Delhi Police | CJP పార్లమెంట్ మార్చ్ చట్టవిరుద్ధం.. అక్రమంగా బలప్రయోగం చేయలేదు : ఢిల్లీ పోలీసులు
Delhi Police | సీజేపీ నిరసనల సమయంలో (CJP's Parliament march) విద్యార్థులపై అతిగా బలప్రయోగం జరిగిందన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు (Delhi Police) తోసిపుచ్చారు. నిబంధనలకు లోబడే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. చలో సంసద్‌కు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.
- ఆరోజు నిరసనల్లో 30 వేల మంది పాల్గొన్నారు
- 240 మంది పోలీసులు గాయపడ్డారు
- నిరసన గుంపులో సంఘ విద్రోహ శక్తులు
- 2,873 మందిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం, పోక్సో కేసులు
- సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు
- స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సుప్రీం ధర్మాసనం
Delhi Police | త్రినేత్ర.న్యూస్ : నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సంసద్ చలో ఆందోళనల (CJP's Parliament march) సమయంలో విద్యార్థి నిరసనకారులపై పోలీసులు (Delhi Police) లాఠీఛార్జ్, పెల్లెట్ గన్స్ వాడారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. విద్యార్థులపై అతిగా బలప్రయోగం జరిగిందన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు.
ఆరోజు నిరసనల్లో 30 వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వారిని అదుపుచేసేందుకు 5 వేల మంది పోలీసులు మోహరించినట్లు చెప్పారు. నిబంధనలకు లోబడే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అయితే, నిరసనకారులు బారికేడ్లను దాటుకుని పార్లమెంటు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చెప్పారు. దీంతో అదుపు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో ఇరు వర్గాలు గాయపడ్డారని వివరించారు. సుమారు 240 మంది పోలీసులు, 200 మంది నిరసనకారులు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందన్నారు. నిరసనల సమయంలో పోలీసులు క్రూరత్వంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు ప్రతిస్పందనగా ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టు (Supreme Court )లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
పార్లమెంట్ మార్చ్‌కు అనుమతి లేదు
సీజేపీ తలపెట్టిన చలో సంసద్‌కు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. ఢిల్లీలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలిపారు. సీజేపీ నిరసనలు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. బారికేడ్లను దాటొద్దని ఎంత చెప్పినా నిరసనకారులు పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. కొందరు నిరసనకారులు పోలీసు సిబ్బందిపై దాడి చేసి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని ఆరోపించారు.
అది పోలీసు లాఠీ కాదు..
అదే సమయంలో నిరసనల సమయంలో మేకులు ఉన్న లాఠీలను ఉపయోగించారన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. అది పోలీసు లాఠీ కాదని తేల్చిచెప్పారు. అది జెండా ఉన్న కర్ర అని, దాన్ని ఓ నిరసనకారుడు పట్టుకున్నాడని వివరించారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతోనే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చేసిన ఇతర ప్రయత్నాలు విఫలమైన తర్వాతే టియర్ గ్యాస్, పరిమిత లాఠీఛార్జ్ చేసినట్లు స్పష్టం చేశారు.
నిరసన గుంపులో సంఘ విద్రోహ శక్తులు
బారికేడ్లను ఛేదించిన తర్వాత కొందరు నిరసనకారులు పోలీసు సిబ్బందిపై దాడులు చేశారని ఆరోపించారు. గుంపులు గుంపులుగా అధికారులను చుట్టుముట్టి విచక్షణారహితంగా కొట్టారని తెలిపారు. రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. నేర చరిత్ర కలిగిన వారు, సంఘ విద్రోహ శక్తులు నిరసన గుంపులో కలిసిపోయారని పోలీసులు తమ అఫిడవిట్‌లో ఆరోపించారు. అందులో సుమారు 2,873 మందిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ, అత్యాచారం, పోక్సో చట్టం కింద నేరాలతో సహా పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు గుర్తించామన్నారు.
స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశం
ఢిల్లీ పోలీసుల ఆరోపణల నేపథ్యంలో నీట్ (NEET) పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పోలీసులు మితిమీరిన బలప్రయోగం చేశారనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటైర్డ్ న్యాయమూర్తుల నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Also Read..
అసెంబ్లీలో ప్రతిపక్షానికి క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్.. ఎందుకంటే..?
సంబంధిత వార్తలు

Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..
ఆగస్టు 18, 2026

Supreme Court | ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం కోరుతూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..?
ఆగస్టు 18, 2026

Ram Temple Donations Case | రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు వేగవంతం చేయాలి
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..
- ●Defence Manufacturing | రక్షణ రంగంలో భారత్ మరో భారీ అడుగు.. కీలక ఉత్పత్తులు సొంతంగా తయారీ..
- ●Tiger | పట్ట పగలు.. గుర్రాన్ని చంపిన పెద్ద పులి.. వీడియో
- ●Nidhhi Agerwal | ఎట్టకేలకు ఓ ఛాన్స్ - పౌరాణిక సినిమాలో నిధి అగర్వాల్ - లేడీ ఓరియెంటెడ్ జానర్‌తో ప్రయోగం
- ●Peddi Swapna | నువ్ లేని రోజు ఇంత కష్టమొస్తదనుకోలే.. విగ్రహం తొలగిస్తే తట్టుకోలేకపోతున్నం
- ●CM Vijay | అసెంబ్లీలో ప్రతిపక్షానికి క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్.. ఎందుకంటే..?

Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..

Defence Manufacturing | రక్షణ రంగంలో భారత్ మరో భారీ అడుగు.. కీలక ఉత్పత్తులు సొంతంగా తయారీ..

Tiger | పట్ట పగలు.. గుర్రాన్ని చంపిన పెద్ద పులి.. వీడియో

Nidhhi Agerwal | ఎట్టకేలకు ఓ ఛాన్స్ - పౌరాణిక సినిమాలో నిధి అగర్వాల్ - లేడీ ఓరియెంటెడ్ జానర్‌తో ప్రయోగం



