VD Satheesan | కేరళం సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం
VD Satheesan | కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా 20 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. వీరి చేత ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు.
VD Satheesan | త్రినేత్ర.న్యూస్ : కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా 20 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. వీరి చేత ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. కేరళం రాజధాని తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎంపీలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు కేరళం మాజీ సీఎం పినరయి విజయన్, పలువురు నేతలు హాజరయ్యారు. నూతన సీఎం సతీశన్‌తో పాటు మంత్రివర్గానికి శుభాంక్షలు తెలిపారు.
చారిత్రక విజయం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి చారిత్రక విజయం సాధించి. 102 స్థానాలతో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మాజీ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ (LDF) కూటమి 35 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించింది.
సతీశన్ గురించి..
సతీశన్ పూర్తిపూర్తి పేరు వడశేరి దామోదరన్ సతీశన్ నెట్టూరు. 1964, మే 31న ఎర్నాకుళం జిల్లాలో జన్మించారు. పనంపిల్లి నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. తేవరలోని సేక్రేడ్ హార్ట్ కళాశాలలో అండర్-గ్రాడ్యుయేషన్ చదివారు. ఆ తర్వాత కేరళ లా అకాడమీ నుంచి ఎల్.ఎల్.బి (LL.B), గవర్నమెంట్ లా కాలేజీ నుంచి ఎల్.ఎల్.ఎం (LL.M) పూర్తి చేశారు. అంతేకాకుండా సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ (MSW) కూడా పొందారు.
విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్ (KSU) మరియు ఎన్.ఎస్.యూ.ఐ (NSUI)లో కీలక బాధ్యతలు నిర్వహించారు. రాజకీయాల్లోకి రాకముందు 10ఏళ్ల పాటు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.
వరుసగా ఆరోసారి
సతీశన్ ఎర్నాకుళం జిల్లాలోని పరావూర్ (Paravur) నియోజకవర్గం నుంచి వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన కమ్యూనిస్ట్ కోటగా ఉన్న పరాపూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికలలో సీపీఐ అభ్యర్థి పీ. రాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2001లో జరిగిన ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి కేరళ అసెంబ్లీకి తొలిసారిగా అడుగుపెట్టారు. అప్పటి ఓటమి అనేదే లేకుండా వరుసగా ఆరుసార్లు 2001, 2006, 2011, 2016, 2021, 2026 అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
2021లో రమేశ్ చెన్నితాల స్థానంలో సతీశన్ ను కేరళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తూ అనేక పోరాటాలు చేసిన సతీశన్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TGSRTC | మీరు బెంగళూరు ప్రయాణికులా.. ఆ బస్సుల్లో మీకు ఫ్రీ జర్నీ
- ●CM Revanth Reddy | కేసీఆర్.. కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ : సీఎం రేవంత్ రెడ్డి
- ●Tollywood | మిరాయ్ బ్యూటీతో మెగా హీరో హారర్ కామెడీ మూవీ - మాస్ పోస్టర్‌తో రిలీజ్ డేట్ చెప్పేశారుగా!
- ●CM Revanth Reddy | భద్రాద్రి రాముడి మీద ఒట్టు.. 117కు సీట్లకు పైగా గెలుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
- ●PM Modi | 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌కు భారత ప్రధాని.. మోదీకి ఘన స్వాగతం
- ●CM Revanth Reddy | కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

TGSRTC | మీరు బెంగళూరు ప్రయాణికులా.. ఆ బస్సుల్లో మీకు ఫ్రీ జర్నీ

CM Revanth Reddy | కేసీఆర్.. కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ : సీఎం రేవంత్ రెడ్డి

Tollywood | మిరాయ్ బ్యూటీతో మెగా హీరో హారర్ కామెడీ మూవీ - మాస్ పోస్టర్‌తో రిలీజ్ డేట్ చెప్పేశారుగా!

CM Revanth Reddy | భద్రాద్రి రాముడి మీద ఒట్టు.. 117కు సీట్లకు పైగా గెలుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి






