Supreme Court | టెట్రా ప్యాక్‌లు, సాచెట్లలో మద్యం అమ్మకాలు.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court | టెట్రా ప్యాకెట్లు (Tetra Packs), సాచెట్ల (sachets)లో మద్యం విక్రయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Supreme Court | టెట్రా ప్యాకెట్లు (Tetra Packs), సాచెట్ల (sachets)లో మద్యం విక్రయించడాన్ని తక్షణమే నిషేధించాలని కోరుతూ 'కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్' అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) విచారణకు స్వీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇలాంటి ప్యాకుల వల్ల ఫ్రూట్ జ్యూస్, మద్యానికి మధ్య గందరగోళం తలెత్తుతోందని పేర్కొన్నారు. ప్యాకెట్‌పైన పండ్ల ఫొటోలను వాడుతున్నారని, కానీ ప్యాక్ లోపల మాత్రం వోడ్కా ఉంటోందని కోర్టుకు తెలిపారు. ప్రజారోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టెట్రా ప్యాక్‌లు, సాచెట్లలో మద్యం విక్రయించడాన్ని తక్షణమే నిషేధించేలా ఒకే రకమైన విధానాన్ని (uniform policy) రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పటిషనర్ తరఫున న్యాయవాది కోర్టును కోరారు. అంతేకాదు, ప్రస్తుత ఎక్సైజ్ చట్టాల ప్రకారం బాటిల్ నిర్వచనం అస్పష్టంగా ఉందని, దానిని ప్రామాణీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తమ ఎక్సైజ్ చట్టాలు, నిబంధనలు, విధానాలను సవరించేలా రాష్ట్రాలను ఆదేశించాలని కోరారు. స్పందించిన ధర్మాసనం.. దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది
కాగా, టెట్రా ప్యాకెట్లలో లభించే చౌకైన మద్యం సులభంగా తరలించడానికి వీలుగా ఉండటమే కాకుండా, పండ్ల రసాల (Juice) ప్యాకెట్లను పోలి ఉండటం వల్ల చిన్నపిల్లలకు, పాఠశాల విద్యార్థులకు సులువుగా అందుబాటులోకి వస్తోందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఇక ఇలాంటి ప్యాకింగుల పట్ల సుప్రీంకోర్టు కూడా గతంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్యాకింగ్ పద్ధతులు యువతలో సులభంగా మద్యం అలవాటు పడే ప్రమాదాన్ని పెంచుతాయని, ప్రజారోగ్యాన్ని విస్మరించి ప్రభుత్వాలు ఆదాయానికి ప్రాధాన్యత ఇవ్వడంపై గతంలో కూడా సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Also Read..
ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
సంబంధిత వార్తలు

NEET System | నీట్ పరీక్షా విధానం అత్యంత సురక్షితం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
ఆగస్టు 19, 2026

Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..
ఆగస్టు 18, 2026

Delhi Police | CJP పార్లమెంట్ మార్చ్ చట్టవిరుద్ధం.. అక్రమంగా బలప్రయోగం చేయలేదు : ఢిల్లీ పోలీసులు
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్
- ●UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!
- ●Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్
- ●Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్
- ●SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం

Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్

Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్



