Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు
Dharmasthala Case | కర్ణాటక (Karnataka)లో సంచలనం సృష్టించిన ధర్మస్థల హత్యాచార కేసు (Dharmasthala Case) మరోసారి తెరపైకి వచ్చింది. 12 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి విచారణకు ఆదేశించింది (reinvestigation).
Dharmasthala Case | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటక (Karnataka)లో సంచలనం సృష్టించిన ధర్మస్థల హత్యాచార కేసు (Dharmasthala Case) మరోసారి తెరపైకి వచ్చింది. ఉజిరే (Ujire)లో 2012లో జరిగిన 12 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి విచారణకు ఆదేశించింది (reinvestigation). 14 ఏళ్లుగా మిస్టరీగా ఉన్న ఈ కేసుపై విచారణను మూడు నెలల్లోగా పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
2012 అక్టోబర్‌లో 17 ఏళ్ల యువతి అపహరణకు గురైంది. ఆ తర్వాతి రోజే ఆమె డెడ్‌బాడీ నేత్రావతి నది సమీపంలో లభ్యమైంది. అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసుపై తొలుత కర్ణాటక సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత కేసును సీబీఐ టేకోవర్ చేసింది. అయినప్పటికీ నిజమైన దోషులు ఎవర్నది తేలలేదు. ఈ కేసులో సంతోష్‌రావు అనే వ్యక్తిని తొలుత అరెస్ట్ చేశారు. అయితే, సరైన సాక్షాధారాలు లేకపోవడంతో స్పెషల్ కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో గత 14 ఏళ్లుగా ఈ కేసు మిస్టరీగానే ఉండిపోయింది.
కేసుపై మళ్లీ విచారణ జరపాలని కోరుతూ బాధిత కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బాధితురాలి తల్లి సర్నోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణలో కీలక ఆధారాలను విస్మరించారని, దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నాయని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసును మళ్లీ విచారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మొదటి నుంచి నిష్పక్షపాతంగా తిరిగి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. 14 ఏళ్లుగా సాగుతున్న ఈ న్యాయపోరాటంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని బాధితురాలి కుటుంబంతో పాటు సామాజిక కార్యకర్త మహేష్ శెట్టి తిమరోడి కూడా స్వాగతించారు. ఇన్నాళ్లుగా వీడని ఈ మిస్టరీ కేసులోని అసలైన దోషులకు శిక్ష పడుతుందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి.. టీవీకే పాలనపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేరళ ఫిల్మ్ ఫెస్టివల్.. 31 సినిమాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు డేట్ ఫిక్స్.. భారీ ఆఫర్లు..
తాజావార్తలు
- ●Kerala Film Festival | కేరళ ఫిల్మ్ ఫెస్టివల్.. 31 సినిమాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- ●KTR | సిరిసిల్ల అభివృద్ధిని కొడంగల్‌లో చేసేందుకు వస్తున్నరేమో?
- ●టెసరాక్ట్ వర్సెస్ ఫామ్‌హౌస్‌లు.. ఒకరి ఆరోపణకు మరొకరి ఆస్తులే సమాధానమా?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లో జోరు.. 564 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
- ●Prakash Raj | విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి.. టీవీకే పాలనపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Sanjay Jaju | అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం

Kerala Film Festival | కేరళ ఫిల్మ్ ఫెస్టివల్.. 31 సినిమాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

KTR | సిరిసిల్ల అభివృద్ధిని కొడంగల్‌లో చేసేందుకు వస్తున్నరేమో?

టెసరాక్ట్ వర్సెస్ ఫామ్‌హౌస్‌లు.. ఒకరి ఆరోపణకు మరొకరి ఆస్తులే సమాధానమా?

Stock Markets | స్టాక్ మార్కెట్లో జోరు.. 564 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..





