త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Shivakumar | ప్ర‌మాణ స్వీకారం వేళ‌.. డీకేను శివుడిగా చిత్రీక‌రించిన క‌న్న‌డ ప‌త్రిక‌.. ఫ్రంట్ పేజిలో ఫొటో

DK Shivakumar | ముఖ్య‌మంత్రిగా డీకే శివ‌కుమార్ (DK Shivakumar) ప్ర‌మాణ స్వీకారం వేళ ఓ క‌న్న‌డ దిన‌ప‌త్రిక ప్ర‌చురించిన చిత్రం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. కన్నడ దినపత్రిక 'విశ్వవాణి' (Kannada newspaper Vishwavani) కాబోయే సీఎంను శివుడిగా చిత్రీక‌రించింది.

D

National | Published On Jun 3, 2026, 3.25 pm IST

DK Shivakumar | ప్ర‌మాణ స్వీకారం వేళ‌.. డీకేను శివుడిగా చిత్రీక‌రించిన క‌న్న‌డ ప‌త్రిక‌.. ఫ్రంట్ పేజిలో ఫొటో
Advertisement

DK Shivakumar | క‌ర్ణాట‌క నూత‌న ముఖ్య‌మంత్రిగా డీకే శివ‌కుమార్ (DK Shivakumar) ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ క‌న్న‌డ దిన‌ప‌త్రిక ప్ర‌చురించిన చిత్రం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. కన్నడ దినపత్రిక 'విశ్వవాణి' (Kannada newspaper Vishwavani) డీకే శివుడి రూపంలో (Lord Shiva) ఉన్న చిత్రాన్ని త‌న ఫ్రంట్ పేజిలో ప్ర‌చురించింది. ఈ చిత్రాన్ని స‌ద‌రు ప‌త్రిక ఎడిట‌ర్ ఇన్ చీఫ్ విశ్వేశ్వ‌ర్ భ‌ట్ ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.

ఆ ప‌త్రిక ప్ర‌చురించిన చిత్రంలో డీకే ఓ చేతిలో త్రిశూలం, మ‌రో చేతిలో డ‌మ‌రుకం ప‌ట్టుకుని జటాలు, పులిచర్మంతో క‌నిపించారు. డీకేని ఇలా శివుడిగా చూపించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. దీనిపై ప‌లువురు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. "ఇది ధర్మానికి విరుద్ధమని, మన దేవతల పవిత్రతను దెబ్బతీసేలా ఉంది" అని కర్ణాటకకు చెందిన న్యాయవాది గిరీష్ భరద్వాజ్ పేర్కొన్నారు. విశ్వ‌వాణి ప‌త్రిక నుంచి ఇలాంటి కంటెంట్‌ను తాను ఎప్పుడూ ఊహించ‌లేద‌న్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ధ‌ర్మాన్ని ఇంత చుల‌క‌న‌గా చేయ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించారు.

స‌ద‌రు ప‌త్రిక తీరుపై ప‌లువురు నెటిజ‌న్లు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులను దేవుళ్లతో పోల్చడం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మత విశ్వాసాలను కించపరిచేలా ఉందని, రాజకీయ దాసోహం (political sycophancy) అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది ముమ్మాటికీ దైవదూషణ.. కన్నడిగులు దీనిని ఎలా సాధారణ విషయంగా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు" అంటూ ఓ నెటిజ‌న్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

Also Read..

‘డాన్ 3’ వివాదం.. ర‌ణ్‌వీర్‌పై బ్యాన్ ఎత్తివేసిన FWICE.. అధికారిక ప్ర‌క‌ట‌న‌

స్టూడెంట్ యూనియ‌న్ రూమ్‌లో భారీగా నోట్ల క‌ట్ట‌లు..

‘పెద్ది’ మూవీ టికెట్ల ధ‌ర‌ల పెంపున‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

Advertisement
Advertisement