Supreme Court | సీఈసీ నిర్ణయాలపై విచారణకు సుప్రీం అంగీకారం
Supreme Court | ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) నేతృత్వంలో ఎన్నికల సంఘం (ECI) పనితీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) నేతృత్వంలో ఎన్నికల సంఘం (ECI) పనితీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. స్పందించిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను వచ్చే వారం విచారిస్తామని స్పష్టం చేసింది.
న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో పలు కీలక అంశాలను లేవనెత్తారు. ఎన్నికల సంఘం (ECI) నిబంధనల ప్రకారం బహుళ సభ్యులు ఉండే ఈ రాజ్యాంగ సంస్థలో ఏ నిర్ణయమైనా సమిష్టిగా, ఏకగ్రీవంగా లేదా మెజారిటీ ప్రాతిపదికన మాత్రమే తీసుకోవాల్సి ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే, సీఈసీ మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు, ఫారమ్-6 మార్పులు, ECINet ద్వారా ఓటర్ల డేటా కేంద్రీకరణ వంటి కీలక నిర్ణయాలను మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే సీఈసీ ఒంటెద్దు పోకడతో తీసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఆయన ఏకపక్ష నిర్ణయాల కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతైనట్లు పిటిషన్‌లో ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలన్నింటినీ చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని అందులో కోరారు. అంతేకాదు, సర్ ప్రక్రియలో భాగంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించడంపై సిట్‌తో దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జ్ఞానేశ్ కుమార్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనీష్ గార్గ్, డైరెక్టర్ జనరల్ సీమా ఖన్నాలపై క్రిమినల్ విచారణకు ఆదేశించాలని అభ్యర్థించారు.
Also Read..
బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..
సంబంధిత వార్తలు

CEC Gyanesh Kumar | వందకు కోటి పర్సెంట్ జ్ఞానేశ్వర్ కుమార్ పదవీచ్యుతుడవుతాడు.. బల్ల గుద్ది చెప్పిన వేణు స్వామి..!
సెప్టెంబర్ 28, 2026

Danam Nagender | దానం నాగేందర్ ఎమ్మెల్యే కాదు.. ఖైరతాబాద్ స్థానం ఖాళీగా ప్రకటిస్తూ గెజిట్
సెప్టెంబర్ 28, 2026

Dushyant Dave | సుప్రీంకోర్టులో లెక్కలేనంతమంది అవినీతి జడ్జీలు.. న్యాయ వ్యవస్థలో ధనవంతులకే అధిక ప్రాధాన్యత : దుష్యంత్ దవే
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●TTD | తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు.. ఏయే తేదీల్లో అంటే?
- ●Telangana Movies | టాలీవుడ్ ఇలాఖాలో తెలంగాణ ధూమ్‌ధామ్
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..
- ●Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..
- ●Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి
- ●Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు

TTD | తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు.. ఏయే తేదీల్లో అంటే?

Telangana Movies | టాలీవుడ్ ఇలాఖాలో తెలంగాణ ధూమ్‌ధామ్

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. డాలర్ బలపడడంతో ఒత్తిడి..

Dr. Nori Lakshmi Bhaskar | నిమ్స్ బార్బర్ ఇంట్లో నోట్ల కట్టలు.. డాక్టర్ లక్ష్మీభాస్కర్ అవినీతి వ్యవహారంలో కొత్త లింకులు..



