త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | డేంజ‌ర్ జోన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. వ‌చ్చే వారం కీల‌కం..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ప్రారంభ నష్టాల నుంచి గణనీయంగా కోలుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గడంతో చమురుపై ఆధారపడే రంగాలపై ఒత్తిడి కొంత తగ్గింది. ఇటీవల మార్కెట్‌లో వచ్చిన పతనం కారణంగా ప్రధాన సూచీలు ఓవర్‌సోల్డ్ స్థాయికి చేరుకోవడంతో, తక్కువ ధరల వద్ద షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం కూడా మార్కెట్ రికవరీకి తోడ్పడింది.

S

Business | Published On Sep 12, 2026, 11.46 am IST

Stock Markets | డేంజ‌ర్ జోన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. వ‌చ్చే వారం కీల‌కం..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ప్రారంభ నష్టాల నుంచి గణనీయంగా కోలుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గడంతో చమురుపై ఆధారపడే రంగాలపై ఒత్తిడి కొంత తగ్గింది. ఇటీవల మార్కెట్‌లో వచ్చిన పతనం కారణంగా ప్రధాన సూచీలు ఓవర్‌సోల్డ్ స్థాయికి చేరుకోవడంతో, తక్కువ ధరల వద్ద షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం కూడా మార్కెట్ రికవరీకి తోడ్పడింది. నిఫ్టీ 50 ఇంట్రాడే కనిష్ఠ స్థాయి నుంచి 0.72 శాతం మేర కోలుకున్నప్పటికీ, చివరకు నష్టాల్లోనే ముగిసింది. సూచీ 0.34 శాతం ( 80 పాయింట్లు) నష్టపోయి 23,398 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ కూడా ప్రారంభ నష్టాల్లో ఎక్కువ భాగాన్ని పూడ్చుకుంది. చివరికి 0.16 శాతం (148 పాయింట్లు) తగ్గి 74,754 వద్ద ముగిసింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. ప్రపంచ ప్రమాణంగా పరిగణించే బ్రెంట్ క్రూడ్ ధర 2.3 శాతం తగ్గి బ్యారెల్‌కు 105.14 డాలర్లకు చేరింది. అంతకుముందు ఇది 108 డాలర్ల స్థాయిని దాటింది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఫిబ్రవరి చివర్లో బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 72 డాలర్లుగా ఉండేది. మరోవైపు అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర కూడా 2 శాతం తగ్గి బ్యారెల్‌కు 100.46 డాలర్లకు చేరింది.

నిఫ్టీ 50 ఎటువైపు?

నిఫ్టీ 50లో బలహీనత కొనసాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కీలక మూవింగ్ యావరేజీల కంటే దిగువన సూచీ ట్రేడవుతుండటంతోపాటు, మొమెంటం సూచీలు కూడా నిరంతర అమ్మకాల ఒత్తిడిని సూచిస్తున్నాయి. ఇటీవలి కరెక్షన్ నేపథ్యంలో నిఫ్టీ స్థిరపడుతుందా లేదా మరో దశ పతనం కొనసాగుతుందా అన్నది తెలుసుకోవడానికి కీలకమైన సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిలపై ట్రేడర్లు దృష్టి సారించారు. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సీనియర్ మేనేజర్, టెక్నికల్ రీసెర్చ్ నిపుణుడు జిగర్ ఎస్. పటేల్ తెలిపిన ప్రకారం.. కీలక మూవింగ్ యావరేజీలను కోల్పోవడంతో నిఫ్టీ 50 ప్రస్తుతం బలహీనమైన టెక్నికల్ నిర్మాణాన్ని సూచిస్తోంద‌ని తెలిపారు. 23,200-23,250 స్థాయి తక్షణ సపోర్ట్‌గా ఉంద‌ని, ఇది ఇటీవల ఏర్పడిన స్వింగ్ లో స్థాయి కావడంతో కీలకంగా మారిందని అన్నారు. ఈ సపోర్ట్‌ను స్పష్టంగా అధిగమించి దిగువకు వెళితే, తదుపరి సపోర్ట్‌లు 23,000-22,900 వద్ద, ఆ తర్వాత 22,400 వద్ద ఉంటాయ‌ని ఆయన పేర్కొన్నారు.

త‌క్ష‌ణ స‌పోర్ట్‌, రెసిస్టెన్స్ ఎక్క‌డ‌..

ఎగువన 23,500 స్థాయి తక్షణ రెసిస్టెన్స్‌గా ఉందని జిగర్ ఎస్. పటేల్ తెలిపారు. గతంలో ఈ స్థాయి సపోర్ట్‌గా పనిచేసినప్పటికీ, ఇప్పుడు అక్కడ అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. దీని పైన 24,000-24,100 ప్రాంతం ప్రధాన రెసిస్టెన్స్ జోన్‌గా ఉందని, ఇక్కడ కీలక మూవింగ్ యావరేజీలు ఒకచోట కలుస్తున్నాయని వివరించారు. నిఫ్టీ 24,100 పైన స్థిరంగా కదలగలిగితే టెక్నికల్ నిర్మాణం మెరుగుపడి 24,300-24,350 వరకు వెళ్లే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. మొమెంటం సూచీలు కూడా బలహీనంగానే ఉన్నాయి. ఆర్ఎస్ఐ సుమారు 25 వద్ద ఉండగా, డీఎంఐలో బేరిష్ ఆధిపత్యం కనిపిస్తోంది. దీంతో సమీప కాలంలో మరింత దిగువ ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం వ్యూహం అప్రమత్తంగా ఉండాలని, 23,200 కీలక సపోర్ట్ కాగా 24,100 ప్రధాన రెసిస్టెన్స్‌గా చూడాలని జిగర్ ఎస్. పటేల్ సూచించారు.

దూకుడుగా కొనుగోళ్లు వ‌ద్దు..

కాగా చాయిస్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ హితేష్ టైలర్ ప్రస్తుత పరిస్థితుల్లో దూకుడుగా కొనుగోళ్లు చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. దశలవారీగా కొనుగోళ్లు చేయడం మరింత సముచితమని తెలిపారు. మార్కెట్ దిగువ స్థాయిలో స్థిరపడుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపించే వరకు ఇన్వెస్టర్లు వేచి ఉండాలని, కనిష్ఠ స్థాయిని అంచనా వేసి వెంటనే కొనుగోలు చేయడానికి ప్రయత్నించకూడదని సూచించారు. టెక్నికల్ పరంగా నిఫ్టీ ప్రస్తుతం అన్ని కీలక ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజీల కంటే దిగువన ట్రేడవుతోందని హితేష్ టైలర్ తెలిపారు. దీంతో స్వల్పకాలిక మార్కెట్ నిర్మాణం బలహీనంగా ఉందన్నారు. 23,000-23,070 ప్రాంతం తక్షణం, అత్యంత కీలకమైన సపోర్ట్ జోన్‌గా ఉందని, ఇది గతంలో ఏర్పడిన హయ్యర్-లో నిర్మాణానికి కూడా అనుసంధానమై ఉందని వివరించారు.

నిఫ్టీ ఈ సపోర్ట్ జోన్‌ను నిలబెట్టుకోగలిగితే టెక్నికల్ రీబౌండ్ వచ్చే అవకాశం ఉందని, అయితే 23,000 స్థాయిని నిర్ణయాత్మకంగా దిగువకు దాటితే కరెక్షన్ మరింత విస్తరించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల నిఫ్టీ ముందుగా ఒక బేస్‌ను ఏర్పరుచుకుని కీలకమైన టెక్నికల్ స్థాయిలను తిరిగి సాధించిన తర్వాతే కొత్తగా కొనుగోళ్లను పరిశీలించడం మంచిదని సూచించారు.

Advertisement
Advertisement