త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Dasoju Sravan | నిన్న పులి.. నేడు పిల్లి.. ‘దానం’పై ఎమ్మెల్సీ దాసోజు సెటైర్లు

MLC Dasoju Sravan | ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ నిప్పులు చెరిగారు. హైకోర్టు తీర్పుపై పులిలా గ‌ర్జించి.. ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే పిల్లిలా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించార‌ని దానంపై దాసోజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

S

Telangana | Published On Sep 20, 2026, 1.22 pm IST

MLC Dasoju Sravan | నిన్న పులి.. నేడు పిల్లి.. ‘దానం’పై ఎమ్మెల్సీ దాసోజు సెటైర్లు
Advertisement

MLC Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్ : ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ నిప్పులు చెరిగారు. హైకోర్టు తీర్పుపై పులిలా గ‌ర్జించి.. ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే పిల్లిలా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించార‌ని దానంపై దాసోజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఖైర‌తాబాద్‌లో మీ ఖేల్ ఖ‌తం అంటూ విమ‌ర్శించారు.

ఉపఎన్నికలను ఎదుర్కునే దమ్ము లేక, భయంతో దానం నాగేందర్‌ను రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు మెట్లెక్కించారు. సాక్షాత్తూ రేవంత్ రెడ్డి పోటీ చేసినప్పటికి, ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమ‌న్నారు. రేవంత్ రెడ్డి తోలుబొమ్మలాటలో దానం నాగేందర్ డ్రామా ఆడుతున్నాడు. కోర్టులంటే భయం లేదు, రాజ్యాంగంపై భక్తి లేదు, ఈ రేవంత్ కాంగ్రెస్ బరితెగింపు రాజకీయాల అంతు తేలుస్తాం అని దాసోజు శ్ర‌వ‌ణ్ హెచ్చ‌రించారు.

పార్టీ ఫిరాయింపుల‌పై హైకోర్టు మొట్టికాయలు వేయగానే నిన్నటిదాకా పులిలా గర్జించి, తెల్లారేసరికి పిల్లిలా మారి సుప్రీంకోర్టు కాళ్లవేళ్లా పడటం రేవంత్ కాంగ్రెస్ నడుపుతున్న పచ్చి అవకాశవాద నాటకానికి నిదర్శనం అని ఆయ‌న పేర్కొన్నారు.

నిన్న పులి గాండ్రింపులు

హైకోర్టు తీర్పు వెలువడగానే దానం నాగేందర్ కెమెరాల ముందుకు వచ్చి రంకెలేశారు. "నేను ఏ సుప్రీంకోర్టుకూ వెళ్ళను... రాజీనామా చేసి మళ్లీ ఖైరతాబాద్ బరిలో నిలబడతా... గెలిచి నా సత్తా ఏంటో చూపిస్తా, నేను ఫైటర్ " అంటూ పెద్ద ప్రగల్భాలు పల్కినాడు!!

నేడు పిల్లిలా లంచ్ మోషన్లు

రాత్రికి రాత్రే ఆ బిల్డప్, పౌరుషం, ఆ గర్జన ఏమైపోయాయి? 24 గంటలు తిరగకముందే పిల్లిలా నక్కి , మ్యావ్ మ్యావ్ అంటూ సుప్రీంకోర్టు ముందు లంచ్ మోషన్ పిటిషన్ వేయడానికి ఎందుకు పరుగెత్తారు? ప్రజలను ఇంత బహిరంగంగా మోసం చేయడానికి సిగ్గు లేదా? రాజ్యాంగాన్ని ఖూనీ చేసింది చాలదా?

తెరవెనుక సూత్రధారి రేవంత్ రెడ్డే

ఇది దానం నాగేందర్ సొంత డ్రామా కాదు, రేవంత్ రెడ్డి ఆడిస్తున్న క్షుద్ర తోలుబొమ్మలాట. ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి స్వయంగా దానం నాగేందర్‌ను పావుగా వాడుకుంటూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.

రేవంత్ రెడ్డి దమ్ముంటే ఉపఎన్నికలకు రండి

రాజ్యాంగ వ్యవస్థల వెనుక దాక్కొని, ఖరీదైన పెద్ద అడ్వొకేట్లను ఉపయోగించి, కాలయాపన చేసే దొంగ నాటకాలు బంద్ చేయండి. రేవంత్ రెడ్డి, మీకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే, మీపై, మీ పరిపాలనపై నమ్మకముంటే, మీకు నిజంగా దమ్ముంటే, సుప్రీంకోర్టుకు వెళ్లకుండా, ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికను ఎదుర్కోండి. అక్కడ దానం నాగేందర్‌ను నిలబెడతారో ఎవరిని నిలబెడతారో తేల్చుకోండి, ఖైరతాబాద్ ప్రజలే మీ తోలుబొమ్మలాటకు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు అని దాసోజు శ్ర‌వ‌ణ్ తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement