త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kolkata college | స్టూడెంట్ యూనియ‌న్ రూమ్‌లో భారీగా నోట్ల క‌ట్ట‌లు..

Kolkata college | కోల్‌కతాలోని ప్ర‌తిష్టాత్మ‌క‌ సురేంద్రనాథ్ కాలేజ్ (Surendranath College) ప్ర‌స్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. స్టూడెంట్స్ యూనియ‌న్ గ‌దిలో భారీగా న‌గ‌దు బ‌య‌ట‌ప‌డింది. బిల్డింగ్ పైకప్పుపైకి వెళ్లే దారిలో ఒక సీక్రెట్ గ‌దిని అధికారులు కనుగొన్నారు.

D

National | Published On Jun 3, 2026, 2.01 pm IST

Kolkata college | స్టూడెంట్ యూనియ‌న్ రూమ్‌లో భారీగా నోట్ల క‌ట్ట‌లు..
Advertisement
  • సీక్రెట్ బెడ్‌రూమ్‌, కండోమ్ ప్యాకెట్స్‌, మ‌ద్యం సీసాలు
  • కోల్‌క‌తా కాలేజ్‌లో క‌ల‌క‌లం
  • టీఎంసీ నేత‌పై ఆరోప‌ణ‌లు

Kolkata college | కోల్‌కతాలోని ప్ర‌తిష్టాత్మ‌క‌ సురేంద్రనాథ్ కాలేజ్ (Surendranath College) ప్ర‌స్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. కాలేజ్ స్టూడెంట్స్ యూనియ‌న్ గ‌దిలో భారీగా న‌గ‌దు బ‌య‌ట‌ప‌డింది. దాంతోపాటూ సీక్రెట్ బెడ్‌రూమ్స్ (Secret bedrooms), గ‌న్‌, మద్యం సీసాలు, కండోమ్ (condoms) ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. దాదాపు ఏడాదిపాటూ మూసి ఉన్న ఆ గ‌దిని అధికారులు ఇప్పుడు తెర‌వ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

గతేడాది జూన్‌లో సౌత్ కలకత్తా లా కాలేజ్ యూనియన్ గదిలో 24 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో క‌ళాశాలల్లోని యూనియ‌న్ గ‌దుల‌ను మూసివేయాల‌ని అప్పటి తృణ‌మూల్‌ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. దీంతో 2025లో ఈ గదికి తాళం వేశారు. అయితే, ప్ర‌స్తుతం సువేందు అధికారి నేతృత్వంలోని ప్ర‌స్తుత బీజేపీ ప్ర‌భుత్వం స్టూడెంట్స్ యూనియ‌న్స్ నిధుల‌పై ఆడిట్ చేయాల‌ని క‌ళాశాల‌ల‌ను ఆదేశించింది. ప్ర‌భుత్వ ఆదేశాల‌తో కాలేజీలోని ఈగ‌దిని అధికారులు తెరిచారు. ఈ సంద‌ర్భంగా గ‌దిని శుభ్రం చేస్తుండ‌గా.. షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

యూనియన్ రూమ్‌లోని ఓ పాత అల్మారాను కార్మికులు తెరవ‌గా.. రెండు సూట్‌కేసుల నిండా రూ.100, రూ.500 నోట్ల‌తో కూడిన భారీ న‌గ‌దు బ‌య‌ట‌ప‌డింది. బ‌య‌ట‌ప‌డిన న‌గ‌దు విలువ సుమారు రూ.కోటి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నాయి. అయితే, చాలా రోజులుగా నోట్ల‌న్నీ సూట్‌కేసులోనే ఉండ‌టంతో అవి చెద‌లు ప‌ట్టిపోయాయి. ఆ నోట్ల వివరాలను నోట్ చేసుకుంటున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

ఇక నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డిన కొద్దిసేప‌టికే.. బిల్డింగ్ పైకప్పుపైకి వెళ్లే దారిలో ఒక సీక్రెట్ గ‌దిని అధికారులు కనుగొన్నారు. అది ఒక విలాసవంతమైన బెడ్‌రూమ్‌లా ఉంది. అందులో ఏసీ, మంచం, గోడలపై ఖరీదైన పెయింటింగ్స్ ఉన్నాయి. దానికి అటాచ్డ్‌గా అధునాతన బాత్‌రూమ్ కూడా ఉంది. ఆ గ‌దిలో ఓ రివాల్వ‌ర్‌ను కూడా అధికారులు గుర్తించారు. ఇక త‌నిఖీల్లో భాగంగా క‌ళాశాల భ‌వ‌నంపై మ‌ద్యం సీసాలు, విద్యార్థుల కామ‌న్ రూమ్‌లో కండోమ్ ప్యాకెట్లు ల‌భించ‌డం క‌ల‌క‌లం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ తర్వాత కళాశాలకు చేరుకుని ఆ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

అయితే, ఆ గ‌దుల‌ను టీఎంసీ నేత దేబాశిష్ బంద్యోపాధ్యాయ‌, అత‌ని కుమారుడు శిబాశిష్‌లు ఉప‌గియించిన‌ట్లు క‌ళాశాల అధికారులు ఆరోపించారు. వీరిద్ద‌రూ ఆ గ‌దుల్లో మ‌సాజ్‌లు కూడా చేయించుకునేవార‌ని పేర్కొన్నారు. మసాజ్‌లు చేయాల‌ని ఉద్యోగుల‌పై ఒత్తిడి కూతా తెచ్చార‌ని ఆరోపించారు. అయితే, దేబాశిష్ బంద్యోపాధ్యాయ ఆ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చారు. ఆ సీక్రెట్ బెడ్‌రూమ్‌ల గురించి త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని చెప్పారు.

Also Read..

ఆర్బీఐ భారీగా బంగారాన్ని అమ్మేసిందంటూ బ్లూమ్‌బ‌ర్గ్ సంచ‌ల‌న క‌థ‌నం.. ఫ్యాక్ట్‌చెక్‌తో తిప్పి కొట్టిన‌ కేంద్రం

తెలంగాణ‌లో జ‌న‌సేన కొత్తగా పోటీ చేసేది ఏముంది..? : కేటీఆర్

టెక్సాస్‌లో దారుణం: భారత జాతీయ జెండా చించివేత.. నెట్టింట భగ్గుమంటున్న భారతీయులు

Advertisement
Advertisement