Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
Konda Susmitha | తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత (Konda Susmitha) చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం చెలరేగింది.
Konda Susmitha | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత (Konda Susmitha) చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం చెలరేగింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని (Revuri Prakash Reddy) ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవూరికి దమ్ముంటే రాజీనామా చేసి తన పైన పోటీ చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేయాలని అప్పుడు ఎవరు గెలుస్తారో అందరికీ తెలుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పరకాల (Parakala) అభ్యర్థిని తానేనని, రేవంత్ కాదు.. ఆయన తాత వచ్చినా తానే విజయం సాధిస్తానన్నారు. దీనికి కౌంటర్ ఇస్తే సీఎం రేవంత్ అన్నదమ్ములు చేసిన బాగోతాన్ని బయట పెడతానని హెచ్చరించారు.
పిల్ల కాకికి ఏం తెలుసు..
సుస్మిత వ్యాఖ్యలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు (KR Nagaraju) స్పందించారు. రేవంత్ కాలిగోటికికూడా ఆమె సరిపోదని మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసిన వాళ్లకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, పిల్ల కాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని చెప్పారు. కనీసం కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేని వాళ్లు మాట్లాడుతున్నారని, ఆమెకు మాట్లాడడానికి కనీస అర్హత కూడా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. డైపర్లు ఎవరు వేసుకుంటారో అందరికీ తెలుసన్నారు.
నా స్థాయిని తగ్గించుకోను..
వ్యక్తిగత విమర్శలకు సమాధానం చెప్పి తన స్థాయిని తగ్గించుకోనని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సరైన సమయంలో దీటుగా సమాధానం చెబుతానని వెల్లడించారు. ఆమె వెనక ఎవరున్నారో కూడా తెలని చెప్పారు. ప్రజల్లో మంచి పేరు ఉండటంతోపాటు ఇంటిలిజెంట్ నివేదికల ఆధారంగానే సీఎం తనను అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. సరైన సమయంలో అధిష్టానం సరైన నిర్ణయం తీసుకొని సమాధానం చెబుతుందన్నారు.
తాజావార్తలు
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్






