Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్
Konda Susmitha | సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత (Konda Susmitha) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం సృష్టిస్తున్నాయి. సుస్మితపై పార్టీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Konda Susmitha | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత (Konda Susmitha) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం సృష్టిస్తున్నాయి. సుస్మితపై పార్టీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ మహిళా నేత ఇందిరా శోభన్ (Indira Shobhan) అన్నారు. ఆమె వల్ల మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సురేఖ క్షమాపణ కోరే పరిస్థితి తీసుకొన్నావంటూ మండిపడ్డారు. కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తెచ్చే నువ్వు నాయకురాలివి ఎలా అవుతావంటూ ధ్వజమెత్తారు. రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు ఉందా? అని నిలిదీశారు. నీ పేరు చిట్టి.. చిట్టిలా మాట్లాడితే మంచిది` అంటూ హితవు పలికారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో కల్వ సుజాత, వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుంజ రేణుక, వైస్ చైర్‌పర్సన్ జక్కని అనితతో కలిసి ఇందిరా శోభన్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌లో కవిత అవుదాం అనుకుంటున్నావా?: గుంజా రేణుక
సుస్మిత పటేల్ కాంగ్రెస్‌లో కవిత అవుదామని అనుకుంటుందా? అని వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుంజా రేణుక ప్రశ్నించారు. ఆమె తెలంగాణలో ఇంకా పటేల్ పట్వారీ వ్యవస్థ ఉంది అనుకుంటునట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఎక్కడ ఉన్నా పట్టుకొని కర్రు కాల్చి వాత పెడతామని హెచ్చరించారు. ముందు వార్డు మెంబర్‌గా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని సుస్మితది సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి కాదని చెప్పారు. కూతురిని అదుపులో పెట్టుకోవాలని మంత్రి కొండా సురేఖకు సూచించారు. బ్లాక్ మెయిల్ చేస్తా అంటే ఇక్కడ నడవదన్నారు. తాము కొండత చేసి గోరంత కూడా చెప్పుకోలేక పోతున్నామని వెల్లడించారు. చేసింది చెప్పుకోలేక పోవడం తమ పొరపాటని చెప్పారు.
సంబంధిత వార్తలు

Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్
ఆగస్టు 20, 2026

Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
ఆగస్టు 20, 2026

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!
- ●Melanoma Cancer | చర్మ క్యాన్సర్కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్
- ●SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ
- ●US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..

UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Melanoma Cancer | చర్మ క్యాన్సర్కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్

SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..

Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం



