Ranveer Singh | ‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్‌పై బ్యాన్ ఎత్తివేసిన FWICE.. అధికారిక ప్రకటన
Ranveer Singh | నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh)పై జారీ చేసిన సహాయ నిరాకరణ ఉత్తర్వులను (Non Cooperation Action ) ఉపసంహరించుకుంటున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) నేడు అధికారికంగా ప్రకటించింది.
Ranveer Singh | ‘డాన్ 3’ (Don 3) సినిమా చుట్టూ నెలకొన్న వివాదం ఓ కొలిక్కి చేరింది. మూవీ వివాదం నేపథ్యంలో నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh)పై జారీ చేసిన సహాయ నిరాకరణ ఉత్తర్వులను (Non Cooperation Action ) ఉపసంహరించుకుంటున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) నేడు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు బీఎన్ తివారీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సీఐఎన్‌టీఏఏ), ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీఏఏ) చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు బీఎన్ తివారీ తెలిపారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
మరోవైపు తనపై తీసుకున్న చర్యలకు వ్యతిరేకంగా ఎఫ్‌డబ్ల్యూఐసీఈకి రణ్వీర్ సింగ్ లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ లీగల్ నోటీసులకు తమ లీగల్ టీమ్ త్వరలోనే సమాధానం ఇస్తుందని FWICE చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ తెలిపారు. ముంబైలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అశోక్ పండిట్ మాట్లాడుతూ... "ఆ లీగల్ నోటీసు నిన్ననే మాకు అందింది. సహాయ నిరాకరణ ఆదేశాన్ని తొలగించాలని అందులో వారు మమ్మల్ని కోరారు. ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మేము రణ్‌వీర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇండస్ట్రీలో ఎవరిపైనా నిషేధం విధించే అధికారం మాకు లేదు. రణ్వీర్ నుంచి సానుకూల స్పందన వస్తుందని మేము ఆశిస్తున్నాము" అని ఆయన అన్నారు.
కాగా, 'ధురంధర్' చిత్రం విడుదలైన తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డాన్ 3’ చిత్రంలో రణ్వీర్ సింగ్ నటించాల్సి ఉండగా.. షూటింగ్‌కు కొద్ది రోజుల ముందు ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. రణ్వీర్ చర్యతో తమకు నలభై ఐదు కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని, వేలాది మంది సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారని దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రణ్‌వీర్‌సింగ్‌పై సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మూడేళ్లు బ్యాన్ విధించింది.
Also Read..
స్టూడెంట్ యూనియన్ రూమ్‌లో భారీగా నోట్ల కట్టలు..
ఢిల్లీ అగ్నిప్రమాదం: ప్రాణభయంతో భవనం పైనుంచి దూకేసిన మహిళలు.. వీడియో వైరల్
టాప్ స్టాక్స్ కుప్పకూలాయి.. ఈ ఏడాదిలో 40 శాతం మేర పతనమైన లార్జ్‌క్యాప్ షేర్లు ఇవే..
సంబంధిత వార్తలు

Ranveer Singh | బ్యాన్ వేళ కర్ణాటకలోని చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ పూజలు – మరో వివాదానికి పుల్‌స్టాప్!
మే 26, 2026

Ranveer Singh | డాన్-3 మూవీ వివాదం.. మౌనం వీడిన రణ్వీర్ సింగ్..!
మే 26, 2026

Ranveer Singh Banned | రణ్వీర్ సింగ్‌కు భారీ షాక్.. ‘డాన్ 3’ వివాదంతో బ్యాన్ విధించిన సినీ వర్కర్స్ అసోసియేషన్!
మే 25, 2026
తాజావార్తలు
- ●Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్: అనుమతి 6 గదులకే.. కానీ..!
- ●Large Cap Stocks | టాప్ స్టాక్స్ కుప్పకూలాయి.. ఈ ఏడాదిలో 40 శాతం మేర పతనమైన లార్జ్‌క్యాప్ షేర్లు ఇవే..
- ●Kolkata college | స్టూడెంట్ యూనియన్ రూమ్‌లో భారీగా నోట్ల కట్టలు..
- ●KTR | తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది..? : కేటీఆర్
- ●KTR | అసలైన తెలంగాణ 'ఓజీ' కేసీఆరే : కేటీఆర్
- ●Texas Indian Flag Torn | టెక్సాస్‌లో దారుణం: భారత జాతీయ జెండా చించివేత.. నెట్టింట భగ్గుమంటున్న భారతీయులు

Delhi Hotel Fire | ఢిల్లీ అగ్నిప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్: అనుమతి 6 గదులకే.. కానీ..!

Large Cap Stocks | టాప్ స్టాక్స్ కుప్పకూలాయి.. ఈ ఏడాదిలో 40 శాతం మేర పతనమైన లార్జ్‌క్యాప్ షేర్లు ఇవే..

Kolkata college | స్టూడెంట్ యూనియన్ రూమ్‌లో భారీగా నోట్ల కట్టలు..

KTR | తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది..? : కేటీఆర్



