిటేషన్) వ్యతిరేకంగా సీఎం విజయ్ (CM Vijay) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం నేడు అసెంబ్లీలో (Tamil Nadu Assembly ) తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదని సీఎం విజయ్ తేల్చి చెప్పారు. అదే సమయంలో మహిళా రిజర్వేషన్‌కు (Women Resolution Bill) తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ప్రస్తుతం ఉన్న 543 స్థానాల పరిధిలోనే దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చర్యలను విజయవంతంగా అమలు చేశాయని ఈ సందర్భంగా సీఎం విజయ్ తెలిపారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు. ఈ తీర్మానంలో సీఎం విజయ్ మొత్తం మూడు డిమాండ్లను కేంద్రం ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాలను అలాగే కొనసాగించాలని, ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం కేటాయించిన స్థానాలను శాశ్వతం చేయాలని, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
In the Assembly, Tamil Nadu CM Vijay says, "The 33% reservation for women should be implemented in the 2029 Lok Sabha elections itself, based on the existing 543 constituencies. The 33% reservation for women should not be delayed any further. In Tamil Nadu, more women have voted… https://t.co/zZxI0P1t2s
— ANI (@ANI) August 12, 2026
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేతో పాటు ఇతర పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి (Udhayanidhi Stalin) మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో పార్లమెంట్‌లో తమిళనాడు ఎంపీల సంఖ్యను తగ్గించకూడదన్నారు. రాబోయే 25 ఏళ్ల వరకూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టకూడదన్నదే తమ వైఖరి అని స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే తీర్మానాన్ని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
Tamil Nadu Assembly Session | DMK supports TVK Govt’s resolution against Centre’s Delimitation
LoP Udhayanidhi Stalin says, "In the name of constituency delimitation, the number of Members of Parliament should not be reduced. Our stand is that constituency delimitation should… pic.twitter.com/8nObaFjfHa
— ANI (@ANI) August 12, 2026
Also Read..
జైల్లో ఫోన్‌తో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ
ఓటు షిఫ్ట్ చేశామంతే... తొలగించలేదు.. ప్రకాష్ రాజ్ ఆరోపణలను ఖండించిన ఈసీ
తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి
సంబంధిత వార్తలు

MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్
సెప్టెంబర్ 10, 2026

Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్
సెప్టెంబర్ 8, 2026

CM Vijay | మహిళలను కించపరిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు.. ఉదయనిధి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
- ●MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు

Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన



