Supreme Court | విదేశీ విడాకులు భారత్‌లో చెల్లవు.. ఎన్నారైలకు సుప్రీం బిగ్ షాక్
Supreme Court | భారతదేశంలో జరిగిన వివాహాలకు సంబంధించి విదేశీ కోర్టులు ఇచ్చే విడాకుల డిక్రీలకు భారత్‌లో ఆటోమేటిక్‌గా చట్టబద్ధత ఉండదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. అటువంటి విడాకుల ఆధారంగా రెండో వివాహం చేసుకునే వ్యక్తులు భారతీయ చట్టాల ప్రకారం ద్వైవివాహ నేరం (Bigamy) కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : ఎన్నారైలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) బిగ్ షాకిచ్చింది. చాలా మంది భారత్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొని.. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విదేశీ చట్టాలను అనుసరిస్తూ అక్కడే విడాకులు (divorce) తీసుకుని రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి వాటికి చెక్ పెడుతూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారతదేశంలో జరిగిన వివాహాలకు సంబంధించి విదేశీ కోర్టులు ఇచ్చే విడాకుల డిక్రీలకు భారత్‌లో ఆటోమేటిక్‌గా చట్టబద్ధత ఉండదని స్పష్టం చేసింది.
అటువంటి విడాకుల ఆధారంగా రెండో వివాహం చేసుకునే వ్యక్తులు భారతీయ చట్టాల ప్రకారం ద్వైవివాహ నేరం (Bigamy) కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు వివాహ బంధం పూర్తిగా విచ్ఛిన్నమైంది (Irretrievable breakdown of marriage) అనే కారణంతో బ్రిటన్ కోర్టు (UK Court) ఇచ్చిన విడాకులను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీచంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఏ విదేశీ కోర్టు తీర్పు అయినా భారత్‌లో చెల్లుబాటు కావాలంటే అది సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 13 నిబంధనలకు లోబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
జీవిత భాగస్వామి విదేశీ కోర్టు అధికార పరిధికి అంగీకరించకపోయినా లేదా భారత చట్టాలకు విరుద్ధంగా తీర్పు వచ్చినా ఆ డిక్రీ చెల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు వివాహ బంధం పూర్తిగా విచ్ఛిన్నమైంది (Irretrievable breakdown of marriage) అనే కారణంతో విదేశీ కోర్టులను ఆశ్రయించి విడాకులు పొంది ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తిపై ద్వైవివాహ నేర విచారణకు ధర్మాసనం అనుమతించింది. విదేశీ విడాకులు భారత్‌లో చెల్లనప్పుడు, మొదటి వివాహం చట్టపరంగా కొనసాగుతున్నట్లేనని ధర్మాసనం తెలిపింది. అటువంటి పరిస్థితుల్లో రెండో వివాహం చేసుకుంటే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 82 కింద శిక్షార్హమైన నేరంగా పరిగణించి క్రిమినల్ విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Also Read..
2027 ఎన్నికల్లో బీజేపీకి శాశ్వత ఓటమి తప్పదు : అఖిలేష్ యాదవ్
సంబంధిత వార్తలు

Supreme Court | డిజిటల్ అరెస్టు మోసాలకు చెక్.. వాట్సాప్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
నవంబర్ 10, 2026

Pawan Kalyan | మూడోసారి పవన్ కల్యాణ్ విడాకులు.. అన్నా లెజినోవాతో డివర్స్
నవంబర్ 10, 2026

Cyber Criminals | సైబర్ నేరగాళ్లకు సమాజంలో చోటు లేదు.. జైళ్లలో మగ్గిపోవడమే వారికి సరైన శిక్ష : సుప్రీంకోర్టు
నవంబర్ 6, 2026
తాజావార్తలు
- ●Green India Challenge | ప్రతి ఇంట్లో ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వ మొక్కలు నాటుతాం.. ప్రజలకు అవగాహన కల్పిస్తాం
- ●Bigg Boss | బిగ్బాస్ హౌజ్లో ఎంగేజ్మెంట్ - ప్రియురాలికి ప్రపోజ్ చేసిన శివకుమార్
- ●Women's Commission | లైంగిక ఆరోపణల కేసు.. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన వీసీ జానయ్య
- ●Stock Market | 75 శాతం వరకు లాభాలిచ్చే 10 స్టాక్స్.. ధరలు కూడా తక్కువే..
- ●RS Praveen Kumar | వియత్నాం ‘గ్రీన్ ఎస్ఎం’ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిందెవరు?
- ●EFLU | యూజీసీ నెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఇఫ్లూ

Green India Challenge | ప్రతి ఇంట్లో ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వ మొక్కలు నాటుతాం.. ప్రజలకు అవగాహన కల్పిస్తాం

Bigg Boss | బిగ్బాస్ హౌజ్లో ఎంగేజ్మెంట్ - ప్రియురాలికి ప్రపోజ్ చేసిన శివకుమార్

Women's Commission | లైంగిక ఆరోపణల కేసు.. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన వీసీ జానయ్య

Stock Market | 75 శాతం వరకు లాభాలిచ్చే 10 స్టాక్స్.. ధరలు కూడా తక్కువే..



