త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SBI | ఎస్‌బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమ‌లు..

SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాదారులకు సంబంధించిన సర్వీస్ ఛార్జీలను సవరించింది. కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం బీఎస్‌బీడీ ఖాతాదారులకు నెలకు మొత్తం 4 నగదు ఉపసంహరణలు ఉచితంగా ల‌భిస్తాయి.

S

Business | Published On Aug 20, 2026, 12.27 pm IST

SBI | ఎస్‌బీఐ ఖాతాదారులకు కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 1 నుంచి అమ‌లు..
Advertisement

SBI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాదారులకు సంబంధించిన సర్వీస్ ఛార్జీలను సవరించింది. కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం బీఎస్‌బీడీ ఖాతాదారులకు నెలకు మొత్తం 4 నగదు ఉపసంహరణలు ఉచితంగా ల‌భిస్తాయి. ఈ నాలుగు ఉచిత ఉపసంహరణలు పూర్తయిన తర్వాత ప్రతి అదనపు నగదు ఉపసంహరణకు రూ.15తోపాటు జీఎస్‌టీని ఎస్‌బీఐ వసూలు చేయనుంది. అయితే ఈ నాలుగు ఉచిత ఉపసంహరణలను లెక్కించే విధానంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు డిజిటల్ లావాదేవీలను నెలవారీ నాలుగు ఉచిత ఉపసంహరణల పరిమితిలో పరిగణించేవారు కాదు. అయితే అక్టోబర్ 1 నుంచి డిజిటల్ లావాదేవీలు కూడా ఈ నాలుగు ఉచిత ఉపసంహరణల లెక్కలోకి వస్తాయి.

బీఎస్‌బీడీ అంటే..

ఈ నాలుగు ఉచిత ఉపసంహరణల్లో ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల ద్వారా నగదు తీసుకోవడం, బ్యాంకు శాఖల ద్వారా నగదు ఉపసంహరణలు, డిజిటల్ లావాదేవీలు కూడా ఉంటాయి. ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతా కనీస నిల్వను నిర్వహించాల్సిన అవసరం లేకుండా ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను పొందాలనుకునే వారి కోసం అందుబాటులో ఉంది. ఈ ఖాతాలో ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఖాతాదారులు ఉపసంహరణ ఫామ్ ద్వారా బ్యాంకు శాఖల నుంచి నగదు తీసుకోవచ్చు. అలాగే ఏటీఎంల ద్వారా కూడా నగదు ఉపసంహరించుకోవచ్చు. ఎస్‌బీఐ ఈ ఖాతాదారులకు ప్రాథమిక రూపే ఏటీఎం-కమ్-డెబిట్ కార్డును అందిస్తుంది. అయితే ఈ ఖాతాకు చెక్కుబుక్ సదుపాయం ఉండదు.

సేవ‌లు ఉచిత‌మే, అయినా..

బీఎస్‌బీడీ ఖాతాదారులకు పలు సేవలు ఇప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయి. ప్రాథమిక రూపే ఏటీఎం-కమ్-డెబిట్ కార్డు జారీ, దాని వార్షిక నిర్వహణకు ఎలాంటి ఛార్జీ ఉండదు. అలాగే ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌ వంటి మార్గాల ద్వారా ఖాతాలోకి వచ్చే ఎలక్ట్రానిక్ క్రెడిట్లపైనా ఛార్జీలు ఉండవు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన చెక్కులను డిపాజిట్ చేయడం లేదా వాటి సేకరణకు కూడా ఎలాంటి ఛార్జీ వసూలు చేయరు. అదేవిధంగా ఇనాపరేటివ్‌గా మారిన ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయడానికి ఎస్‌బీఐ ఛార్జీలు విధించదు. అయితే ఖాతాను మూసివేయడానికి సంబంధించిన ఛార్జీలు వర్తిస్తాయి. ఎస్‌బీఐ బీఎస్‌బీడీ ఖాతా తెరవడానికి కొన్ని అర్హత నిబంధనలు ఉన్నాయి. బీఎస్‌బీడీ ఖాతాను కలిగి ఉన్న కస్టమర్ ఎస్‌బీఐలో మరో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను కలిగి ఉండకూడదు. ఇప్పటికే ఎస్‌బీఐలో సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉన్న వ్యక్తి బీఎస్‌బీడీ ఖాతాను తెరిస్తే, పాత సేవింగ్స్ ఖాతాను 30 రోజుల్లోగా మూసివేయాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement