TTD | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఫిబ్రవరి దర్శనాలు, గదుల కోటా రిలీజ్ డేట్స్ ఇవే..!
TTD | కలియుగ వైకుంఠం తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. 2027 ఫిబ్రవరి నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. నవంబర్ 18 నుంచి విడతల వారీగా ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. భక్తులు నిర్ణీత తేదీలు, సమయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
Devotional | Published On Nov 15, 2026, 10.08 am IST
TTD | కలియుగ వైకుంఠం తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. 2027 ఫిబ్రవరి నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. నవంబర్ 18 నుంచి విడతల వారీగా ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. భక్తులు నిర్ణీత తేదీలు, సమయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
18న ఆర్జిత సేవా టికెట్లకు ఎలక్ట్రానిక్ డిప్
శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన టికెట్ల కోటాను నవంబర్ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ సేవల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న భక్తులు నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో టికెట్లు కేటాయించిన వారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
21న ఇతర ఆర్జిత సేవలు
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించిన టికెట్లను నవంబర్ 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి అనుసంధానంగా లభించే దర్శన స్లాట్ల కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు. నవంబర్ 23న భక్తుల కోసం పలు రకాల దర్శన టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం కేటాయించిన ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను విడుదల చేయనుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటా
ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల కోటాను నవంబర్ 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, వివిధ రకాల దర్శన టికెట్లు, వసతి గదుల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించి బుకింగ్ చేసుకోవాలని సూచించారు. టికెట్ల విడుదల సమయాలను ముందుగానే గమనించి, ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ కోరింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

ED Seizes | మాజీ ముఖ్యమంత్రి తనయుడికి ఈడీ షాక్.. రూ.61 కోట్ల ఆస్తులు సీజ్!
నవంబర్ 15, 2026

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
నవంబర్ 15, 2026

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
నవంబర్ 15, 2026
తాజావార్తలు
- ●ED Seizes | మాజీ ముఖ్యమంత్రి తనయుడికి ఈడీ షాక్.. రూ.61 కోట్ల ఆస్తులు సీజ్!
- ●DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం
- ●Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!
- ●Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం
- ●Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
- ●Nariman House | యూదులే లక్ష్యంగా నారిమన్ హౌస్ వద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువకుడు అరెస్ట్

ED Seizes | మాజీ ముఖ్యమంత్రి తనయుడికి ఈడీ షాక్.. రూ.61 కోట్ల ఆస్తులు సీజ్!

DK Shivakumar | నా వద్ద డబ్బుల్లేవు.. నా టికెట్ కూడా మీరే తీసుకోండి.. ప్రధాని మోదీతో కర్ణాటక సీఎం

Adventure Motorcycles | బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి మూడు అడ్వెంచర్ బైక్స్.. ఇంజిన్, ఫీచర్లు ఇవే!

Private Travel Bus | దుండిగల్‌లో ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. ఐదు బస్సులు దగ్ధం



