త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karthigai Deepam | తిరువణ్ణామలై కొండపై మహాదీపం.. ఆనంద తాండవం చేసిన అర్ధనారీశ్వరుడు..!

Karthigai Deepam | తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. 2,668 అడుగుల ఎత్తైన అన్నామలై కొండ శిఖరంపై మహాదీపాన్ని వెలిగించారు. మహాదీపాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ‘అన్నామలైయార్‌కు హరోహరా’ అంటూ భక్తిపారవశ్యంతో నినదించారు.

P

Devotional | Published On Nov 24, 2026, 10.25 pm IST

Karthigai Deepam | తిరువణ్ణామలై కొండపై మహాదీపం.. ఆనంద తాండవం చేసిన అర్ధనారీశ్వరుడు..!
Advertisement

Karthigai Deepam | తమిళనాడులోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. 2,668 అడుగుల ఎత్తైన అన్నామలై కొండ శిఖరంపై మహాదీపాన్ని వెలిగించారు. మహాదీపాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ‘అన్నామలైయార్‌కు హరోహరా’ అంటూ భక్తిపారవశ్యంతో నినదించారు. నవంబర్‌ 15న ధ్వజారోహణంతో ప్రారంభమైన దీపోత్సవంలో భాగంగా మంగ‌ళ‌వారం వేకువ జామున 2 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచారు. అరుణాచలేశ్వర స్వామి, ఉన్నామలై అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి సన్నిధి ఎదుట యాగ పూజలు చేశారు.

ఉదయం 3.30 గంటలకు పంచముఖ దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 4 గంటలకు స్వామివారి గర్భగుడి ఎదుట భరణి దీపాన్ని వెలిగించారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధి సహా అన్ని సన్నిధుల్లోనూ భరణి దీపాలు వెలిగించారు. ఉదయం 11 గంటలకు బ్రహ్మ తీర్థంలో సుబ్రమణ్య తీర్థవారి ఉత్సవం నిర్వహించారు. వినాయకుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మ‌ణ్య‌స్వామి, ఉన్నామలై అమ్మవారితో కూడిన అరుణాచలేశ్వరుడు, పరాశక్తి అమ్మవారు, చండికేశ్వరులకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు పంచమూర్తులను ప్రత్యేక స్వర్ణ వాహనాలపై మూడో ప్రాకారంలోని దీపదర్శన మండపానికి తీసుకొచ్చారు. కొండవైపు అభిముఖంగా కొలువుదీర్చి మహాదీప దర్శనం చేయించారు.

శివుడు పార్వతీదేవికి తన శరీరంలో ఎడమభాగాన్ని ఇచ్చిన ఘట్టానికి గుర్తుగా అర్ధనారీశ్వరస్వామి ఉత్సవం నిర్వహించారు. ఆలయంలోని రెండో ప్రాకారం నుంచి స్వామివారు ఆనంద తాండవం చేస్తూ మూడో ప్రాకారంలోని బంగారు ధ్వజస్తంభం ఎదుట కొండవైపు అభిముఖంగా దర్శనమిచ్చారు. ఉదయం వెలిగించిన భరణి దీపం నుంచి ఆలయ ధ్వజస్తంభం వద్ద దీపాన్ని వెలిగించారు. అక్కడి నుంచి పంచభూతాలకు ప్రతీకగా ఐదు దీపాలను వెలిగించి కొండ శిఖరంపైకి చేర్చారు. అనంతరం 2,668 అడుగుల ఎత్తైన అన్నామలై కొండపై మహాదీపాన్ని ప్రజ్వలింపజేశారు. ఆ జ్యోతిని దర్శించుకున్న భక్తులు ‘అన్నామలైయార్‌కు హరోహరా’ అంటూ నిన‌దించారు. కొండపై వెలిగిన మ‌హాదీప కాంతుల్లో తిరువణ్ణామలై వెలిగిపోయింది. గిరిప్ర‌ద‌క్ష‌ణ చేస్తూ మ‌హా దీపాన్ని ద‌ర్శించుకొని భ‌క్తులు పుల‌కించిపోయారు.

Advertisement

తాజావార్తలు

Advertisement