Anitha Radhakrishnan | విజయ్ ప్రభుత్వం నాలుగు నెలలకంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Anitha Radhakrishnan | విజయ్ (CM Vijay) నేతృత్వంలోని టీవీకే కూటమి ప్రభుత్వం ఆరు నెలలు కూడా అధికారంలో ఉండదని డీఎంకే (DMK) సీనియర్ నేత, ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ (Anitha Radhakrishnan) జోస్యం చెప్పారు.
Anitha Radhakrishnan | విజయ్ (CM Vijay) నేతృత్వంలోని టీవీకే కూటమి ప్రభుత్వంపై డీఎంకే (DMK) సీనియర్ నేత, ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్ (Anitha Radhakrishnan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఆరు నెలలు కూడా అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ త్వరలోనే మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారని వ్యాఖ్యానించారు. దక్షిణ తమిళనాడులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. "ఈ ప్రభుత్వం మహా అయితే ఇంకో నాలుగు నెలలు మాత్రమే అధికారంలో కొనసాగుతుంది. ఆ తర్వాత మా నాయకుడు (డీఎంకే అధినేత) తలైవర్ (స్టాలిన్) తదుపరి ముఖ్యమంత్రి అవుతారు. ఆరు నెలల్లో స్టాలిన్ మళ్లీ సీఎం కుర్చీలో కూర్చుంటారు" అంటూ వ్యాఖ్యానించారు.
అదే సమయంలో టీవీకేకి చెందిన సీనియర్ నేత, విల్లివాక్కం నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆధవ్ అర్జునకు అనిత రాధాకృష్ణన్ ఓ సవాల్ విసిరారు. ఆధవ్ అర్జున తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరుచెందూర్‌లో తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. "అక్కడ ఆధవ్ అర్జున.. నీకు నిజంగా దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్. నేను కూడా చేస్తా. ఇద్దరం కలిసి తిరుచెందూర్‌లో తలపడదాం. ఇది మా సొంత గడ్డ. ఇక్కడ ఎవరినైనా మేము ఓడిస్తాం" అని రాధాకృష్ణన్ సవాల్ విసిరారు.
Also Read..
బండి భగీరథ్‌పై మరో సెక్షన్.. నేరం రుజువైతే పదేండ్లు జైలు!
సెంట్రింగ్ కార్మికుల సమ్మె.. హైదరాబాద్‌లో నిలిచిన భవన నిర్మాణాలు
సంబంధిత వార్తలు

CM Vijay | కరూర్ ఘటన పక్కా కుట్ర.. సిగ్గులేకుండా నాపై నిందలేశారు : సీఎం విజయ్
జులై 10, 2026

CM Vijay | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిచ్చేందుకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
జులై 10, 2026

Karur Stampede Case | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. డీఎంకేపై సుప్రీంకోర్టు ఆగ్రహం
జులై 7, 2026
తాజావార్తలు
- ●Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు - బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్
- ●Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి
- ●Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..
- ●E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం
- ●Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..

Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు - బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్

Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి

Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..

E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం



