Shashi Tharoor | లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన శశి థరూర్
Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు (Shashi Tharoor) ఓ హోటల్ లిఫ్ట్‌లో అరగంటపాటూ ఇరుక్కుపోయారు. అగ్నిమాపక సిబ్బంది హైడ్రాలిక్ స్ప్రెడర్ సహాయంతో లిఫ్ట్ తలుపును తెరిచి శశిథరూర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌కు (Shashi Tharoor) షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హోటల్‌కు వెళ్లిన థరూర్.. అక్కడ లిఫ్ట్‌లో కొన్ని నిమిషాల పాటూ ఇరుక్కుపోయారు. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి లిఫ్ట్ తలుపులు తెరవడంతో ఆయన బయటకు వచ్చారు.
తిరువనంతపురం (Thiruvananthapuram)లోని రోటరీ క్లబ్ ఆఫ్ త్రివేండ్రం ఈస్ట్ (Rotary Club of Trivandrum East) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు శశిథరూర్ శుక్రవారం సాయంత్రం ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ అధికారులతోపాటూ లిఫ్ట్‌లో వెళ్తుండగా అది మధ్యలోనే ఆగిపోయింది. బయటకు వచ్చే మార్గం లేదు. దాదాపు అరగంట పాటూ లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోవాల్సి వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది రాడ్‌ల సాయంతో లిఫ్ట్ తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది హైడ్రాలిక్ స్ప్రెడర్ సహాయంతో లిఫ్ట్ తలుపును తెరిచి శశిథరూర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
దీంతో అక్కడున్న అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన అనంతరం రెస్క్యూ టీమ్‌కి థరూర్ కృతజ్ఞతలు తెలిపారు. "మీ అందరికీ చాలా థాంక్స్. ఇక్కడి అధికారులు చాలా బాగా పనిచేశారు. ఐదు నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకున్నారు. వెరీ గుడ్.. థాంక్యూ వెరీ మచ్" అని అన్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 7:30 నుంచి 8 గంటల మధ్య చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read..
ఆశ్రమంలో గంజాయి సాగుచేస్తున్న సాధువు.. ఆధ్యాత్మిక ముసుగులో అక్రమాలు..
క్రోమ్‌బుక్ వర్సెస్ విండోస్ ల్యాప్‌టాప్.. ఎవరికి ఏది బెటర్..?
వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.. బలవంతంగా ఆసుపత్రికి తరలింపు.. చికిత్స చేయొద్దన్న భార్య
సంబంధిత వార్తలు

Arrest | బెంగళూరుకి పిలిచి కల్పిత విజయగాథలు చెప్పారు.. అందినకాడికి దోచుకుని కటకటాలపాలయ్యారు
జులై 23, 2026

Akhil Joyan | మరో రెండు నెలల్లో పెళ్లి.. అంతలోనే రష్యా దాడిలో కేరళ నావికుడు మృతి
జులై 21, 2026

FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం
జులై 19, 2026
తాజావార్తలు
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత
- ●Komatireddy | నల్లగొండ అభివృద్ధిలో మరో ముందడుగు.. మర్రిగూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!



