Peddi Movie Ticket Price Hike | ‘పెద్ది’ మూవీ టికెట్ల ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
Peddi Movie Ticket Price Hike | మెగా పవర్‌స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది సినిమా టికెట్ల ధర పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియర్ షోకు గరిష్టంగా రూ.600 వరకు టికెట్ ధరను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
Entertainment | Published On Jun 3, 2026, 3.16 pm IST
Peddi Movie Ticket Price Hike | మెగా పవర్‌స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది సినిమా టికెట్ల ధర పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియర్ షోకు గరిష్టంగా రూ.600 వరకు టికెట్ ధరను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే, అలాగే జూన్ 4 నుంచి జూన్ 13 వరకు పది రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 వరకు అదనంగా వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజుకు గరిష్టంగా ఐదు షోల వరకు మాత్రమే పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని తెలుగు సినీ పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ నిధికి తప్పనిసరిగా జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ నిధిని సినీ పరిశ్రమ కార్మికుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు తెలిపింది. సినిమా ప్రదర్శణ సమయంలో మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించే ప్రకటనలను ప్రదర్శించాలని థియేటర్ యాజమాన్యాలకు సూచించింది. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, లైసెన్సింగ్ అధికారులు పర్యవేక్షించాలని జీవోలో హోంశాఖ సూచించింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరక్కెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. హీరోగా రామ్‌చరణ్ నటిస్తుండగా.. అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో జాన్వీకి రెండోది కావడం విశేషం. కన్నడ స్టార్ నటుడు శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ సహా పలువురు నటీనటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ గురువారం విడుదల కానుంది. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Peddi Review | పెద్ది రివ్యూ – రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది – జాన్వీ కపూర్ మైనస్!
జూన్ 4, 2026

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? ‘పెద్ది’ ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
జూన్ 3, 2026

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
జూన్ 3, 2026
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!



