త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త‌.. డాల‌ర్ బ‌ల‌ప‌డ‌డంతో ఒత్తిడి..

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో భారీ న‌ష్టాలు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆ ప్ర‌భావం బులియ‌న్ మార్కెట్ల‌పైనా ప‌డింది. అమెరికా ట్రెజ‌రీ బాండ్ ఈల్డ్స్ రాబ‌డులు అధిక‌మ‌వుతున్న కార‌ణంగా బంగారంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పెట్టుబ‌డిదారులు బంగారాన్ని విడిచిపెట్టి డాల‌ర్‌పై పెట్టుబ‌డులు పెడుతున్నారు.

S

Business | Published On Sep 29, 2026, 11.35 am IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త‌.. డాల‌ర్ బ‌ల‌ప‌డ‌డంతో ఒత్తిడి..
Advertisement

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో భారీ న‌ష్టాలు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆ ప్ర‌భావం బులియ‌న్ మార్కెట్ల‌పైనా ప‌డింది. అమెరికా ట్రెజ‌రీ బాండ్ ఈల్డ్స్ రాబ‌డులు అధిక‌మ‌వుతున్న కార‌ణంగా బంగారంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పెట్టుబ‌డిదారులు బంగారాన్ని విడిచిపెట్టి డాల‌ర్‌పై పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఫ‌లితంగా డాల‌ర్ బ‌ల‌ప‌డుతోంది. బంగారం ధ‌ర‌లు త‌గ్గుతున్నాయి. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో మంగ‌ళ‌వారం బంగారం, వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ త‌గ్గాయి. ఉద‌యం సెష‌న్‌లో ధ‌ర‌లు కాస్త త‌గ్గిన‌ప్ప‌టికీ త‌రువాత కాస్త లాభాల్లో కొన‌సాగాయి. ఔన్స్ బంగారం ధ‌ర 0.57 శాతం పెరిగి 4,137 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.14 శాతం పెరిగి 60 డాల‌ర్ల‌కు చేరింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1976 పాయింట్లు పెరిగి 1,48,780 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1792 పాయింట్లు త‌గ్గి 2,25,650 వ‌ద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,880 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,19, 040 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,48,800 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,88,000 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.13,700 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,640 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,09,120గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,36,400 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,64,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.12,500 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,160 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.89,280గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,11,600 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,16,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.10,300 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,40,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,44,900 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,449 గా ఉంది.

Advertisement
Advertisement