Ex Bus Driver | షాకింగ్.. మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం
Ex Bus Driver | పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో ఓ మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో (Ex Bus Driver) పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది.
Ex Bus Driver | పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో ఓ మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో (Ex Bus Driver) పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ నోట్ల కట్టలను లెక్కించేందుకు కౌంటింగ్ మెషీన్లు కూడా మోరాయించడం గమనార్హం. ఈ ఘటన బీర్భూమ్ (Birbhum) జిల్లాలో చోటు చేసుకుంది.
ఇసుక మాఫియాపై దర్యాప్తులో భాగంగా పక్కా సమాచారంతో మీనార్ మోండల్ (Minar Mondal) అనే విశ్రాంత బస్సు డ్రైవర్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏకంగా గుట్టలు గుట్టలుగా నగదు లభించడం అధికారులను షాక్‌కు గురి చేసింది. నగదుతోపాటూ దాదాపు 15 కిలోల బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గోల్డ్ విలువ రూ.21 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. బుధవారం రాత్రి ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. సోదాల్లో భాగంగా మీనార్ మోండల్ ఇంట్లో పోలీసులకు తొలుత రూ. 5.5 కోట్ల నగదు లభించింది. దీంతో అధికారులు మరింత లోతుగా సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీగా బంగారం, నగదు కట్టలు బయటపడ్డాయి. పట్టుబడ్డ మొత్తం నగదు రూ. 28 కోట్లు అని అధికారులు తెలిపారు. ఆ నగదు లెక్కింపు సమయంలో ఐదు కౌంటింగ్ మెషీన్లు కూడా మెరాయించడం గమనార్హం.
స్థానికంగా ఇసుక, క్వారీ మాఫియా డాన్‌గా పేర్కొనే తులు మోండల్‌కు.. మీనార్ మోండల్ సమీప బంధువుగా పోలీసులు గుర్తించారు. గతంలో బెంగాల్ ప్రభుత్వంలో బస్సు డ్రైవరుగా పనిచేసిన మీనార్.. ఆ తర్వాత ఉద్యోగం మానేసి క్వారీ వ్యాపారం మొదలుపెట్టాడు. తులు మోండల్‌కు చెందిన రాయి క్వారీలు, క్రషింగ్ యూనిట్లతో అతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బు, బంగారంతో పాటు మీనార్ పేరుమీద భారీ ఎత్తున ఆస్తులు ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. నగదు రికవరీ చేసుకున్న పోలీసులు మీనార్ మోండల్‌ను అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఆ నగదు, బంగారం తులు మోండాల్‌కు, అతని సిండికేట్‌కు చెందినవని విచారణలో అంగీకరించాడు. తులు మోండల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్ శిబిరంలో ఈ నెల ప్రారంభంలో చేరిన అనుబ్రత మోండల్ సన్నిహితుడిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
ఎలాంటి భయాలూ లేకుండా పనిచేయండి.. నాదీ బాధ్యత.. పెల్లెట్ వివాదం వేళ CRPF చీఫ్ కీలక వ్యాఖ్యలు
హృతిక్ రోషన్‌లా కనిపించానేమో.. కంగనకు కాక్రోచ్ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ కౌంటర్
యుద్ధ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
సంబంధిత వార్తలు

Green India Challenge | మడ అడవుల్లో మరో 10వేల మొక్కలు.. సుందర్బన్స్కు అండగా గ్రీన్ ఇండియా చాలెంజ్
జులై 27, 2026

Mamata Banerjee | ఆ ద్రోహులకు పార్టీలోకి నో ఎంట్రీ.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు ఏకంకావాలి : మమతా బెనర్జీ
జులై 21, 2026

Supreme Court | ఓటు తీసేస్తే సిటిజన్ షిప్ తొలగించినట్టు కాదు : సుప్రీంకోర్టు
జులై 17, 2026
తాజావార్తలు
- ●CRPF chief | ఎలాంటి భయాలూ లేకుండా పనిచేయండి.. నాదీ బాధ్యత.. పెల్లెట్ వివాదం వేళ CRPF చీఫ్ కీలక వ్యాఖ్యలు
- ●Ajinkya Rahane | అజింక్యా రహానే రిటైర్మెంట్.. క్రికెట్‌కు వీడ్కోలు..
- ●Saurav Das | హృతిక్ రోషన్‌లా కనిపించానేమో.. కంగనకు కాక్రోచ్ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ కౌంటర్
- ●Gold And Silver Prices Today | యుద్ధ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..
- ●Himanshu Rao | హిమాన్షు రావుకు సర్జరీ.. గచ్చిబౌలి ఏఐజీకి కేసీఆర్
- ●WhatsApp | వాట్సాప్ వెబ్‌లో కాలింగ్ ఫీచర్.. ఇక బ్రౌజర్ నుంచే ఆడియో, వీడియో కాల్స్..

CRPF chief | ఎలాంటి భయాలూ లేకుండా పనిచేయండి.. నాదీ బాధ్యత.. పెల్లెట్ వివాదం వేళ CRPF చీఫ్ కీలక వ్యాఖ్యలు

Ajinkya Rahane | అజింక్యా రహానే రిటైర్మెంట్.. క్రికెట్‌కు వీడ్కోలు..

Saurav Das | హృతిక్ రోషన్‌లా కనిపించానేమో.. కంగనకు కాక్రోచ్ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ కౌంటర్

Gold And Silver Prices Today | యుద్ధ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..



