Melanoma Cancer | చర్మ క్యాన్సర్‌కు చెక్.. తిరిగి రాకుండా అడ్డుకునే “వ్యక్తిగత mRNA” వ్యాక్సిన్
Melanoma Cancer | క్యాన్సర్ చికిత్స రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా సంస్థలు మోడెర్నా, మెర్క్ (Moderna and Merck) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తిగత mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ (personalised mRNA cancer vaccine) ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుతమైన ఫలితాలు సాధించాయి.
- క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుతమైన ఫలితాలు
- వ్యాక్సిన్, కీట్రుడా కలిపి తీసుకున్న వారిలో మంచి ఫలితాలు
- 1,137 మంది రోగులపై ప్రయోగం
Melanoma Cancer | త్రినేత్ర.న్యూస్ : క్యాన్సర్ చికిత్స రంగంలో మరో కీలక ముందడుగు పడింది. శస్త్రచికిత్స తర్వాత మెలానోమా (Melanoma Cancer) మళ్లీ తలెత్తే లేదా వ్యాపించే ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రముఖ ఫార్మా సంస్థలు మోడెర్నా, మెర్క్ (Moderna and Merck) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తిగత mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ (personalised mRNA cancer vaccine) ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుతమైన ఫలితాలు సాధించాయి. ఈ విషయాన్ని ఫార్మా సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.
అత్యంత ప్రమాదకరమైన మెలానోమా రోగులపై జరిపిన ఈ లేట్-స్టేజ్ ట్రయల్స్‌లో.. తీవ్రమైన చర్మ క్యాన్సర్ (మెలానోమా) రోగుల్లో క్యాన్సర్ తిరిగి రాకుండా, ఇతర అవయవాలకు వ్యాపించకుండా నిరోధించడంలో ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలను చూపించినట్లు కంపెనీలు తెలిపాయి. ఫేజ్ 3 ట్రయల్‌లో శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ కణితులను పూర్తిగా తొలగించుకున్న 1,137 మంది రోగులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించారు. వీరంతా స్టేజ్ IIB నుంచి IV వరకు ఉన్న అధిక ప్రమాద మెలనోమా బాధితులు.
కీట్రుడాతో కలిపి ఇస్తేనే..
పరిశోధనలో భాగంగా రోగులను రెండు బృందాలుగా విభజించినట్లు సదరు సంస్థలు వివరించాయి. ఇందులో ఓ బృందానికి కొత్త mRNA వ్యాక్సిన్‌తో కలిపి మెర్క్ సంస్థకు చెందిన ప్రసిద్ధ ఇమ్యునోథెరపీ ఔషధం 'కీట్రుడా' (Keytruda/pembrolizumab)ను ఇచ్చారు. మరో బృందానికి కేవలం కీట్రుడాను మాత్రమే అందించారు. కేవలం కీట్రుడా తీసుకున్న రోగులతో పోలిస్తే.. వ్యాక్సిన్, కీట్రుడా కలిపి తీసుకున్న వారిలో క్యాన్సర్ మళ్లీ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా, క్యాన్సర్ శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించే డిస్టెంట్ మెటాస్టాసిస్ ముప్పు కూడా తగ్గినట్లు వెల్లడైంది. ఇది క్యాన్సర్ చికిత్సలో నిజంగానే ఒక చారిత్రాత్మక మైలురాయిగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఒక్కో రోగికి తగినట్లుగా వ్యాక్సిన్..
సాంప్రదాయ ఇన్‌ఫెక్షన్లను నివారించడానికి రూపొందించే సాధారణ వ్యాక్సిన్‌లా కాకుండా వ్యక్తిగతీకరించిన mRNA క్యాన్సర్ వ్యాక్సిన్‌లను ఒక్కో రోగికి తగినట్లుగా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ముందుగా రోగి శరీరం నుంచి శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ కణితిని తొలగిస్తారు. అనంతరం ఆ కణితి యొక్క జన్యుపరమైన మార్పులను (మ్యుటేషన్స్) లోతుగా విశ్లేషిస్తారు. కేవలం క్యాన్సర్ కణాలకు మాత్రమే ప్రత్యేకమైన జన్యు మార్పులను (నియోయాంటిజెన్‌లు) గుర్తిస్తారు. ఈ జన్యు సమాచారం ఆధారంగా ఒక mRNA వ్యాక్సిన్‌ను రూపొందిస్తారు. ఈ వ్యాక్సిన్‌ను రోగికి ఇచ్చినప్పుడు, అది వారి రోగనిరోధక వ్యవస్థకు ఒక శిక్షకుడిలా పనిచేస్తుంది. శరీరంలోని టీ-కణాలకు, క్యాన్సర్ కణాలను కచ్చితంగా గుర్తించి, వాటిపై దాడి చేసి నాశనం చేసేలా శిక్షణ ఇస్తుంది. దీనికి తోడుగా ఇచ్చే కీట్రూడా మందు క్యాన్సర్ కణాలపై చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.
ఇంకా ప్రయోగాల దశలోనే..
అయితే ఈ చికిత్స ప్రస్తుతానికి ఇంకా ప్రయోగాల దశలోనే ఉంది. ప్రజల వాడకానికి ఇంకా అనుమతి రాలేదు. మెలనోమాతో పాటు ఊపిరితిత్తుల, కిడ్నీ, బ్లాడర్ క్యాన్సర్లలో కూడా ఈ వ్యక్తిగత mRNA వ్యాక్సిన్ పనితీరును పరిశీలిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ పనితీరును తెలుసుకోవడానికి ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తాజా ఫలితాలు గణాంకపరంగా, వైద్యపరంగా ఎంతో ముఖ్యమైవిగా సదరు సంస్థలు పేర్కొన్నాయి. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో జరగబోయే ఒక వైద్య సదస్సులో అధికారికంగా వెల్లడించనున్నారు.
Also Read..
అమెరికా టూర్ కేన్సిల్.. సీఎం రేవంత్ విదేశీ పర్యటన కుదింపు
సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ
తాజావార్తలు
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ
- ●US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..
- ●Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు
- ●IIT Madras | ఐఐటీ మద్రాస్‌లో మెడిసిన్.. ఇంజినీర్లతోపాటు వైద్యులు కూడా..
- ●Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ - సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?

Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం

Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..

Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు



