Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్
Mahesh Goud | పార్టీకి వ్యవతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Goud) స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని చెప్పారు.
Mahesh Goud | త్రినేత్ర.న్యూస్: పార్టీకి వ్యవతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Goud) స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని చెప్పారు. కొండా సుస్మిత (Konda Susmitha) వ్యాఖ్యలు బాధాకరమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఆమె నుంచి వివరణ కోరామన్నారు. వివరణ ఇచ్చాక తదుపరి చర్యకు తీసుకుంటామని స్పష్టం చేశారు. చిన్నారెడ్డి (Chinna Reddy) సీనియర్ నాయకులు, పార్టీ లైన్ దాటితే క్రమ శిక్షణ చర్యలు తప్పవని చెప్పారు.
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఎవరు ప్రకటించినా అవి చెల్లుబాటు కావని తెలిపారు. పార్టీలో అభ్యర్థుల ఎంపికకు ఒక స్పష్టమైన విధానం ఉంటుందని చెప్పారు. ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) నిర్ణయాల మేరకే అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు.
బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం..
22ఏ (Section 22A) అంశంపై బీఆర్‌ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని విమర్శించారు. కింది స్థాయిలో జరిగిన తప్పిదం తమ దృష్టికి వస్తే లోపాలను సరిదిద్దాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. తప్పిదం జరిగిందని సాక్ష్యాత్తు సంబంధిత మంత్రి స్వయంగా ప్రకటించి, దాన్ని సరిదిద్దే చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. 22ఏ నిబంధన వల్ల భూదందాలు, భూముల అన్యాక్రాంతానికి అవకాశం ఉండదని వెల్లడించారు. తమ ప్రభుత్వంలో సామాన్యులకు అన్యాయం జరిగితే నేరుగా గాంధీభవన్ తలుపులు తట్టవచ్చని సూచించారు.
పోచారం ఇటీవల చేసిన వ్యాఖ్యల పై ఆయన తో మాట్లాడాం. ఆయన ఆవేదన ను అర్ధం చేసుకున్నాం. నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ లో సీనియర్ నేతలకు 70 శాతం పదవులు ఇస్తాం. బాన్సువాడ లో పాత కొత్త నేతల కలయిక తో ముందుకు వెళ్తాం. పోచారం కాంగ్రెస్ సిద్ధాంతాలకు , సంక్షేమానికి మద్దతుగా ఉన్నారు.
పోచారంతో మాట్లాడాం..
సీనియర్ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయనతో ఇప్పటికే మాట్లాడామన్నారు. ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నామని చెప్పారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ (Congress) సీనియర్ నేతలకు 70 శాతం పదవులు ఇస్తామని తెలిపారు. బాన్సువాడలో పాత, కొత్త నేతలను కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ సిద్ధాంతాలకు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీలో ‘పచ్చ నేతలు’ ఎవరూ లేరని, పాత–కొత్త నేతల కలయికతో పార్టీని బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు






