V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
V Hanumantha Rao | ఇందిరమ్మ ఇచ్చిన భూములన్నీ దొరల పాలయ్యాయని.. కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడలని ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు అన్నారు. కీసర మండలం రాంపల్లి దాయరలో భూములను కబ్జా చేశారని ఆరోపించారు.
- కబ్జాదారులకు బుద్ది చెప్పాలి
- ఇందిరమ్మ భూములన్నీ దొరలపాలయ్యాయి
- రాగి కృష్ణారెడ్డి కోట్లు సంపాదిస్తున్నాడు
- మీడియాతో ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు
V Hanumantha Rao | త్రినేత్ర.న్యూస్: ఇందిరమ్మ ఇచ్చిన భూములన్నీ దొరల పాలయ్యాయని.. కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడలని ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు అన్నారు. కీసర మండలం రాంపల్లి దాయరలో భూములను కబ్జా చేశారని ఆరోపించారు. చనిపోయిన 14 ఏళ్ళ తర్వాత ఒకతని సంతకం ఫోర్జరీ చేశారని పేర్కొన్నారు. కబ్జాదారులకు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అప్పటి స్పీకర్ మీనాకుమారి కాళ్ల మీద పడ్డారని వ్యాఖ్యానించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఆమె కాళ్ల మీద పడ్డారు..
కేసీఆర్ అప్పటి స్పీకర్ మీరాకుమారి కాళ్ళ మీద పడ్డారు. నేను ఎట్టి పరిస్థితులలో సీఎంను కాను అన్నారు. సీఎం అయ్యాక దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు. ఇందిరా గాంధీ ఇచ్చిన 38 e భూములను కుడా లాక్కున్నాడు. గత పదేళ్ల నుంచి ఇదే అంశంపై పోరాడుతున్న. బీఆర్ఎస్, ధరణికి వ్యతిరేకంగా ఫైట్ చేశా.
రాంపల్లి దాయర సమస్యను పరిష్కరించాలి..
పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1973లో సీలింగ్ యాక్ట్ తీసుకువచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ ఇచ్చిన భూమిని కాంగ్రెస్సే కాపాడాలి. కీసర మండలం రాంపల్లి దాయరలో భూములను కబ్జా చేశారు. చనిపోయిన 14 ఏళ్ళ తర్వాత ఒకతని సంతకం ఫోర్జరీ చేశారు. దొంగ సంతకాలతో భూములు కొట్టేసారు.పేదవాళ్ళు కోర్ట్ ల చుట్టూ ఎలా తిరుగుతారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కబ్జాదారులకు బుద్ది చెప్పాలి. ఇందిరమ్మ పరిపాలన అంటున్నారు కాబట్టి రాంపల్లి దాయర కేసు పరిష్కరించాలి.
ఇందిరమ్మ ఇచ్చిన భూములు దొరల పాలు అయ్యాయి. రాగి కృష్ణారెడ్డి 94 ఎకరాలలో 36 ఎకరాలు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చారు. రాగి కృష్ణారెడ్డి కుటుంబం సభ్యులు కోట్లు సంపాదిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ కి తప్పుడు సలహాలు ఇచ్చారు. పటేల్ పట్వారీ వ్యవస్థ తొలగించడం వల్లే ఈ సమస్య. ప్రభుత్వ భూములను ఎవరు ఎవరికి అమ్మే అర్హత లేదు. భూ భారతి వల్ల పేదలకు న్యాయం జరగాలి అని హనుమంతరావు సూచించారు.
తాజావార్తలు
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
- ●Vaishnavi Chaitanya | వయసుపై తప్పుడు ప్రచారం - ఆధార్ కార్డ్‌తో క్లారిటీ ఇచ్చిన బేబీ హీరోయిన్
- ●Chamala Kirankumar Reddy | శంషాబాద్‌లో మిక్సాలజిస్ట్కు ఫామ్‌హౌస్ ఎలా వచ్చింది?
- ●YouTuber Nandana Visa Scam | యూకే జాబ్స్ పేరుతో యూట్యూబర్ నందన భారీ మోసం కేసు.. ప్రజావాణికి పోటెత్తిన బాధితులు

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు

Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..

Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Vaishnavi Chaitanya | వయసుపై తప్పుడు ప్రచారం - ఆధార్ కార్డ్‌తో క్లారిటీ ఇచ్చిన బేబీ హీరోయిన్





