Rashmika Mandanna | ఎంఎస్‌సుబ్బులక్ష్మి పాత్ర కోసం రష్మిక స్పెషల్ ట్రైనింగ్ – బయోపిక్ లాంఛ్ ఎప్పుడంటే?
లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. రష్మిక మందన్న టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లాంఛ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. సెప్టెంబర్ 16న ఓపెనింగ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించబోతున్నారు.
Entertainment | Published On Sep 12, 2026, 11.23 am IST
Rashmika Mandanna | దిగ్గజ సంగీత కళాకారిణి ఎంఎస్‌సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా ఓ పాన్ ఇండియన్ మూవీ రాబోతుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక మందన్న కనిపించబోతుంది. తొలుత సాయిపల్లవిని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ డేట్స్ ఇష్యూస్‌తో ఆమె ఈ సినిమా చేయలేకపోయింది. దాంతో రష్మికకు ఛాన్స్ దక్కింది.
జయంతి సందర్భంగా...
ఎంఎస్‌సుబ్బులక్ష్మి బయోపిక్ లాంఛ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఈ దిగ్గజ సింగర్ 101వ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 16న సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్లు తెలిసింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలో రష్మిక మందన్నతో పాటు పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీలు పాల్గొననున్నట్లు సమాచారం. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 16న ఈ బయోపిక్‌కు సంబంధించి రష్మిక మందన్న స్పెషల్ పోస్టర్ రిలీజయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
స్పెషల్ ట్రైనింగ్...
ఎంఎస్‌సుబ్బులక్ష్మి పాత్ర కోసం రష్మిక స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లు సమాచారం. లెజెండరీ సింగర్ పాత్ర కావడంతో ఏ మాత్రం అటుఇటు అయినా విమర్శలు భారీగా వచ్చే అవకాశం ఉంది. అందుకే కట్టుబొట్టు విషయంలోనే కాకుండా వీణ పట్టుకోవడం, మ్యానరిజమ్స్, మాటతీరు అన్ని సుబ్బులక్ష్మిలాగే ఉండేలా రష్మిక జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. కొన్నాళ్లు శిక్షణ తీసుకున్న తర్వాతే షూటింగ్‌ను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కర్ణాటక సంగీతకళాకారిణిలతో కలిసి ఓ స్పెషల్ వర్క్‌షాప్‌ను నిర్వహించబోతున్నట్లు సమాచారం.
ఐదు భాషల్లో...
తెలుగులో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీవాస్ ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌ను నిర్మిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Web Series Review | పంచనామా రివ్యూ – యాంకర్ ఉదయభాను ప్రొడ్యూసర్…తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
సెప్టెంబర్ 11, 2026

Kayadu Lohar | నాని ప్యారడైజ్ ఈవెంట్ – కయదు మిస్సింగ్
సెప్టెంబర్ 11, 2026

Priya Bhavani Shankar | ఇరుముడి సక్సెస్ మీట్లో కిందపడిపోయిన హీరోయిన్ – వీడియో వైరల్
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టు.. తప్పదోవ పట్టించేలా సీఎం ఫొటో.. వ్యక్తిపై ఎఫ్ఐఆర్
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయం ఇదేనా..?
- ●Anthropic | అతి పెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న ఆంథ్రోపిక్.. ఆఫర్ విలువ 100 బిలియన్ డాలర్లు..
- ●Brahmotsavalu 2026 | తిరుమలలో ఏడాదికి పది బ్రహ్మోత్సవాలు.. ఇప్పుడు ఒక్కసారే ఎందుకు?
- ●Harish Rawat | ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్.. పదవుల నుంచి తప్పుకున్న మాజీ సీఎం
- ●Ganesh Idol | గణపతి తొండం కుడివైపు ఉంటే ఏంటి? ఎడమవైపు ఉంటే ఏంటి? పూజలో ఈ తేడా ఎందుకు?

Revanth Reddy | రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టు.. తప్పదోవ పట్టించేలా సీఎం ఫొటో.. వ్యక్తిపై ఎఫ్ఐఆర్

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయం ఇదేనా..?

Anthropic | అతి పెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న ఆంథ్రోపిక్.. ఆఫర్ విలువ 100 బిలియన్ డాలర్లు..

Brahmotsavalu 2026 | తిరుమలలో ఏడాదికి పది బ్రహ్మోత్సవాలు.. ఇప్పుడు ఒక్కసారే ఎందుకు?



