US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
US Senate | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడి యుద్ధ అధికారాలను పరిమితం చేసే తీర్మానానికి సెనేట్‌లో ఆమోదం లభించింది.
International | Published On May 20, 2026, 12.02 pm IST
US Senate | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై అధ్యక్షుడు అనుసరిస్తున్న దూకుడు (Iran War) వైఖరికి అమెరికా సెనేట్ (US Senate) బ్రేక్ వేసింది. అధ్యక్షుడి యుద్ధ అధికారాలను పరిమితం చేసే తీర్మానానికి సెనేట్‌లో ఆమోదం లభించింది.
ఇరాన్‌పై సైనిక చర్యలకు దిగే విషయంలో అధ్యక్షుడి అధికారాలను నియంత్రించేందుకు ప్రతిపక్షాలు గతంలో చాలాసార్లు తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే, అవి ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన 80 రోజుల తర్వాత ట్రంప్‌కు అమెరికా సెనేట్ (House and Senate) బ్రేక్ వేసింది. అధ్యక్షుడి యుద్ధ అధికారాలను నియంత్రించేందుకు ఉద్దేశించి డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ టిమ్ కెయిన్ (Tim Kaine) కొత్త తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ స్పష్టమైన అనుమతి లేకుండా ఇరాన్‌లో గానీ, ఇరాన్‌కు వ్యతిరేకంగా గానీ జరిగే ఘర్షణల్లో అమెరికా సైన్యం పాల్గొనరాదని అందులో పేర్కొన్నారు.
100 మంది సభ్యులున్న సెనేట్‌లో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. ఓటింగ్‌లో ఈ తీర్మానానికి 50 మంది అనుకూలంగా ఓటు వేయగా.. 47 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ముఖ్యంగా అధికార రిపబ్లికన్ (Republicans) పార్టీకే చెందిన నలుగురు సభ్యులు కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటేయడం చర్చనీయాంశమైంది. త్వరలో ఈ బిల్లుపై తుది ఓటింగ్ జరగనుంది. అది చట్టంగా మారితే.. కాంగ్రెస్ అధికారిక అనుమతి ఇచ్చే వరకు ట్రంప్ ఇరాన్‌పై ఎలాంటి సైనిక దాడులకు ఆదేశాలు ఇవ్వలేరు.
అయితే, రిపబ్లికన్ల ఆధిక్యం ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (దిగువ సభ)లో ఈ తీర్మానం తప్పక పాస్ కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా, అధ్యక్షుడు ట్రంప్ దీనిని వీటో (తిరస్కరించే అధికారం) చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనిని అధిగమించి ఈ తీర్మానం గట్టెక్కాలంటే హౌస్, సెనేట్ రెండింటిలోనూ మూడింట రెండొంతుల (two-thirds) మెజారిటీ లభించాల్సి ఉంటుంది.
Also Read..
ఏడాది తర్వాత.. మళ్లీ కలవబోతున్న మోదీ-ట్రంప్..?
మెటాలో మొదలైన లేఆఫ్స్.. ఉదయం 4 గంటలకే మెయిల్స్
ఇటలీలో ప్రధాని మోదీ.. మరోసారి ట్రెండింగ్‌లో "మెలోడీ" మూమెంట్
సంబంధిత వార్తలు

India US trade | భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం.. 2030 వరకు 500 బిలియన్ల డాలర్లకు..
ఆగస్టు 18, 2026

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!
ఆగస్టు 18, 2026

Donald Trump | ఎన్నికల నిర్వహణపై భారత్‌ను ఉదాహరణగా తీసుకోవాలి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్
- ●UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!
- ●Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్
- ●Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్
- ●SBI | ఎస్బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమలు..
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం

Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

UP Judge | 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. ఆ జడ్జీ నుంచి 100 హత్య కేసులు బదిలీ..!

Konda Susmitha | రేవంత్ నాయకత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు సుష్మితకు ఉందా?: ఇందిరా శోభన్

Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే "వ్యక్తిగత mRNA" వ్యాక్సిన్



