Chromebook | క్రోమ్‌బుక్ వర్సెస్ విండోస్ ల్యాప్‌టాప్.. ఎవరికి ఏది బెటర్..?
Chromebook | కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ప్రస్తుతం క్రోమ్‌బుక్ లు, విండోస్ ల్యాప్‌టాప్ లు అత్యంత ప్రజాదరణ పొందిన ఆప్షన్లుగా ఉన్నాయి. అయితే ఈ రెండూ ఒకేలా కనిపించినా, వేర్వేరు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
Technology | Published On Jul 18, 2026, 11.35 am IST
Chromebook | కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ప్రస్తుతం క్రోమ్‌బుక్ లు, విండోస్ ల్యాప్‌టాప్ లు అత్యంత ప్రజాదరణ పొందిన ఆప్షన్లుగా ఉన్నాయి. అయితే ఈ రెండూ ఒకేలా కనిపించినా, వేర్వేరు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. క్రోమ్‌బుక్‌లు సరళమైన వినియోగం, తక్కువ ధర, క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్‌పై దృష్టి పెడితే, విండోస్ ల్యాప్‌టాప్‌లు విస్తృతమైన సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తోపాటు శక్తివంతమైన హార్డ్‌వేర్ ఆప్షన్‌లను అందిస్తాయి. విద్య, ఉద్యోగం, గేమింగ్ లేదా రోజువారీ అవసరాల్లో దేనికోసం ఏ ల్యాప్‌టాప్‌ను ఉపయోగించాలనుకుంటున్నారన్న విషయంపైనే సరైన ఎంపిక ఆధారపడి ఉంటుంది. ఒక్కసారిగా రెండింటినీ చూస్తే క్రోమ్‌బుక్‌లు, విండోస్ ల్యాప్‌టాప్‌లు ఒకేలా కనిపించినప్పటికీ, వీటి మధ్య ప్రధాన తేడా ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉంటుంది.
తేడా ఏమిటి..?
క్రోమ్‌బుక్‌లు గూగుల్ రూపొందించిన క్రోమ్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తాయి. ఇది ప్రధానంగా క్రోమ్ బ్రౌజర్ తో పాటు గూగుల్ డ్రైవ్, డాక్స్, జీమెయిల్ వంటి క్లౌడ్ సేవలను ఆధారంగా చేసుకుని పనిచేస్తుంది. మరోవైపు విండోస్ ల్యాప్‌టాప్‌లు మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తూ, అనేక రకాల డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్‌లు, గేమ్‌లు, ప్రొఫెషనల్ అప్లికేషన్‌లకు పూర్తి మద్దతును అందిస్తాయి. క్రోమ్‌బుక్‌లు ప్రధానంగా వెబ్ యాప్‌లు, ఆండ్రాయిడ్ యాప్‌లు, అలాగే అనేక మోడళ్లలో లైనక్స్ అప్లికేషన్‌లను కూడా సపోర్ట్ చేస్తాయి. అయితే విండోస్ ల్యాప్‌టాప్‌లు మరింత విస్తృతమైన డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్‌లు, ఆధునిక అప్లికేషన్‌లను నిర్వహిస్తాయి. అందువల్ల ప్రోగ్రామింగ్, వీడియో ఎడిటింగ్, ఇంజినీరింగ్, వ్యాపార అవసరాలకు ఉపయోగించే ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్‌ల విషయంలో విండోస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంటుంది.
ఏయే పనులకు ఏది..?
క్రోమ్‌బుక్‌లు సాధారణంగా వెబ్ బ్రౌజింగ్, ఆన్‌లైన్ క్లాస్‌లు, వీడియో స్ట్రీమింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్ వంటి రోజువారీ పనుల కోసం సౌకర్యవంతంగా ఉంటాయి. వీటిలో అధిక పనితీరు కంటే తక్కువ ధర, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌కు ప్రాధాన్యం ఇస్తారు. విండోస్ ల్యాప్‌టాప్‌లు మాత్రం సాధారణ వినియోగం కోసం ఉండే ఎంట్రీ లెవల్ మోడళ్ల నుంచి గేమింగ్, కంటెంట్ క్రియేషన్, భారీ పనిభారాన్ని నిర్వహించగలిగే హై-పర్‌ఫార్మెన్స్ మోడళ్ల వరకు విభిన్న శ్రేణిలో అందుబాటులో ఉంటాయి.

ఏ ల్యాప్‌టాప్‌ను తీసుకోవాలి..?
అయితే అందరికీ ఒకే ల్యాప్‌టాప్ సరిపోదు. వ్యక్తిగత వసరాల ఆధారంగా సరైన ఎంపిక మారుతుంది. విద్యార్థులు, సాధారణ వినియోగదారులు, ఎక్కువగా ఆన్‌లైన్‌లో పని చేసే వారికి క్రోమ్‌బుక్ మంచి ఎంపికగా ఉంటుంది. వెబ్ బ్రౌజింగ్, ఈ-మెయిల్, ఆన్‌లైన్ క్లాస్‌లు, వీడియో కాల్స్, వీడియో స్ట్రీమింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్ వంటి పనులను ఇది సులభంగా నిర్వహిస్తుంది. అలాగే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, సులభమైన వినియోగ అనుభవాన్ని అందిస్తుంది. ప్రొఫెషనల్స్, ప్రోగ్రామర్లు, డిజైనర్లు, ఇంజినీర్లు, కంటెంట్ క్రియేటర్లకు విండోస్ ల్యాప్‌టాప్ మరింత అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ల వినియోగానికి ఇది అవసరం. అలాగే గేమింగ్ కోసం కూడా శక్తివంతమైన హార్డ్‌వేర్, విస్తృతమైన సాఫ్ట్‌వేర్ అనుకూలత కారణంగా విండోస్ ల్యాప్‌టాప్‌లే ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి. ఆఫీస్ ఉద్యోగుల విషయంలో వారు ఉపయోగించే అప్లికేషన్‌లపై ఎంపిక ఆధారపడి ఉంటుంది. పని ఎక్కువగా బ్రౌజర్ లేదా క్లౌడ్ సర్వీసులపై ఆధారపడితే క్రోమ్‌బుక్ సరిపోతుంది. కానీ విండోస్‌కు మాత్రమే అందుబాటులో ఉండే సాఫ్ట్‌వేర్‌లు లేదా మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లోని అడ్వాన్స్‌డ్ ఫీచర్‌లను తరచూ ఉపయోగిస్తే విండోస్ ల్యాప్‌టాప్ ను తీసుకోవడం ఉత్తమం.
ఈ మోడల్స్‌పై లుక్కేయండి..
విద్యార్థులు, తొలిసారి ల్యాప్‌టాప్ కొనేవారు లేదా రోజువారీ అవసరాలకు తక్కువ ధరలో మంచి ల్యాప్‌టాప్ కోరుకునే వారు అసుస్ క్రోమ్‌బుక్ సీఎక్స్14, లెనోవో క్రోమ్‌బుక్ డ్యూయెట్ 11, హెచ్‌పీ క్రోమ్‌బుక్ ఎక్స్360 వంటి మోడళ్లను పరిశీలించవచ్చు. ఉద్యోగులు, ప్రోగ్రామర్లు, డిజైనర్లు, ఇంజినీర్లు లేదా కంటెంట్ క్రియేటర్లకు అసుస్ వివోబుక్ 16, లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 వంటి మోడళ్లు మంచి ఎంపికలుగా నిలుస్తాయి. గేమింగ్ కోసం హెచ్‌పీ విక్టస్ 15 అనుకూలంగా ఉంటుంది. ప్రీమియం బిజినెస్ ల్యాప్‌టాప్ కోరుకునే వారు లెనోవో థింక్‌ప్యాడ్ ఎక్స్1 కార్బన్ జనరేషన్ 13ను పరిగణించవచ్చు. అయితే వ్యక్తిగత అవసరాలకు సరిపోయే ల్యాప్‌టాప్‌నే ఉత్తమ ఎంపికగా భావించాలి. పని ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే ఉంటే, సరళమైన వినియోగం, తక్కువ బరువు, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలంటే క్రోమ్‌బుక్ సరిపోతుంది. అయితే అధిక పనితీరు, విస్తృతమైన సాఫ్ట్‌వేర్ సపోర్ట్, మరింత స్వేచ్ఛాయుత వినియోగం కావాలంటే విండోస్ ల్యాప్‌టాప్ ను కొనుగోలు చేయడం ఉత్తమం.
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన





