త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

N. Ramchander Rao | కాళేశ్వ‌రం విష‌యంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ రెండూ నాట‌కాలు వేస్తున్నాయి: రాంచంద‌ర్‌రావు

N. Ramchander Rao | కాళేశ్వ‌రం విష‌యంలో (Kaleshwaram project ) ఒక వైపు కాంగ్రెస్, మ‌రోవైపు బీఆర్ఎస్ రెండూ నాట‌కాలు వేస్తున్నాయ‌ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రాంచంద‌ర్‌రావు (N. Ramchander Rao) మండిప‌డ్డారు.

D

Telangana | Published On Jul 6, 2026, 4.57 pm IST

N. Ramchander Rao | కాళేశ్వ‌రం విష‌యంలో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ రెండూ నాట‌కాలు వేస్తున్నాయి: రాంచంద‌ర్‌రావు
Advertisement

N. Ramchander Rao | త్రినేత్ర‌.న్యూస్ : కాళేశ్వ‌రం విష‌యంలో (Kaleshwaram project ) ఒక వైపు కాంగ్రెస్, మ‌రోవైపు బీఆర్ఎస్ రెండూ నాట‌కాలు వేస్తున్నాయ‌ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రాంచంద‌ర్‌రావు (N. Ramchander Rao) మండిప‌డ్డారు. ఒక‌రు కాళేశ్వ‌రం అంటుంటే, మ‌రొక‌రు కూళేశ్వ‌రం అంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. రెండు పార్టీలూ క‌లిసి డ్రామేశ్వ‌రం చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. రూ.ల‌క్షా ముప్పైవేల కోట్ల‌తో నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల, మేడిగ‌డ్డ, ఎల్లంప‌ల్లి బ్యారేజీల‌ను ఎన్‌డీఎస్ఏ మూడు సార్లు త‌నిఖీ చేసి నాణ్య‌తా లోపాల గురించి ప్ర‌స్తావించింద‌ని గుర్తు చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం దానిని మ‌ర‌మ్మ‌తు చేయ‌కుండా రైతుల జీవితాల‌తో ఆడుకుంటున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కాళేశ్వ‌రంను బీఆర్ఎస్ ఏటీఎంగా మార్చుకుంటే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం తుమ్మ‌డిహ‌ట్టి పేరుమీద ప్రాణ‌హిత చేవెళ్ల ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఏం చేసినా తెలంగాణ ప్ర‌జ‌లను మోసం చేయ‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లికారు. నిపుణుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా దానిని మ‌ర‌మ్మ‌తులు చేయ‌క‌పోవ‌డం కాంగ్రెస్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌న‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు. రేవంత్‌రెడ్డి కాళేశ్వ‌రంలో జ‌రిగిన అవినీతిని మ‌రిచిపోయారు. ఎవ‌రిపై ఏం చ‌ర్య‌లు తీసుకోలేద‌ని చెప్పారు. అధికారుల‌ను మాత్రం అరెస్టు చేసి, ఏదో చేసిన‌ట్లు చెప్పుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. కాళేశ్వ‌రంపై రేవంత్ రెడ్డికి ఎందుకు మ‌మ‌కార‌ముంద‌ని ప్ర‌శ్నించారు.

Also Read..

బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి

ఇప్ప‌టికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జ‌మ‌

న‌గర ఎకోపార్కుల‌న్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి

Advertisement
Advertisement