Gold And Silver Prices Today | దేశ ప్రజలకు మోదీ ‘గోల్డ్’ షాక్.. ఒక్క రోజులోనే రూ.1.39 లక్షలు పెరిగిన పసిడి ధర..
Gold And Silver Prices Today | మరో ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకుండా ప్రజలు విదేశీ మారకాన్ని ఆదా చేయాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన అనంతరం 48 గంటల్లో విలువైన లోహాలపై కేంద్రం దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. అంతకు ముందు బంగారం, వెండిపై దిగుమతి సుంకాలు 6 శాతం ఉండగా ఇప్పుడది కేంద్రం పెంపుతో 15 శాతానికి చేరింది. దీంతో బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి.
Gold And Silver Prices Today | మరో ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకుండా ప్రజలు విదేశీ మారకాన్ని ఆదా చేయాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన అనంతరం 48 గంటల్లో విలువైన లోహాలపై కేంద్రం దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. అంతకు ముందు బంగారం, వెండిపై దిగుమతి సుంకాలు 6 శాతం ఉండగా ఇప్పుడది కేంద్రం పెంపుతో 15 శాతానికి చేరింది. దీంతో బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. ఒక్కొక్కటి ఏకంగా 6 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేశాయి. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1 శాతం పెరిగి 1,54,851 వద్ద ప్రారంభం కాగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు ఏకంగా 4 శాతం మేర పెరిగి 2,90,224 వద్ద ఓపెన్ అయింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆయా లోహాల కొనుగోళ్లు భారీగానే ఉన్నాయి. దీనికితోడు దిగుమతి సుంకాలను అమాంతం పెంచడంతో ఆయా లోహాల ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.33 శాతం తగ్గి 4,698 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 0.48 శాతం పడిపోయి 86 డాలర్ల వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే ఏకంగా రూ.1.39 లక్షలు పెరగ్గా, కేజీ వెండి ధర రూ.20వేలు పెరిగింది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.16,789 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,34,312 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,67,890 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.16,78,900 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,39,100 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,390 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,23,120గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,53,900 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.15,39,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,27,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,592 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,10,736గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,25,920 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.12,59,200గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,04,300 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.3,10,000 ఉండగా, తులం ధర రూ.3,100గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.20వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.3,00,100 ఉండగా, తులం ధర రూ.3,001 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో అనిశ్చితి..
జులై 6, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు మంచి సమయం..
జులై 4, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పెట్టుబడిదారుల జోరు.. ఒక్క రోజులోనే రూ.32వేలు పెరిగిన పసిడి ధర..
జులై 3, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



