త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vladimir Putin | వారి వ‌ల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం కొన‌సాగుతోంది : పుతిన్‌

Vladimir Putin | ఉక్రెయిన్‌తో సాగుతున్న యుద్ధం (Ukraine War) నేప‌థ్యంలో కీవ్‌కు సైన్యాన్ని పంపొద్దంటూ ఐరోపా దేశాల‌ను (European nations) ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) హెచ్చ‌రించారు.

D

National | Published On Sep 12, 2026, 12.05 pm IST

Vladimir Putin | వారి వ‌ల్లే ఉక్రెయిన్‌తో యుద్ధం కొన‌సాగుతోంది : పుతిన్‌
Advertisement

Vladimir Putin | త్రినేత్ర‌.న్యూస్ : ఉక్రెయిన్‌తో సాగుతున్న యుద్ధం (Ukraine War) నేప‌థ్యంలో కీవ్‌కు సైన్యాన్ని పంపొద్దంటూ ఐరోపా దేశాల‌ను (European nations) ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) హెచ్చ‌రించారు. ప్ర‌స్తుతం బ్రిక్స్ శిఖ‌రాగ్ర స‌ద‌స్సు (BRICS Summit) కోసం ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్న పుతిన్ శ‌నివారం ఉద‌యం మీడియాతో మాట్లాడారు. తాము ఐరోపా దేశాల‌కు ఎలాంటి ముప్పును క‌లిగించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంప‌డం అంటే ర‌ష్యాతో యుద్ధం కోరుకున్న‌ట్లేన‌ని తేల్చి చెప్పారు.

"ఐరోపా దేశాల‌కు ర‌ష్యా నుంచి ఎలాంటి ముప్పూ లేదు.. ఉండ‌దు కూడా. ఐరోపా దేశాలపై దాడి చేసే ఉద్దేశం కానీ, వారిని బెదిరించాలనే ఆలోచన కానీ మాకు లేదు. కొన్ని దేశాల‌పై ర‌ష్యా దాడి చేస్తుంద‌నేది కేవ‌లం పాశ్చాత్య దేశాలు సృష్టిస్తున్న భ‌య‌మే. ఐరోపా దేశాల‌ను మేము బెదిరించాల‌ని ఎందుకు అనుకుంటాం..? ఐరోపాతో మాకు ఎలాంటి స‌మ‌స్య‌లూ, సంఘ‌ర్ష‌ణ‌లూ లేవు. రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత అన్ని స‌మ‌స్య‌లూ ప‌రిష్కార‌మ‌య్యాయి. ఆ తర్వాత సోవియట్ యూనియన్ పతనానంతరం జరిగిన పరిణామాలు కూడా రష్యా సమాఖ్య సమ్మతితోనే జరిగాయి. ఆ ఒప్పందాల‌కు విరుద్ధంగా జ‌రిగే ప్ర‌తీ చ‌ర్యా మా ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిస్తుంది. ఇప్పుడు వారు ఉక్రెయిన్‌కు త‌మ సైన్యాన్ని మోహ‌రించ‌డం గురించి ఆలోచిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అంటే దీని అర్థం ర‌ష్యాతో యుద్ధం కోరుకుంటున్న‌ట్లే. వారి వ‌ల్లే యుద్ధం కొన‌సాగుతోంది" అని పుతిన్ వ్యాఖ్యానించారు.

Also Read..

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. ఇక ట్యాగ్ చేసిన పోస్టులూ ప్రొఫైల్‌లోనే..

డేంజ‌ర్ జోన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. వ‌చ్చే వారం కీల‌కం..

ఎంఎస్‌సుబ్బుల‌క్ష్మి పాత్ర కోసం ర‌ష్మిక స్పెష‌ల్ ట్రైనింగ్ - బ‌యోపిక్ లాంఛ్ ఎప్పుడంటే?

Advertisement
Advertisement