Modi-Trump | ఏడాది తర్వాత.. మళ్లీ కలవబోతున్న మోదీ-ట్రంప్..?
Modi-Trump| ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Modi-Trump) దాదాపు ఏడాది తర్వాత భేటీ కాబోతున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. వచ్చే నెలలో ఫ్రాన్స్ (France)లో జరగబోయే జీ7 సదస్సు (G7 Summit)లో ట్రంప్-మోదీ ముఖాముఖి కలిసే అవకాశం ఉందని సమాచారం.
International | Published On May 20, 2026, 11.40 am IST
Modi-Trump| ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తించే అతికొద్ది సమావేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Modi-Trump) భేటీ ఒకటి. ప్రపంచదేశాల నాయకులకు వీరి భేటీపై ఉన్న ఆసక్తి ఇతర ఏ సమావేశాలపై కూడా ఉండదు. అయితే, ఈ ఇద్దరు నేతలు త్వరలోనే భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఫ్రాన్స్ (France)లో జరగబోయే జీ7 సదస్సు (G7 Summit)లో ట్రంప్-మోదీ ముఖాముఖి కలిసే అవకాశం ఉందని సమాచారం. దాదాపు ఏడాది తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ భేటీ కాబోతున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
మోదీ, ట్రంప్ చివరిసారిగా గతేడాది ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత అధ్యక్ష భవనంలో ట్రంప్‌ను మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశానికి ప్రపంచ దేశాధినేతలు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో మోదీని గొప్ప స్నేహితుడిగా ట్రంప్ అభివర్ణించారు. ఆ భేటీలో 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే, ఆ తర్వాత నాలుగు నెలలకే అమెరికాతో భారత్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పుడు మోదీ-ట్రంప్ మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో తానే కీలక పాత్ర పోషించానంటూ ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా చాటింపు వేసుకున్నారు. అధిక టారిఫ్‌లు విధిస్తానని బెదిరించడంతో ఇరు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ప్రచారం చేశారు. ట్రంప్ ప్రకటనలతో మోదీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. ట్రంప్‌కు మోదీ లొంగిపోయారంటూ ధ్వజమెత్తాయి. అయితే, కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదంటూ మోదీ ప్రభుత్వం చాలాసార్లు స్పష్టంగా చెప్పింది. అయినా, ట్రంప్ వ్యాఖ్యల్లో మాత్రం మార్పు రాలేదు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలోనూ వివాదం తలెత్తింది. వరుస వివాదాలతో ఇరు దేశాధినేతలు ముఖాముఖిగా భేటీ కాలేదు.
ప్రపంచ వేదికగా జరిగే శిఖరాగ్ర సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నా ప్రధాని మోదీ పలు కారణాలతో హాజరుకాలేదు. కెనడాలో జరిగిన G7 సదస్సుకు హాజరైన ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం అందింది. వాషింగ్టన్‌కు వచ్చి తనతో కలిసి రాత్రి భోజనం చేయాలంటూ ట్రంప్ చేసిన ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. ఒడిశాలోని పూరీ జగన్నాథుడిని దర్శించుకోవాలనే ముందస్తు కార్యక్రమాల కారణంగానే ఆయన అమెరికా వెళ్లేందుకు నిరాకరించారు. ఈ భేటీకి బదులుగా... ప్రధాని మోదీ ట్రంప్‌ను భారతదేశంలో జరిగే క్వాడ్ (Quad) సదస్సుకు ఆహ్వానించగా, అందుకు ట్రంప్ సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత ఇరుదేశాధినేతలూ పలు సందర్భాల్లో ఫోన్‌లో సంభాషించుకున్నారు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత వీరు మళ్లీ ముఖాముఖి భేటీ కాబోతున్నట్లు సమాచారం.
Also Read..
మెటాలో మొదలైన లేఆఫ్స్.. ఉదయం 4 గంటలకే మెయిల్స్
ఇటలీలో ప్రధాని మోదీ.. మరోసారి ట్రెండింగ్‌లో "మెలోడీ" మూమెంట్
నేను క్షేమంగానే ఉన్నా.. హాస్పిటల్లో చేరాడన్న వార్తలపై అమితాబ్ క్లారిటీ
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని

Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..






