త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

VC Sajjanar | ప్యాకేజింగ్‌కు.. ప్లాస్టిక్, ప్లాస్టిక్ లామినేషన్, అల్యూమినియం ఫోయిల్ వాడకంపై నిషేధం: సీపీ స‌జ్జ‌న‌ర్‌

VC Sajjanar | ప్రజా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దిశగా కేంద్ర ఆహార భద్రత నాణ్యతల ప్రాధికార సంస్థ (FSSAI India) కీలక నిర్ణయం తీసుకుంద‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నర్ (VC Sajjanar) చెప్పారు.

G

Hyderabad | Published On Aug 12, 2026, 12.59 pm IST

VC Sajjanar | ప్యాకేజింగ్‌కు.. ప్లాస్టిక్, ప్లాస్టిక్ లామినేషన్, అల్యూమినియం ఫోయిల్ వాడకంపై నిషేధం: సీపీ స‌జ్జ‌న‌ర్‌
Advertisement

VC Sajjanar | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రజా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దిశగా కేంద్ర ఆహార భద్రత నాణ్యతల ప్రాధికార సంస్థ (FSSAI India) కీలక నిర్ణయం తీసుకుంద‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నర్ (VC Sajjanar) చెప్పారు. పాన్ మసాలా (Pan Masala) ప్యాకింగ్‌లో (Packing) ప్లాస్టిక్, ప్లాస్టిక్ లామినేషన్, అల్యూమినియం ఫోయిల్ వాడకంపై పూర్తి నిషేధం విధించింద‌ని వెల్ల‌డించారు. ఈమేర‌కు ప్యాకేజింగ్ (Packaging) నిబంధనల్లో ఫాసీ సవరణలు చేసింద‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఇకపై పాన్ మసాలాలను కేవలం ప్లాస్టిక్ రహిత పేపర్, పేపర్ బోర్డ్, సెల్యులోజ్ లేదా టిన్, గాజు సీసాలలో మాత్రమే విక్రయించాలని స్ప‌ష్టం చేశారు.

ఈ నిర్ణయంతో ప్లాస్టిక్ పౌచ్‌లలో (Plastic) నిల్వ ఉండటం ద్వారా జరిగే రసాయన చర్యలు, మైక్రో ప్లాస్టిక్స్ ప్రమాదం తగ్గి ప్రజారోగ్యానికి రక్షణ లభిస్తుంద‌ని చెప్పారు. అలాగే రోడ్లు, డ్రెయిన్లను ముంచెత్తే రీసైకిల్ కాని కోట్ల ప్లాస్టిక్ సాచెట్ల వ్యర్థాలకు అడ్డుకట్ట పడి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంద‌ని వెల్ల‌డించారు. ఈ నూతన మార్గదర్శకాలను తయారీదారులు, వ్యాపారులు కచ్చితంగా పాటించాల‌న్నారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement