Meta Layoffs | మెటాలో మొదలైన లేఆఫ్స్.. ఉదయం 4 గంటలకే మెయిల్స్
Meta Layoffs | ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మెటా ఉద్యోగాల కోతలను (Meta Layoffs) మొదలు పెట్టింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకుసింగపూర్ (Singapore) హబ్‌లోని బాధిత ఉద్యోగులకు ఈమెయిల్స్ వెళ్లాయట. ఈ రౌండ్ లేఆఫ్‌లు ముఖ్యంగా ఇంజినీరింగ్, ప్రొడక్ట్ బృందాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Meta Layoffs | ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మెటా ఉద్యోగాల కోతలను (Meta Layoffs) మొదలు పెట్టింది. మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) నేతృత్వంలోని అమెరికాకు చెందిన ఈ టెక్ దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా సుమారు 8వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం. మే 20 నుంచి తొలిదశ లేఆఫ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందంటూ రాయిటర్స్ ఇప్పటికే నివేదించింది. ఇందులో భాగంగా తాజా రౌండ్ లేఆఫ్స్‌ను సంస్థ స్టార్ట్ చేసింది.
నిద్ర లేవకముందే లేఆఫ్స్ పిడుగు..
ఇప్పటికే పలువురు ఉద్యోగులకు లేఆఫ్స్ సమాచారం అందజేసినట్లు బ్లూమ్‌బర్గ్ (Bloomberg) నివేదించింది. మొదటగా సింగపూర్‌లోని మెటా బృందానికి ఈ చేదు వార్త చేరినట్లు పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 గంటలకు) సింగపూర్ (Singapore) హబ్‌లోని బాధిత ఉద్యోగులకు ఈమెయిల్స్ వెళ్లాయట. ఈ రౌండ్ లేఆఫ్‌లు ముఖ్యంగా ఇంజినీరింగ్, ప్రొడక్ట్ బృందాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇంటి నుంచే పని చేయండి..
అమెరికా, యూరప్ ప్రాంతాల్లోని ఉద్యోగులకు కూడా త్వరలో అధికారిక నోటీసులు జారీ కానున్నట్లు మెటా అంతర్గత మెమోలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని కంపెనీ సూచించింది. ముఖ్యంగా ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఏఐ రంగంలో భారీ పెట్టుబడులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు మెటా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గూగుల్, ఓపెన్‌ఏఐ వంటి సంస్థలతో పోటీ పడేందుకు ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగానే డేటా సెంటర్ల నిర్మాణానికి 2028 నాటికి 600 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ ప్రణాళికలు రూపొందించినట్లు కూడా మెటా తెలిపింది. ఇప్పటికే సుమారు 7,000 మంది ఉద్యోగులను ఏఐ ప్రాజెక్టులకు బదిలీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. చిన్న బృందాలతో పని చేయడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.
ఏడాది చివర్లో మరిన్ని లేఆఫ్స్
నివేదికల ప్రకారం.. 2025 డిసెంబర్ 31 నాటికి మెటాలో మొత్తం 79,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించాలని సంస్థ యోచిస్తోంది. అంటే సుమారు 16 వేల మంది ఉద్యోగులు తమ కొలువులను కోల్పోనున్నారు. ఇక తొలి విడతలో భాగంగా మే 20 నాటికి 10 శాతం మందికి లేఆఫ్స్ ఇవ్వాలని సంస్థ ప్లాన్ చేసింది. ఈ ఏడాది చివరిలో మరిన్ని తొలగింపులు ఉంటాయని సమాచారం. 2022-23 తర్వాత మెటా చేపట్టిన అతి పెద్ద లేఆఫ్స్ ఇవే. 2022 చివర్లో మెటా 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే.
ఒరాకిల్‌లోనూ..
మెటాతోపాటూ.. అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ (Oracle) సైతం తన ఉద్యోగులకు షాకిచ్చింది (Oracle Layoffs). దాదాపు 30,000 మందిని ఉద్యోగాల నుండి తొలగించింది.
Also Read..
ఇటలీలో ప్రధాని మోదీ.. మరోసారి ట్రెండింగ్‌లో "మెలోడీ" మూమెంట్
గూగుల్ జెమిని ఏఐకి భారీ అప్ డేట్స్.. ఏజెంటిక్ ఏఐలో కొత్త విప్లవం..
NALCO | ఐటీఐ, డిప్లొమా అర్హతతో నాల్కోలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
తాజావార్తలు
- ●Harish Rao | రేవంత్.. సర్వేయర్లకు కోపం రాకముందే పిలిచి మాట్లాడు.. లేదంటే ఢిల్లీలో ఏమైందో తెల్సు కదా
- ●School Sealed | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బుర్ఖాతో డ్యాన్స్.. పాఠశాల సీజ్
- ●MLA Sudheer Reddy | మేం టిమ్స్‌కు వెళ్తే డొల్లతనం బయటపడుతుందని భయం.. అందుకే అడ్డుకుంటున్నరు
- ●NEET System | నీట్ పరీక్షా విధానం అత్యంత సురక్షితం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
- ●Income Tax Department | అనుమానాస్పద విదేశీ నగదు బదిలీలపై ఐటీ శాఖ నజర్
- ●Principal Murdered | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు.. 27 సార్లు కత్తితో పొడిచి చంపిన టెన్త్ విద్యార్థులు

Harish Rao | రేవంత్.. సర్వేయర్లకు కోపం రాకముందే పిలిచి మాట్లాడు.. లేదంటే ఢిల్లీలో ఏమైందో తెల్సు కదా

School Sealed | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బుర్ఖాతో డ్యాన్స్.. పాఠశాల సీజ్

MLA Sudheer Reddy | మేం టిమ్స్‌కు వెళ్తే డొల్లతనం బయటపడుతుందని భయం.. అందుకే అడ్డుకుంటున్నరు

NEET System | నీట్ పరీక్షా విధానం అత్యంత సురక్షితం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం






