Ganja | ఆశ్రమంలో గంజాయి సాగుచేస్తున్న సాధువు.. ఆధ్యాత్మిక ముసుగులో అక్రమాలు..
Ganja | ఆధ్యాత్మికత పేరుతో కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారు. సాధువు ముసుగులో ఓ వ్యక్తి ఆశ్రమంలో (Ashram) గంజాయి (Ganja) సాగుచేస్తున్నాడు.
Ganja | త్రినేత్ర.న్యూస్: ఆధ్యాత్మికత పేరుతో కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారు. సాధువు ముసుగులో ఓ వ్యక్తి ఆశ్రమంలో (Ashram) గంజాయి (Ganja) సాగుచేస్తున్నాడు. ములుగు (Mulugu) జిల్లా తాండూరు మండలంలో కాశీకి చెందిన శ్రీరామ్ గిరి అనే స్వామీజిని పోలీసులు అరెస్టు చేశారు. గోవిందరావుపేట (Govindaraopet) శివారులోని తన ఆశ్రమంలో గంజాయి మొక్కలను (Cannabis) పెంచుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆశ్రమంలో సోదాలు చేశారు. దీంతో 36 గంజాయి మొక్కలను వేర్లతో సహా తొలగించి స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఎండు గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వామీజీని అదుపులోకి తీసుకున్నారు.
ఆలయం ప్రాంగణంలో..
గతంలో కూడా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగాం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పంచగాంలోని ఓ ఆలయంలో అవుటి నాగయ్య మహరాజ్ అనే వ్యక్తి గురువుగా, పూజారిగా చలామణి అవుతున్నారు. గుడి ఆవరణలో దేవుని కోసం బంతిపూల తోట పెంచుతున్నట్లు అందరినీ నమ్మించాడు. ఆ పూల మొక్కల మధ్యలో గంజాయి సాగుచేయసాగాడు. అయితే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి 685 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 17.741 కిలోల ఎండు గంజాయి, ఒక కిలో గంజాయి విత్తనాలు సీజ్ చేశారు. వీటి విలువ 70 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన






