NEET System | నీట్ పరీక్షా విధానం అత్యంత సురక్షితం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
NEET System | జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ అత్యంత సురక్షితమైనదని (NEET system is secure) కేంద్రం స్పష్టం చేసింది. దీన్ని ఉల్లంఘించడం అసాధ్యమని సుప్రీంకోర్టు (Supreme Court)కు తెలిపింది. అత్యంత అరుదుగా జరిగే మానవ తప్పిదాలు లేదా ప్రమేయం మినహా, వ్యవస్థాపరంగా (Systemic) లీకేజీలకు ఎక్కడా తావు లేదని వెల్లడించింది.
NEET System | త్రినేత్ర.న్యూస్ : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ అత్యంత పకడ్బందీగా, సురక్షితంగా ఉందని (Foolproof) కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిని ఉల్లంఘించడం (Breach) సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు (Supreme Court) తెలిపింది. ప్రశ్నపత్రాల తయారీ, వాటి రవాణాలో అనుసరిస్తున్న పకడ్బందీ భద్రతా చర్యలను అత్యున్నత న్యాయస్థానానికి వివరించింది.
నీట్-యూజీ పేపర్ లీక్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్కరణలు కొరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణకు కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పరీక్షల భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన కీలక వివరాలను ధర్మాసనానికి తెలియజేశారు. ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియలో పలువురు సబ్జెక్ట్ నిపుణులు, మాడరేటర్లు ప్రతి సబ్జెక్టుకు ఒక కామన్ క్వశ్చన్ బ్యాంక్ కోసం 500 ప్రశ్నలను రూపొందిస్తారని తెలిపారు. అందులో నుంచి ఏ ప్రశ్నలు తుది పరీక్షా పేపర్‌లో వస్తాయనే విషయం నిపుణులకు కూడా తెలియదని వెల్లడించారు. నీట్ పరీక్షల కోసం అమల్లో ఉన్న వ్యవస్థ లోపరహితమైనది అని, దానిని ఛేదించడం కష్టమని తుషార్ మెహతా నొక్కి చెప్పారు.
జీపీఎస్ నిఘా నీడలో రవాణా...
అదే విధంగా క్వశ్చన్ పేపర్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేటప్పుడు కఠినమైన భద్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రశ్నపత్రాలను తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పింది. రవాణా సమయంలో జరిగే ప్రతి చిన్న కదలికను అధికారులు ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తారని పేర్కొంది. అత్యంత అరుదుగా జరిగే మానవ తప్పిదాలు లేదా ప్రమేయం మినహా, వ్యవస్థాపరంగా (Systemic) లీకేజీలకు ఎక్కడా తావు లేదని, ఈ ప్రక్రియ లీకేజీ రహితమైనదని కేంద్రం వివరించింది.
Also Read..
వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. కుక్క ముఖంతో ప్రజావాణికి వచ్చిన వ్యక్తి
కొత్త కారు, ఖర్చుల కోసం నెలకు రూ.లక్ష.. ఎమ్మెల్యేలపై సీఎం విజయ్ వరాల జల్లు
సంబంధిత వార్తలు

One Nation One Election JPC | ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ కమిటీ, సుప్రీంకోర్టు జడ్జీల భేటీ?: రాజ్యాంగ విరుద్ధమంటూ కపిల్ సిబల్ ఫైర్
అక్టోబర్ 1, 2026

Mamata Banerjee | మమత వర్గానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
అక్టోబర్ 1, 2026

Supreme Court | బాణసంచాపై సంపూర్ణ నిషేధం కుదరదు : సుప్రీంకోర్టు
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●Priyanka Chopra | ప్రియాంక చోప్రా తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్
- ●Akbaruddin Owaisi | నా వయసైపోయింది.. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత
- ●ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!
- ●Tiger | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులి దర్శనం..
- ●CM Revanth Reddy | కొత్త ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు సమకూర్చండి

Priyanka Chopra | ప్రియాంక చోప్రా తమిళ మూవీ - దళపతి విజయ్ హీరో - యూట్యూబ్‌లో ఫ్రీ స్ట్రీమింగ్

Akbaruddin Owaisi | నా వయసైపోయింది.. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

Men's Hockey Team | ఆసియా క్రీడల్లో హాకీ గోల్డ్.. మలేసియాపై భారత్ సూపర్ విక్టరీ.. ఒలింపిక్స్‌కు అర్హత

ఆఫర్లో కొన్నారా.. ఆఫర్ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!



