త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్ల‌ను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్ప‌ష్ట‌త‌..

Indian Railways | భారతీయ రైల్వేలో యూపీఐ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అక్టోబర్ 15 నుంచి కొత్త మార్పు అమల్లోకి రానుంది. రూ.2వేలకు మించిన యూపీఐ చెల్లింపులపై సాధారణ వ్యాపార సంస్థలకు 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వర్తించనుంది. అయితే రైల్వే టికెట్ బుకింగ్‌ను ప్రత్యేక కేటగిరీలో చేర్చారు.

S

Business | Published On Sep 21, 2026, 5.21 pm IST

Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్ల‌ను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్ప‌ష్ట‌త‌..
Advertisement

Indian Railways | భారతీయ రైల్వేలో యూపీఐ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అక్టోబర్ 15 నుంచి కొత్త మార్పు అమల్లోకి రానుంది. రూ.2వేలకు మించిన యూపీఐ చెల్లింపులపై సాధారణ వ్యాపార సంస్థలకు 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వర్తించనుంది. అయితే రైల్వే టికెట్ బుకింగ్‌ను ప్రత్యేక కేటగిరీలో చేర్చారు. దీంతో రూ.2వేలకు మించిన రైల్వే టికెట్ చెల్లింపులపై 0.4 శాతం కాకుండా ప్రతి లావాదేవీకి స్థిరంగా రూ.5 ఎండీఆర్ మాత్రమే వర్తిస్తుంది. అయితే ఈ రూ.5 ఛార్జీని ప్రయాణికుల నుంచి వసూలు చేయరు. కోటా డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సౌరభ్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఛార్జీ మర్చంట్ అంటే రైల్వే టికెట్ విక్రయించే సంస్థ వైపు నుంచి చెల్లించాల్సి ఉంటుంది. యూనియన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఎండీఆర్ ఛార్జీని కస్టమర్లపై మోపకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించింది. అంటే రూ.3వేల విలువైన రైల్వే టికెట్‌ను యూపీఐ ద్వారా బుక్ చేస్తే ప్రయాణికుడు రూ.3,005 చెల్లించాల్సిన అవసరం ఉండదు. టికెట్ ధర రూ.3వేలుగానే ఉంటుంది.

ప్ర‌యాణికుల‌పై ఛార్జీలు లేవు..

అదే విధంగా రూ.5వేల విలువైన రైల్వే టికెట్‌కు సాధారణ 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తే రూ.20 ఛార్జీ అయ్యేది. కానీ రైల్వే టికెట్ బుకింగ్‌కు ప్రత్యేక కేటగిరీ వర్తించడంతో కేవలం రూ.5 మాత్రమే ఎండీఆర్‌గా చెల్లించాలి. రూ.10వేల విలువైన సాధారణ వ్యాపారి లావాదేవీకి రూ.40 ఎండీఆర్ వర్తిస్తే, అదే మొత్తానికి రైల్వే టికెట్ యూపీఐ చెల్లింపుపై కేవలం రూ.5 ఎండీఆర్ మాత్రమే వర్తిస్తుంది. కొత్త విధానం ప్రకారం రూ.2వేల వరకు చేసే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఎండీఆర్ ఉండదు. రూ.2వేలకు మించిన సాధారణ వ్యాపారి చెల్లింపులకు 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. అయితే రైల్వే టికెట్ బుకింగ్‌కు రూ.5 స్థిర ఎండీఆర్ విధానం అమల్లోకి వస్తుంది. ఈ ఛార్జీని ప్రయాణికుడి టికెట్ ధరకు అదనంగా వసూలు చేయకూడదు. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ బదిలీలు కూడా మొత్తం ఎంతైనా ఉచితంగానే కొనసాగుతాయి.

టిక్కెట్ ధ‌ర మారుతుందా..

కొత్త ఎండీఆర్ విధానం వల్ల రైల్వే టికెట్ ధరలు ఆటోమేటిక్‌గా పెరగవు. ఉదాహరణకు రూ.3వేల టికెట్‌ను యూపీఐ ద్వారా బుక్ చేస్తే దాని ధర రూ.3వేలుగానే ఉంటుంది. చెల్లింపు ప్రక్రియకు సంబంధించిన అదనపు రూ.5 ఖర్చును మర్చంట్ వైపు భరించాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త నిబంధన కారణంగా ప్రయాణికుడిపై నేరుగా అదనపు భారం పడకూడదు. అయితే రైల్వేలో డిజిటల్ టికెట్ బుకింగ్‌ల సంఖ్య భారీగా ఉండడంతో మర్చంట్ వైపు ఈ ఖర్చు మొత్తంగా గణనీయంగా మారే అవకాశం ఉంది. ఉదాహరణకు రోజుకు రూ.2వేలకు మించిన ఒక లక్ష రైల్వే టికెట్ లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగితే, ఒక్కో లావాదేవీకి రూ.5 చొప్పున రోజుకు రూ.5 లక్షల ఎండీఆర్ అవుతుంది. ఏడాది మొత్తంలో ఇది సుమారు రూ.18.25 కోట్లకు చేరుతుంది. అలాగే రైల్వే, ఐఆర్‌సీటీసీ, బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థల మధ్య ఈ ఖర్చును ఎలా పంచుతార‌నే అంశాలపై అసలు విష‌యం ఆధారపడి ఉంటుంది.

Advertisement
Advertisement